హృదయ అంకిత

Horror Thriller Others

4.5  

హృదయ అంకిత

Horror Thriller Others

అర్థ రాత్రి ఆ రూంలో

అర్థ రాత్రి ఆ రూంలో

5 mins
353


అర్థరాత్రి గీత చాలా భయంగా తన చేతిలో ఒక ఆరేళ్ల పాప చిట్టి ని పట్టుకొని రోడ్డు పై నడుస్తుంది.తన మనసులో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి. ఉన్నట్టు0డి బావగారు ఎందుకు ఆమెరికా వెళ్లిపోయారు.తనకు ఈ విషయం ముందుగానే తెలుసా..?తెలిస్తే తను ఎదో ఒకటి చేసి ఉండొచ్చు కదా..? చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదేమో. .?తను వెళ్తూ;గొడవపడి మరి పెద్ద పాపను ,చిన్న బాబు ని తీసుకుని వెళ్లాడు.మరి చిట్టి ని ఎందుకు తీసుకుని వెళ్లలేదు...?అంటే చిట్టి కూడా. ..😲😲అని తన మనసులో ఆ రూమ్ లో చూసింది గుర్తు రాగానే ఒక్కసారిగా చిట్టి చేయి వదిలేసి, రెండడుగులు నడిచి మళ్లీ చిట్టి ని చూసింది.తనకి పెళ్లి కాకపోయినా,తనలో ఉన్న మాతృమూర్తి తనని ముందుకు కదలనివ్వటం లేదు.చిట్టి చీకటి కి భయపడి ,గీత తనని వదిలి వెళ్తుందేమో అని పిన్ని అని పిలుస్తూ,గీత ని గట్టిగా పట్టుకున్నది.. ఎదైతే అది కాని నేను నిన్ను విడిచి వెళ్లను అని చిట్టి ని ఎత్తుకొని నడుస్తోంది.తనని ఎవరో వెంబడిస్తున్నట్టుగా తోచింది.వెనుకకు తిరిగి చూసింది.అల్లంతా దూరంలో గోడ చాటున దాక్కుని ఎవరో ఉన్నారు. తన నీడ వీధి దీపాల వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నది.అవును అది తనే ...గీతకి కింద ఉన్న భూమి కంపిస్తున్నట్టుగా ఉంది. గీత ఒళ్లు చెమటతో నిండిపోయి0ది.గు0డె వేగం అంతకంతకు పెరిగిపోతు0ది.చిట్టిని చూసింది తను పడుకున్నది


.రాత్రి ఏం తినకపోవటం వల్ల చాలా నిరసంగా కూడా ఉంది. ఇప్పుడు ఎదైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.లేకు0టే మిగతా అందరి లా ఇద్దరం కూడ బలికావలసి0దే అని ఆలోచించిన తర్వాత తన మొబైల్ నుంచి తనకు పరిచయం ఉన్న అంబులెన్స్ డ్రైవర్ ముక్తకి మెసెజ్ పెట్టింది. "పాపకి సీరియస్ ముక్త పాపతో నేను ××××××××రోడ్డు లో ఉన్నాను తొందరగా రా" అని పెట్టింది. మెల్లగా నడక మొదలు పెట్టింది.కాసేపటికి ముక్త నుంచి 5 మినిట్స్ లో ముందర ఉంటాను అని మెసేజ్ వచ్చినది. అప్పటి వరకు నాతో పాటు పాపను కూడ రక్షించాలని అనుకున్నది.

అసలు ఏం జరిగి0దంటే :

