Ayushman gouda

Children Stories

3  

Ayushman gouda

Children Stories

అన్నదమ్ములు

అన్నదమ్ములు

1 min
199


విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ. అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు లేరు.


రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడి పోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన పదెకరాల పొలాన్ని చెరో అయిదేసి ఎకరాల చొప్పున పంచుకున్నారు.


కుటుంబాలు విడిపోయినా అన్నయ్యకు ఇద్దరు పిల్లలు. ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం...' అనే భావన లక్ష్మణుడికి ఉండేది. అందుకనీ పంట చేతికొచ్చిన ప్రతిసారీ ఎవరూ లేని సమయంచూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపుకొట్టులో వేసేవాడు.


అన్నదమ్ములు అన్నదమ్ముల మధ్య ప్రేమాను రాగాలు తగ్గలేదు. 'నాకు పిల్లలు లేరు. నా భార్యా నేనూ ఉన్న దాంతో సర్దుకోగలం.


'నా కొడుకులు ఏదో ఒకరోజు అందివస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు. వాడికి వయసు పెరిగేకొద్దీ బతుకు భారమవుతుంది' అని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపురాశిలో పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు.


ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్లపాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపుకొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఎంతో ఆనందిం చారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు.


Rate this content
Log in