హృదయ అంకిత

Crime Inspirational Others

4.7  

హృదయ అంకిత

Crime Inspirational Others

మూగబోయిన వసంతం

మూగబోయిన వసంతం

15 mins
411



అడుగడుగునా కామాంధులు నిండిన సమాజంలో, ఒక ఆడపిల్లను కేవలం మాంసపు ముద్దగా చూసే కొందరు ఆగంతకుల మధ్య. ..  తన స్వేచ్ఛను కోరుకుంటూ తన కాళ్లపై తను నిలబడాలని బయలుదేరి ఒక కామా పిశాచి చేతిలో చిక్కిన ఒక స్త్రీ కథ ఈ " మూగబోయిన వసంతం - ఓ స్త్రీ వేదన" .

ఇట్లు

ముండ్రాతి. రజిత


కాలాలు మారుతున్నాయి.అభివృద్ది, టెక్నాలజీ అంటూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న కూడా, ఒక ఆడపిల్లపై ఆరాచకాలు, ఆగయిత్యాలు, ఆత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. ఎన్నో కథలు కానీ ముగింపు ఒకటే. అమాయకమైన అమ్మాయి జీవితం బలి కావటం. అలాంటి కథలలో ఇది ఒక యాథార్థ గాథ.

                                                      

                                    ఈశ్వర్, మౌనిక ఇద్దరు దంపతులు. వీరిది చిన్న పల్లెటూరు. ఈశ్వర్ కి ఒక ప్రైవేటు కంపెనీలో మంచి జాబ్ రావటంతో పట్నానికి మారారు. మౌనిక, ఈశ్వర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంట్లో పనులన్నీ చక్కపెడుతుంది. వీరి అన్యోన్యమైన దంపత్యానికి గుర్తుగా భారతి జన్మించింది.భారతి చిన్నతనం నుంచే ఆటలో, చదువులో ఎప్పుడూ తానే ముందు ఉండేది. చూడటానికి అందంగా ఉంటుంది దానితో పాటు అంతే పెద్ద మనసు ఉంది. తాను ఎదుగుతూ ఉన్నా కొలది... చదువుకున్న చదువు వల్లనో, తన తండ్రి ఇచ్చిన స్వేచ్ఛ వల్లనో తెలియదు కానీ తను స్వతంత్ర పౌరురాలినని. తను చదువుకున్న చదువును , నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరువాత తరానికి పంచాలని కలలు కనేది. ఆ కలలను నిజం చేసుకోవటానికి ఒక పాఠశాలలో పని చేస్తూ సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత వీధిల్లో కనిపించే ఉన్న పేద పిల్లలకు ఉచితంగా న్యూషన్లు చెప్పేది. బడికి వెళ్లలేని ఎంతో మంది బాల కార్మికులు భారతి చెప్పే పాఠాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అంత చిన్న వయసులోనే అంత గొప్ప పనులు చేస్తున్న తన కూతుర్ని చూసి ఈశ్వర్, మౌనిక చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. కొద్ది రోజుల వ్యవధిలోనే

పట్నంలో స్థిరపడిన ఈశ్వర్ చాలా డబ్బు సంపాదించి ఉన్నంతలో మంచి

ఇల్లు కట్టుకున్నాడు.

పెళ్లి వయసు రావటంతో భారతికి పెళ్లి చేయాలని మౌనిక ఈశ్వర్ తో తన మనసులోని మాట చెప్పింది. కానీ సంస్కరణ లక్షణాలు ఉన్న ఈశ్వర్ "అమ్మాయికి ఇప్పుడు ఏమంత వయసు వచ్చింది. ఇరవై రెండు ఏళ్లకే మన మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తను నిలబడటమే కాకుండా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెబుతుంది. పైగా తన సొంత డబ్బులతో ఇద్దరు పిల్లలను కూడా చదివిస్తుంది. మన లాంటి కూతురు ఈ సమాజానికి చాలా అవసరం. నేటి ఆడపిల్లలు తనను ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని నేను కలలు కంటుంటే.... అప్పుడే అమ్మాయి పెళ్లి చేసి దాని జీవితం కుటుంబం , పిల్లలకే పరిమితం చేస్తానంటావేంటే...అంటూ ఈశ్వర్ భారతి పెళ్లికి అడ్డు చెప్పాడు. " అది కాదండి. అసలే ఒక్కనొక్క బిడ్డ. దాన్ని ఇలా సమాజం, సంస్కరణలు అంటూ చెప్పి పెంచారు. బయట రోజులు బాగాలేవండి. రేపేమైన జరగరానిది జరిగితే.... అందుకే పెళ్లి చేస్తే హాయిగా పిల్లపాపలతో మన ముందే ఉంటుంది. అప్పుడు కూడా ఇలాగే తన భర్తతో పాటు అందరికి సహాయం చేస్తుంది కదా" అంటూ తన తల్లి ప్రేమను బయటపెట్టింది." సరే భారతికి ఒక మాట చెప్పి  ఆలోచిస్తాను" అంటూ భారతి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొద్ది సేపటికి భారతి ఇంటికి వచ్చింది. భారతి వచ్చిన తర్వాత ఇద్దరు నెమ్మదిగా పెళ్లి గురించి చెప్పారు. మొదట భారతి ఒప్పుకుంటుందో ..... లేదో ..... అని అనుమానపడ్డ్డారు. భారతి కొంత సమయం తీసుకుని మీ ఇష్టం అని చెప్పటంతో ఈశ్వర్, మౌనిక ఆనందంగా పెళ్లి సంబంధాలు వెతకటం మొదలు పెట్టారు.