 గీత,మధుబాల అక్కచెల్లెల్లు.వీరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు గా పెరిగాయి. మధుబాల కి కిరణ్ తో పెళ్ళి జరిగింది.ఒకసారి గీత తల్లిదండ్రులు ఎదో ఫంక్షన్ అని మధుబాల ఇంటికి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో ఆ ఊరి పొలిమేర లో తోడేలు దాడి చేసి చంపేసి0ది.వారి దేహాలు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండ మారిపోయాయి. గీత జాబ్ చేయటం వల్ల వర్క్ ఉండి ఫంక్షన్ కి వెళ్లలేదు..తర్వాత రోజు ఉదయాన్నే ఆ ఊరిలో వార్త బాగా హల్చల్ అయింది.అందరు చూడటానికి వెళ్లారు.అలాగే కిరణ్, మధుబాల కూడా వెళ్లారు.ఆ శవాలను ఉన్న బట్టల ఆధారంగా కిరణ్ వారిని గుర్తించి, మధుబాల తో చెప్పాడు.ఆ శవాలను ఫోరేన్సిక్ క్లబ్ కి తీసుకెళ్ళి,పరీక్షలు నిర్వహించి తర్వాత ఇది ఒక క్రూర మృగం పనని నిర్దారణ చేసారు.మధుబాల ఊరిలో నుంచి 1 కి. మీ దూరంలో బస్సు స్టాప్ ఉంటుంది. ఆ రోజు ఎంత చెప్పిన వినకుండా గీత ఒక్కతే ఇంట్లో ఉందని లాస్ట్ బస్ పోతే మళ్లీ రేపు 10.00 గంటల వరకు ఇక్కడే ఉండాలి .అని చెప్పి బయలు దేరారు.అప్పుడే ఇలా అయిపోయింది. ఇక గీత ఒక్కతే ఆ ఇంట్లో ఉండలేకపోయినది తన ఆఫీస్ వారు వర్కర్స్ కోసం కేటాయించిన రూమ్ కి షిప్ట్ అయ్యాక, కొన్ని రోజులకు కిరణ్ వాళ్ల తాతయ్య కూడా ఆ మృగం చేతిలో సేమ్ గీత పేటెంట్స్ చనిపోయిన విధంగానే చనిపోయారు.విచిత్రం ఏమిటంటే ఈ సారి ఆయన కిరణ్ వాళ్ల ఇంటి పెరట్లో చనిపోయారు. ఏమి జరుగుతున్నదో ఎవరికి అర్థం కాలేదు.ఇక కరోనా వల్ల ఆఫీస్ వారు లాక్ డౌన్ విధించడంతో గీత ఇంటికి వెళ్లింది.ఒకసారి పిల్లలను చూడటానికి అని అక్క వాళ్ల ఇంటికి  వెళ్తుండగా దారిలో ఒక చోట బావగారు,ఇద్దరు పిల్లలు ఉన్నారు వెంటనే గీత బస్సు దిగి అతని వైపు వెళ్లే లోపే ఆయన వేరొక బస్సు ఎక్కి వెళ్లిపోయారు.గీతకి ఏమి అర్దం కాలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడి అడుగుదామ్లే అని ఆయన లాస్ట్ బస్ ఎక్కి ఆ ఊరికి వెళ్లింది.ఇక అక్కడ ఇళ్లు చేరిన తర్వాత డోర్ బయట నుంచి క్లోజ్ చేసి ఉన్నది.గీత డోర్ ఓపెన్ చేసి, అక్క ని బావ గురించి అడిగితే దానికి మధుబాల  ఆయన నన్ను చిట్టి ని వదిలేసి ఆమెరికా కి వెళ్తున్నారు. ..అని గీత ని కౌగిలించుకొని బాగా ఏడిచినది.గీత ఎ0దుకు వదిలేసారు అక్క పిల్లల ని తీసుకుని వెళ్తు0టే నువ్ ఏమి చేస్తున్నావ్. 


ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడే0టి కొత్తగా ముగ్గురు పిల్లలు పుట్టాక. మౌనంగా ఎడవసాగినది మధుబాల. కాసేపు తరువాత మధుబాల మీ బావ నేను పిల్లలని తీసుకెళ్లనివ్వని బయట డోర్ పెట్టి వెళ్లాడు. ఉండవే నేను పెరట్లో ఎమైన కూరగాయలు ఉంటే తెస్తాను అని పెరట్లోకి వెళ్లింది. ఆప్తుడు గీత స్విచ్చాఫ్ అయిన మొబైల్ చార్జ్ పెట్టుకుని,అక్కడ వాళ్ల ఇంటి పక్కన ఉన్న పెద్ద అత్త గారికి కనిపి0చి వద్దామని ఇంటి బయటకి వచ్చింది ఆ వీధి మొత్తం నిర్మానుష్యంగాఉన్నది. గోడ గడియారం వంక చూస్తే టైమ్ 8.30 అవుతున్నది. ఇదేంటి ఇంత త్వరగా పడుకున్నారు.ఒక్కరు కూడా లేరు అని ఆలోచిస్తూ అతమ్మ వాళ్ల ఇంటి డోర్ కొడుతూ పిలిచినది.అమా0తం ఎవరో లోపలి నుంచి గీత చేయి పట్టుకొని లోపలికి లాగారు . గీత భయంతో అరిచి చూస్తే అది వాళ్ల అత్తయ్య.అత్తయ్య చెప్పినది వినగానే గీత రోమాలు నిక్కబొడుచుకున్నాయి.తన అక్క ఒక మృగం లా అర్థరాత్రి అందరినీ చంపుతున్నది తెలిసి నమ్మలేకపోయినది. ఈ సంగతి అందరికీ ఈ రోజు సాయంకాలం బావ ఊరిలో చెప్పి ,మధుబాల కి తెలియకుండా బయట డోర్ వేసి,పోలీసులకి కాల్ చేసి,ఊరంతా దండోరా వేయించారు. అందుకే బయట ఎవరు లేదు.నీకు కాల్ చేస్తే  స్విచ్చాఫ్ వచ్చింది. అని అంటున్నా అత్త తో గీత దుడుసుగా ఆపండి అత్తయ్య మీ అబ్బాయి ని కప్పిపుచ్చటానికి ఇలా మాట్లాడుతున్నారా..?ఉ0టా. మీ అబ్బాయి పై కేస్ పెట్టి స్తా అని ఆ ఇంటి నుంచి ఆమె ఎంత చెప్పిన వినకుండా గీత వచ్చినది. చిట్టి బొమ్మల తో ఆడుతున్నది.అక్క ఇంకా రావటం లేదని చిట్టి చేయి పట్టుకొని పెరట్లోకి వెళ్లింది పెరట్లో ఎక్కడ మధుబాల కనిపి0చలేదు. అక్కడ అంతా ఎదో దుర్వాసన భరించలేకు0డా వస్తున్నది.అక్కడ కూలిపోయిన పాత ఇల్లు ఉన్నది.అందులో నుంచి కర్ కర్ మని ఎదో జంతువుల ఎముకలు తింటున్నా శబ్దం వస్తున్నది.గీత చిట్టి ని ప్రక్కన నిలబెట్టి మెల్లగా అక్కడ ఉన్న చిన్న రాయిపై నిలబడి కిటికి ను0చి చూస్తే,అందులో మధుబాల చిన్న దీపపు వెలుగులో ఒక మనిషి శరీరాన్నినోటితో చీల్చి తింటున్నది.తన నోటివెంట రక్తం ధారలు మెడ దగ్గర దాక కారుతున్నాయి.