         భారతి ఇంటి పక్కన రెండు ఇళ్ల అవతల పెద్ద ఇంట్లో రాజేష్ అనే ఒక యువకుడు ఉండేవాడు. ఇతను ఒక వ్యాపారి కుమారుడు. తండ్రి రాజేష్ కి తల్లి లేకపోవటంతో ఏది కావాలంటే అది ఇచ్చి గారంబంగా పెంచుతున్నాడు . కానీ రాజేష్ తండ్రి సంపాదించిన డబ్బును చూసి దాన్నే ఖర్చు చేస్తూ పని పాట ఏమి లేక ఇంట్లోనే ఉండేవాడు. తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఎదుటి వారిని గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండేవాడు. ఒక సారి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న భారతిని చూశాడు. చూడగానే భారతి బాగా నచ్చింది. కానీ అది ప్రేమ కాదు. అతను భారతి అందాన్ని, తన శరీర సౌష్టవాన్ని చూసి తననేలాగైనా పొందాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు.  అతనెప్పుడు భారతిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. భారతి ఇంటి నుంచి బయటకు వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్లే వరకు తన ఇంటి ముందు కూర్చుని తగిన సమయం కోసం భారతినే కామంతో చూస్తూ ఉండేవాడు. ఇవేమీ తెలియని భారతి తన పని తాను చేసుకుంటూ ఉండేది.

రోజులు గడుస్తున్న కొలది రాజేష్ కి భారతిపై కోర్కెలు ఎక్కువైయ్యాయి. ఈ లోగా తన స్నేహితుల ద్వారా భారతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నరని తెలిసి భారతి పెళ్లి అయ్యే లోపు ఒక్కసారైన తనతో గడపాలని ఫిక్స్ అయి ఒక పథకాన్ని వేశాడు. భారతి స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా చుట్టూ ఎవరు లేనిది చూసి రాజేష్ అతని ఇంటి గేట్ ముందు మూర్ఛ వచ్చినట్లు గిలగిలా కొట్టుకోసాగాడు. రాజేష్ తన ఎదురుగా పడిపోయి ఉండటం చూసిన భారతి పరిగెడుతూ అతని దగ్గరకు వెళ్లింది. అతన్ని తడుతూ లేపుతూ తన బ్యాగ్ లో ఉన్న స్కూల్ లో తన డ్రా కీ తీసి అతని చేతిలో పెట్టి గట్టిగా పట్టుకుంది. రెండు నిమిషాల తర్వాత రాజేష్ కళ్లు తెరిచినట్లు నటిస్తూ భారతికి కృతజ్ఞతలు తెలిపాడు. భారతి అతన్ని గేట్ దగ్గర ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టి కాసేపు చూసి తిరిగి ఇంటికి వెళ్తామని అనుకోగానే వెంటనే రాజేష్ లేచి నడవబోయి పడిపోయాడు. అతన్ని చూసి జాలిగా భారతి అతన్ని తీసుకుని నెమ్మదిగా నడిపిస్తూ అతని ఇంట్లోకి తీసుకుని వెళ్లింది. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షి వేటగాని వలలో చిక్కుకున్న విధంగా భారతి అతని ఇంట్లోకి వెళ్లింది. తన పథకం ఫలించటంతో రాజేష్ మనసులో చాలా సంబరపడిపోయాడు. హాల్ లో సోఫాలో కూర్చోబెట్టింది. రాజేష్ ని పిలుస్తూ ఇంట్లో ఎవరూ లేరా... ? అని అడిగగా... రాజేష్ దీనంగా నాకెవరు లేరు. అమ్మ చనిపోయింది. నాన్న బిజినెస్ పని మీద ఎక్కడెక్కడికో వెళ్తారు అని చెప్పి, దాహమేస్తుంది కొన్ని నీళ్లు ఇస్తారా...? అని అడగగానే భారతి తన బ్యాగ్ అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి వాటర్ కోసం కిచెన్ లోకి వెళ్ళింది. అదును చూసి వేగంగా రాజేష్ ఇంటి ముందు డోర్ లాక్ వేసి వెనుక ఉన్న డోర్ నుంచి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి మరలా వచ్చి కూర్చుని భారతి బ్యాగ్ తీసుకుని అందులోని ఫోన్ తీసి సిమ్ కార్డు తీసేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుండగా భారతి గ్లాసులో నీళ్లు తీసుకుని వస్తూ అతన్ని చూసి ఆశ్చర్య పోయింది. వెంటనే కంగారుపడుతూ నా ఫోన్ ఎందుకు తీశారు అంటూ అడిగింది. అతనేమి మాట్లాడకుండా భారతి ఫోన్, భారతి బ్యాగ్ లో వేసి పైకి నిలబడి తనని కింద నుంచి పైకి వరకు చూస్తూ ఉన్నాడు. అతని చూపులలో తేడా గమనించిన భారతి గ్లాసు అక్కడే పడేసి వెంటనే మేన్ డోర్ వైపు పరిగెత్తబోయింది. ఈ లోగా రాజేష్ వెనుక నుంచి పరిగెడుతూ వచ్చి తన జేబులో ఉన్న క్లోరో ఫామ్ భారతి నోటికి పెట్టాడు. భారతి గింజుకుంటూ స్పృహ కోల్పోయి పడిపోయింది.

రోజు సమయానికి ఇంటికి వచ్చే భారతి ఇంకా రాకపోవడంతో మౌనిక కంగారు పడింది. బయటకు వచ్చి భారతి కోసం చూసింది. దారి పొడవునా ఎవరూ కనిపించలేదు. తన ఫోన్ తీసి భారతికి కాల్ చేసింది.ఫోన్ స్విచ్ఛాఫ్ రావటంతో చాలా భయంగా ఈశ్వర్ కి కాల్ చేసింది. ఈశ్వర్ ఆమెను సముదాయిస్తూ " వస్తుంది లేవే. ఏ ఫ్రెండ్ ఇంటికైన వెళ్లిందేమో.. అంటూ సర్ది చెప్పడంతో మౌనిక కొంత కుదుట పడి, కూతురు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ కూర్చుంది.

         స్పృహ కోల్పోయిన భారతిని తీసుకుని పైన ఉన్న తన రూమ్ లోకి తీసుకుని వచ్చాడు. తన బెడ్ మీద పడుకోబెట్టి తను ఎప్పుడు లేస్తుందోనని చూడసాగాడు.తను అరవకుండా నోటికి అడ్డంగా గుడ్డకట్టి చేతులు, కాళ్లు కట్టేశాడు.

కొన్ని నిమిషాల తర్వాత లేచిన భారతి, రాజేష్ ని చూసి చాలా కంగారుపడింది. బెడ్ మీద దొర్లుతూ కన్నీరు పెట్టుకుంది. రాజేష్ తన దగ్గరకు వచ్చి, ఒక రోజు తనతో ఉండమని తర్వాత ఎప్పుడూ తన జోలికి రానని చెప్పాడు. భారతి దానికి ఒప్పుకోకుండా ఏడుస్తూ అడ్డంగా తల ఊపటంతో రెచ్చిపోయినా రాజేష్ కోపంగా అరుస్తూ పిచ్చి పట్టిన వాడిలా ఆ రూమ్ లో తిరుగుతూ ఎలా ఒప్పుకోవో చూస్తాను. నిన్ను బలవంతం చేయటం నాకొద్దు. నీకు నువ్వు గా రావాలి అంటూ ఆ గది నుంచి కిచెన్ లోకి వచ్చి ఇనుప చువ్వలు వేడిగా కాల్చి వాటిని తీసుకుని భారతి దగ్గరకు వెళ్లాడు. వాటిని చూపిస్తూ ఒప్పుకోమని బెదించాడు. భారతి ఎంతకీ ఒప్పుకోకపోవటంతో ఆ వేడి వేడి చువ్వలు భారతి సున్నితమైన పాదాలకి పెట్టాడు. భారతి అది భరించలేక బాధతో విలవిలలాడుతూ అరుస్తూ ఏడుస్తుంది. తన రోదన ఆ ఇంటి గది వినలేక చిన్నగా ప్రతిధ్వనిస్తూ ఉంది. కానీ తన అరుపులు ఆ గది దాటి బయటకు పోవటం లేవు.