భయంతో గీత కాళ్లు ,చేతులు వణుకుతున్నాయి.మెల్లగా దిగి చిట్టి ని తీసుకుని తొందరగా అత్తయ్య డోర్ తీయండి అని అరిచింది.ఎవ్వరు సమాధానం ఇవ్వలేదు.గీత రూమ్ లోకి వెళ్లి మొబైల్ తీసుకుని చిట్టి ని పట్టుకొని వీధిలోకి వచ్చింది.కాని ఎవరిని డోర్ తెరవమన్న తెరవలేదు. ఇక ఏమీ చేయలేక ఆ ఊరి నుంచి ఎలాగైనా బయటపడాలని నిర్ణయించుకు0ది.

ప్రస్తుతం

దిక్కు తోచని పరిస్థితుల మెల్లగా నడుస్తూ దాదాపు హైవే దగ్గరి దాకా వచ్చింది.మధుబాల కూడ చాలా దగ్గరగా వెనుకాలే నడుస్తూ గంభీరమైన గొంతుతో "గీత ఎక్కడి దాకా వెళ్తావ్."అని అనగానే గీత ప్రాణం పోయినట్టు అనిపించినది. అప్పుడు గీత అక్క ప్లీజ్ ఏమీ చేయకు అని అన్నా పట్టించుకోకు0డా తన చేతులకు కారుతున్న రక్తాన్ని నాకుతూ దగ్గరకు రాసాగి0ది. అప్పుడు గీత అక్క నేను నిన్ను బాగా చూసుకుంటాను. మన ఇంటికి వెళ్దా0 అని ఎన్నో విధాలుగా బ్రతిమిలాడినది. ఇంత సేపు ఈ చిన్న దాన్ని తింటే నా ఆకలి తీరదని చాలా బాధపడ్డాను కరెక్ట్ టైమ్ కి వచ్చావ్ అంటు నాలుకను ఊరి స్తూ వస్తున్నది గట్టిగా గీత మెడ పట్టుకున్నది.చిట్టి కింద పడిపోయింది. మమ్మీ అని ఎడవటం మొదలు పెట్టింది. అపస్మారక స్థితిలోకి వెళ్లే టైమ్ కి ముక్త అంబులెన్స్ తో వచ్చాడు.అక్కడి పరిస్థితుని అర్థం చేసుకొని ఒక రాడ్ తీసుకుని బలంగా కొట్టాడు.మధుబాల గట్టిగా మూలుగుతూ చనిపోయినది.పాపను తీసుకుని వెళ్లింది.తరువాత కిరణ్ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది.పాపని ఎ0దుకు తీసుకుని వెళ్లలేదు అని అడిగితే,కిరణ్ పాప మధుబాల తో పాటు రూమ్ లో ఇరుక్కుపోయినది.అప్పటికే నేను మధుబాల ని మృగం లా చూసినప్పుడు తను నన్ను చూసింది.ఆ హడావిడి లో బాబు,పాప ని తీసుకుని రూమ్ లోకి వెళ్ళగానే తను వచ్చింది.నేను బీరువా వెనుక దాక్కుని మధుబాల వంటరూమ్ లోకి వెళ్ళగానే ముగ్గురు పిల్లలను తీసుకుని రావాలనుకున్న కాని చిట్టి అప్పుడే మధుబాల దగ్గరకు వెళ్ళింది.మధుబాల చిట్టి ని పట్టుకొని నన్ను బయటకు రమ్మని పిలిచింది.అలా చేస్తే మిగతా ఇద్దరు పిల్లలకు కూడా ప్రమాదం అని వారిని తీసుకుని డోర్ బయట నుంచి లాక్ చేసి అక్కడి నుంచి నేరుగా నీ దగ్గరకు వచ్చా కానీ నువ్వు లేవు అని చెప్పాడు.అప్పుడు గీత మనసులో కుదుటపడింది



Rate this content
Log in

Similar telugu story from Horror