తన చుట్టూ ఉన్న సమాజాన్ని, అందులోని మనుషులను అందంగా చూసిన భారతి, ఈ వికృతమైన చేష్టలు గల రాజేష్ లాంటి వారు కూడా ఉంటారని అర్థం చేసుకుంది. ఆ నొప్పి భరించటం తన వల్ల కాలేదు. తనకు అదే చివరి రోజుగా అనిపించింది. ఇక భారతి ఒప్పుకోవటం లేదని తనను బలత్కారం చేయాలని తన దగ్గరకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు తనను తాకుతూ ఉన్నాడు. భారతి ఆవేధనగా అతన్ని ప్రతిఘటించలేక కన్నీరు పెడుతోంది.

అదే సమయానికి దేవుడు పిలిచినట్టుగా రాజేష్ కి తన తండ్రి కాల్ చేశాడు. రాజేష్ మొదట ఆ కాల్ పట్టించుకోలేదు. కానీ అదే పనిగా చాలా సార్లు కాల్ రావటంతో తన ఫోన్ తీసుకుని తన తండ్రి నంబర్ చూశాడు. ఒక్కసారిగా టెంషన్ తో గుండె ఆగినంత పని అయింది. తడబడుతూ

 నెమ్మదిగా ఫోన్ లిఫ్ట్ చేసి" హలో డాడి "అని అన్నాడు. వెంటనే అతని తండ్రి కంగారుపడుతూ

" నాని ఇంటికి లాక్ వేసుంది. ఎక్కడికెళ్లావ్.. ?. కీ ఎక్కడ పెట్టావ్రా....? "అంటూ అడిగాడు.

రాజేష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి. తన తండ్రి డోర్ ముందే ఉన్నాడని తెలిసి హడలిపోయాడు. భారతిని చూశాడు. తను ఏడుస్తూ ఉంది.

భారతిని ఎలాగైనా దాచాలి. కానీ ఎక్కడ దాచాలి. పోని చంపేద్ధామా...? వద్దు. నాన్న ఒకటి, రెండు రోజుల్లో వెళ్లి పోతారు. అప్పటి వరకు భారతిని నాన్న చూడని చోట దాచాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ ఉండగా అతని తండ్రి ఫోన్ లో " హాలో చిన్న. ...ఏమైందిరా....? మాట్లాడు. అంటూ పిలుస్తున్నాడు. వెంటనే తేరుకున్న రాజేష్ " డాడీ నేను నడుచుకుంటూ బజార్ కి వచ్చాను. కీ నా దగ్గరే ఉంది. అర్థ గంటలో వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అదంతా నిజమని నమ్మిన రాజేష్ తండ్రి రాజేష్ " బైక్ లేకుండా ఎక్కడికి పోడు. అంతా దూరం నడుస్తూనే పోయాడంటే బండికి ఏమైనా అయిందేమో.. అంటూ అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాడు.

ఇంతలో కూతురు తన ఫ్రెండ్స్ తో కూడా వెళ్లలేదని ఇంత సమయమైన ఇంటికి రాలేదని మౌనిక ఈశ్వర్ కి చెప్పటంతో ఈశ్వర్ ఇంటికి వచ్చాడు. తన కూతురు కోసం ఎదురు చూసి, చూసి ఇక భయంగా కంగారు పడుతూ పోలీస్ స్టేషన్ బయలుదేరారు. ఈశ్వర్ గాలితో మాట పరిచయం ఉన్న రాజేష్ తండ్రి ఈశ్వర్, మౌనిక కంగారుపడుతూ స్కూటర్ దగ్గరకు వెళ్లడం చూసి గేట్ వద్ద నుంచి బయటకు వచ్చి ఈశ్వర్ గారు ఏమైందండీ... ? అంటూ అడిగాడు. అప్పుడు ఎంతో ఆర్ద్రతతో" నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు అండీ.ఫోన్ కూడా కలవటం లేదు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని వెళ్తున్నాము." అని చెప్పగానే రాజేష్ తండ్రి చాలా బాధపడుతూ అమ్మాయికి ఏం కాదు. మీరు బాధపడకండి. తను నాకు కొంచెం తెలుసు. తను ఏమీ ఆశించకుండా చాలా మందికి సహాయం చేస్తుందంటా.. నేను నడిపే ఓ ఆగ్రనైజేషన్ మీటింగ్ లో తన గురించి చెప్పారు. తను మీ కూతురు అని తెలిసింది. మంచి వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు. మీరేమి కంగారు పడకండి. తను ఎక్కడ ఉన్నా వస్తుందని వారికి కొంత ధైర్యాన్ని చెప్పాడు. వారు అతనికి కృతజ్ఞతలు తెలిపి, స్కూటర్ ఎక్కి పోలీస్ స్టేషన్ బయలుదేరారు.

ఇదంతా జరుగుతున్న సమయంలో రాజేష్ వేగంగా తన బెడ్ మీద ఉన్న భారతిని తీసి అలాగే కట్లతో ఆమె కాళ్ళు పట్టుకుని లాక్కుంటూ పై గది నుంచి కిందకు తెచ్చాడు. మెట్ల మీద భారతి తల తగులుతూ రావటంతో ఆమె తలకు గాయమై రక్తం కారుతూ ఉంది. అదే విధంగా మోచేతులకు, నడుముకు కూడా గాయాలు అయ్యాయి. తనను లాక్కుంటూ వచ్చిన చోటంతా రక్త సిక్తమైపోయింది. భారతి నొప్పితో మూలుగుతూ ఉంది. కానీ రాజేష్ కర్కశంగా తనను అలాగే లాక్కుంటూ వెళ్లి స్టోర్ రూమ్ లో ఒక చోట వేసి వెంటనే బయటకు వచ్చి ఆ గది లాక్ వేశాడు. అక్కడ పడిన రక్తనంత శుభ్రం చేశాడు. అదే సమయంలో భారతి మూలుగు శబ్దాలు చిన్నగా వినిపించటంతో మరలా డోర్ తెరిచాడు. ఆమె తనని వదిలేయమంటూ ఎంత ప్రధేయపడిన వినకుండా  ఆమె నోట్లోకి గుడ్డను కుక్కి గట్టిగా శబ్దాలు రాకుండా కట్టేశాడు. భారతికి ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారింది. వెంటనే మరలా అంతా శుభ్రం చేసి అక్కడ ఉన్న ఇనుప చువ్వలు కూడా అన్ని తీసేసి, ఇంతా నార్మల్ గా చేసి, వెనుక డోర్ తెరిచి గోడ దూకి ఏమి తెలియనట్టు అమాయకంగా తన తండ్రి దగ్గరకు చేరాడు. ఎప్పుడూ లేని విధంగా రాజేష్ ఎందుకో చాలా కంగారు పడుతూ కనిపించటంతో ఏమైందని అతని తండ్రి ప్రశ్నించగా ఏమి లేదంటూ ఇద్దరు కలసి ఇంట్లోకి వెళ్లారు. తన తండ్రి అప్పుడే బాధగా" అరేయ్ నాన్న నీకు భారతి తెలుసా. ..? మన వీధిలోనే ఉంటారు. ఆ అవతలి ఇల్లే వారిది అంటూ ఆ ఇంటిని చూపిస్తూ అడిగాడు. రాజేష్ కి భారతి పేరు వినగానే ఒళ్లంతా చెమటలు పట్టాయి. వెంటనే తడబడుతూ చిన్నగా నవ్వుతూ "లేదే .నాకు ఏ భారతి తెలియదు డాడీ. అయినా ఆ అమ్మాయి గురించి నన్నెందుకు అడుగున్నారు. అంటూ అడిగాడు. దానికి అతని తండ్రి " ఏం లేదురా... ఆ అమ్మాయి కనిపించడం లేదంటా పాపం. ఆ మాట వినగానే రాజేష్ భయపడుతూ మీకేలా తెలుసని అడిగాడు. అప్పుడు అతని తండ్రి " ఏం లేదురా.. ఆ అమ్మాయి వాళ్ల నాన్న నాకు కొంచెం తెలుసు. ఇందాక వారు కలిస్తే చెప్పారు అంటూ ఆయన తన రూమ్ లోకి వెళ్లాడు. రాజేష్ మాటిమాటికి స్టోర్ రూమ్ వైపే చూస్తూ తన తండ్రి వెనకాలే వెళ్లాడు. అప్పుడు అతని తండ్రి " ఆ అమ్మాయి చాలా మంచి పిల్లరా... నేను కూడా సమాజానికి ఎదో చేయాలనే అనుకున్నాను. కానీ నేను చేసే దానిలో భాగంగా కొంత ఆశించేవాన్ని. కానీ ఆ అమ్మాయి ఇంత చిన్న వయసులో అంత ఉన్నతంగా ఏం ఆశించకుండా తనకు తోచిన సాయాన్ని అందించింది. రియల్లీ షి ఈస్ గ్రేట్.

నిజంగా అలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు అంటూ చెబుతూ ఉన్నారు. కానీ రాజేష్ ఇవేవీ పట్టించుకోకుండా భారతి ఉన్న స్టోర్ రూమ్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని తండ్రి డ్రాలో కొంత డబ్బు తీసుకుని

" సరేరా నేను అర్జేంట్ పని మీద వెళ్తున్నాను. అంటూ బయలుదేరాడు. వెంటనే రాజేష్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఆ ఆనందాన్ని కనిపించకుండా బాధ నటిస్తూ " డాడీ ఇప్పుడే వచ్చారు అప్పుడే వెళ్తారా..? అంటూ అడిగాడు. లేదు నాన్నా అర్జెంట్ తప్పదు. ఈ సారి వన్ వీక్ నీతోనే ఉంటా. జాగ్రత్త అంటూ బయలుదేరాడు. రాజేష్ తండ్రి వెళ్లగానే డోర్స్ క్లోజ్ చేసి వేగంగా స్టోర్ రూమ్ లోకి వెళ్లి చూశాడు. భారతి ఎక్కడా కనిపించలేదు. తను ఎటు పోయింది అంటూ అంతా వెతికాడు. పిచ్చి పట్టినట్టుగా ఎక్కడ వెళ్లావే.. అంటూ అరుస్తూ వెతుకుతూ ఉండగా అతనికి రక్తం పడిన దారి కనిపించింది. దాన్ని ఫాలో అవుతూ వెళ్తుండగా అంత పెద్ద స్టోర్ రూమ్ లో గోడకు చిన్న హోల్ కనిపించింది. వెంటనే దానిలోకి తొంగి చూశాడు. భారతి ఆ చిన్న హోల్ లోపలి దాకా పాడుతూ వెళ్ళి నక్కి ఉంది. ఆ హోల్ కంపు కోడుతూ ఉంది. అది ఒక మోరి . ఇష్టం వచ్చినట్లు ఆ ఇంటిని నిర్మించడం వల్ల. దాని కింద ఉన్న ఈ మురికి కాలువ రాను రాను కుంచించుకు పోయి ఇలా గోడకు ఒక హోల్ లాగా తయారైంది. మనిషి చూపని మానవత్వాన్ని ఆ సమయంలో మురికి కాలువ తన ఒడిలో భారతికి కాస్తంత చోటును ఇచ్చినట్లుగా ఉంది.

అక్కడ అంతా చెమ్మగా ఉంది. తనకు బతకాలని ఉంది. కానీ ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఈ లోగా రాజేష్ ఆ హోల్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అతను చాలా పెద్దగా ఉండటం వల్ల అందులో పట్టటం లేడు. భారతి సన్నగా మరియు ఎలాగైనా అతని కృరత్వం నుంచి  తప్పించుకోవాలని అనుకోవటంతో అందులోకి దూరింది. తన దగ్గర మొత్తం రక్తంతో నిండిపోయింది. అప్పుడు రాజేష్ బిగ్గరగా పళ్లు కొరుకుతూ బయటకు రావే... నువ్వు నా నుంచి ఎటు తప్పించుకోలేవు. అంటూ అరుస్తూ ఉన్నాడు. పాకుతూ రావటంతో

అప్పుడే భారతి చేతులు ఊడిపోయాయి. అవి ఊడిపోవటం తనకు కొంత ఊరటని కలిగించాయి. కానీ తనలో శక్తి ఏ మాత్రమూ లేదు. రాజేష్ మరింత ముందుకు తన చేతిని చాపాగానే భయంతో తన కాళ్లను చిన్నగా ఆ హోల్ లో దగ్గరకు మలుచుకుంది. కాళ్లను కాల్చటం వల్ల అరికాళ్లు చర్మం బొబ్బలెత్తి ఊడిపోయింది.ఆ మంటను భరించలేక ఆర్తిగా రాజేష్ ని చూస్తూ తనను వదిలేయమంటూ చేతులు నెమ్మదిగా జోడించలేక జోడిస్తూ నోటికి గుడ్డ కట్టడం వల్ల బయటకు రాని తన స్వరంతో ప్రదేయపడింది. కానీ అతను అనేవి పట్టించుకోలేదు. ఆ పెచ్చులు పడిన హోల్ ని తన్నుతూ కొంత ఊడిపోగానే మరలా తన చేతిని లోపలికి పెట్టాడు. భయంతో మరింత లోపలికి వెళ్లింది. కూర్చుని నోటి గుడ్డలను విప్పుకుంది. బలంగా లాగి కట్టడం వల్ల నోట్లో నుండి కూడా రక్తం కారుతుంది. అరవటానికి కూడా తన గొంతు రావటం లేదు. 

బయట నుంచి రాజేష్ అరుస్తూ తన చేతు ఆ హోల్ లోకి పెడుతూ భారతిని అందుకోవాలనుకుంటున్నాడు. నిలువెల్లా గాయాలతో ఉన్న భారతికి ఇక తాను బతుకుతాననే ఆశపోయింది. ఇక గాఢ ఊపిరి తీసుకుంటూ భయంగా రాజేష్ ని చూస్తూ ఉంది. 

రక్రపు ముద్దగా ఉన్న కూడా రాజేష్ తనను చూసే కామంతో నిండిన ఆ చూపు చూసి భారతికి అతను ఓ మృగంగా కనిపించసాగాడు.  












పోలీస్ స్టేషన్ వెళ్లిన ఈశ్వర్, మౌనిక తమ కూతురు కనిపించటం లేదని కంప్లైంట్ చేసారు. వెంటనే పోలీసులు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదట భారతి తల్లిదండ్రులతో "భారతి అంటే పడనివారేవరైనా ఉన్నరా...? లేక మీరు ఎవరికైనా అనుమానిస్తున్నారా....? " అంటూ అడిగారు. దానికి వారు " మా కూతురు అంటే పడనివారు ఎవరు లేరు. మాకు అనుమానించటానికి కూడా ఎవరు శత్రువులు లేరు. మా మధ్య తరగతి కుటుంబాలు కడుపు నిండా తిని అందరిని కలుపుకొని పోతాము. కానీ మేము కక్ష్యలు పెంచుకోము" అంటూ ఈశ్వర్ బాధపడుతుండగా పోలీసులు అతనికి ధైర్యం చెప్పి వెంటనే భారతి ఎప్పుడు ఇంటికి వస్తుంది, ఎప్పుడు వెళ్తుంది. ఎక్కడెక్కడికి వెళుతుంది. తన స్నేహితులు ఎవరితో సన్నిహితంగా ఉంటుంది మొదలైన వివరాలు సేకరించారు. భారతి పనిచేసే స్కూల్ లో కనుక్కున్నారు.ఆ రోజు భారతి స్కూల్ వచ్చి, ఒంట్లో బాగా లేదని గంట ముందే ఇంటికి బయలుదేరిందని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పారు. వెంటనే పోలీసులు తను స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఉన్న సిసి కెమెరాలు అన్ని సేకరించి పరిశీలించారు. భారతి స్కూల్ లో చెప్పిన విధంగానే గంట ముందే బయలుదేరింది. తను స్కూల్ వద్ద బస్సు ఎక్కి వేరొక స్టాప్ లో దిగింది. అక్కడి నుంచి నేరుగా తను ఉండే ఏరియా బస్సు ఎక్కింది. తర్వాత పోలీసులు భారతి ఆ కాలనీ బస్సు స్టాప్ నుంచి భారతి ఇంటి వరకు ఏమైనా సిసి కెమెరాలు ఉన్నాయేమోనని పరిశీలించారు. కానీ భారతి దిగిన బస్ స్టాప్ వరకు మాత్రమే సిసి కెమెరాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. దాంతో పోలీసులు భారతిని ఈ కాలనీ ప్రదేశంలోనే ఎవరో బంధించి ఉంటారని ఒక అంచనా వేశారు. కాలనీ పొడవునా ఈశ్వర్ ఇంటి వరకు వందకు పైగా ఇల్లు ఉన్నాయి కానీ భారతి ఎక్కడ మిస్ అయింది అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉంది. ఆ స్టాప్ వద్ద ఉన్న సిసి కెమెరాలో భారతి ఉన్న ప్రతి విజువల్ క్షుణ్ణంగా పరిశీలించసాగారు.



భారతిని పట్టుకోలేక రాజేష్ పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు. ఒక నా నుంచి తప్పించుకోలేవు అంటూ స్టోర్ రూమ్ లో ఉన్న డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి నవ్వుతూ ఆ హోల్ ని పగలగొట్టటం మొదలు పెట్టాడు. అది చూసిన భారతి చాలా హడలిపోయింది. తనకిక చావు తప్పదని తన మనసులో అనుకుంది.

శరీరమంతా గాయాలతో ఉన్న భారతికి  ఆ రంధ్రంలో ఊపిరాడటం కూడా కష్టంగా మారింది. తనకు అక్కడే ఉంటే చావు తప్పదు. అదేవిధంగా బయటకు వెళ్లిన చావే గతి కానీ ధైర్యంగా ఎదుర్కుంటే తను బతికే అవకాశం ఉంది. తనలాంటి దీన పరిస్థితి మరి ఏ ఆడపిల్లకు రాకూడదు అంటూ ఆలోచించి క్షణం ఆలస్యం చేయకుండా ధైర్యంగా రాజేష్ కళ్లలోకి చూస్తూ మలుచుకున్న తన కాళ్ల కట్టు నెమ్మదిగా విప్పుకుంది. అంతవరకు తనని చూసి భయపడిన భారతి ఇప్పుడు ధైర్యంగా తనని కళ్లలో కళ్లు పెట్టి చూసేసరికి కొంత భయపడ్డాడు. ఆ హోల్ దగ్గరే ఉండి హోల్ బద్దలు కొడుతూ తననే చూస్తున్నాడు. 

వాడిని ఎదుర్కొని చంపటం లేదా వాడి చేతిలో చావటం. వాడిని చంపేంత శక్తి నాకు ప్రసాదించు దేవుడా అంటూ ఆ భగవంతున్ని మనసులో ప్రార్థించుకొని ఒక్క సారిగా ఆ రంధ్రంలో నుంచి బయటకు వచ్చి అతన్ని తన బలంతో దూరంగా నెట్టేసింది. 

అనుకోని విధంగా జరిగిన ఆ చర్యకు రాజేష్ ఉలిక్కి పడి దూరంగా వెళ్లి పడ్డాడు. అతని చేతుల్లో ఉన్న డ్రిల్ మిషన్ పక్కన పడింది. 

అలసటతో శరీరం సహాకరించని ఆ సమయంలో అంతా ధైర్యం తనకు ఎలా వచ్చిందో తనకే తెలియలేదు. తప్పించుకోవాలన్న ఆశ ముందు తన గాయాల మంటలు తక్కువైపోయాయి. ఆ మంటలను దిగమింగుకొని అతన్ని తోసి వెంటనే లేచి పరిగెత్తబోయింది. వెంటనే రాజేష్ డ్రిల్ మిషన్ ఆన్ చేసి భారతి కుడి మోకాలి కింద పెట్టాడు. అది భారతి చర్మాన్ని తొలుస్తూ

తన ఎముకను తాకే సమయానికి భారతి బాధతో అరుస్తూ పక్కనే ఉన్న పెద్ద ఐరన్ బాక్స్ తో అతన్ని కొట్టింది. అతను ఆపేలోపే ఐరన్ బాక్స్ అతని తలను చీల్చుతూ వెళ్లింది. వెంటనే అతను భారతిని వదిలేసి బాధతో అరుస్తూ ఉన్నాడు. డ్రిల్లింగ్ మిషన్ అతనికి చాలా దూరంగా వెళ్లి పడింది. 

ఆ గది మొత్తం అరుపులతో రక్తంలో నిండిపోయి ఉంది. ఒక వైపు కాళ్ల బొబ్బలు మరొక వైపు ఇప్పుడు డ్రిల్లింగ్ మిషన్ చేసిన గాయం వల్ల భారతి 

నడవటానికి కాలు సహాకరించకపోవటంతో కింద పడిపోయింది. తన చేతిలో అలాగే ఐరన్ బాక్స్ పట్టుకొని పాకుతూ అతని నుంచి దూరంగా వెళ్లి, ఒక చోట ఉన్న టేబుల్ పట్టుకొని నెమ్మదిగా లేచి నిలబడలేక నిలబడుతూ ఏడుస్తూ ముందుకు అడుగు వేయగానే   రాజేష్ వేగంగా ఎక్కడికి వెళ్తావ్ అంటూ బలంగా వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు. వెంటనే భారతి తప్పించుకునే ప్రయత్నంలో తన చేతులో ఉన్న పెద్ద ఐరన్ బాక్స్ ( ఇస్త్రీ పెట్టే) తీసుకొని బలంగా అతని ముఖానికి విసిరి కొట్టింది. అది బలంగా ముక్కుకొనకి తాకటం వల్ల రాజేష్ నొప్పితో అరుస్తూ భారతిని వదిలేశాడు. వెంటనే భారతి వెనుకకు తిరిగి మరలా కొట్టబోయింది. రాజేష్ ఒక చేతిలో భారతిని ఆడుతూ మరొక చేత్తో తన ముక్కు నుంచి వస్తున్న రక్తాన్ని ఆపుకుంటున్నాడు. భారతి తన శక్తినంతా కూడగట్టుకొని బలంగా అతని నుంచి ఐరన్ బాక్స్ దూరంగా లాడుతూ అతని కడుపులో ఈడ్చి తన్నింది. అతను దూరంగా వెళ్లి పడ్డాడు. వెంటనే తెరుకుని ఆ బాక్స్ తో అతని తలపై మరలా బలంగా కొట్టింది. అతను అడ్డుకునే లోపలే ఆ పెట్టే అంచులు అతని కపాలాన్ని చీల్చి రక్తం చిమ్ముతూ భారతి ముఖాన్ని తడిపేసింది. అతను మూలుగుతూ అక్కడే పడిపోయాడు. వెంటనే భారతి ముందుకు తడబడుతూ నడవబోయింది అప్పుడే రాజేష్ మరలా భారతి కాళ్లు పట్టుకొని లాగాడు. తన పట్ల ఒక రాక్షసునిలా ప్రవర్తించిన రాజేష్ ని చూస్తే భారతికి ఏ మాత్రం జాలి కలగలేదు. వెంటనే తన చేతిలో ఉన్న బాక్స్ తో ఈ సారి చాలా బలంగా కొట్టింది. అతను అక్కడే పడిపోయాడు. వెంటనే అతన్ని అక్కడే వదిలేసి పడిపోతూ లేస్తూ, పాకుతూ, కుంటుతూ నెమ్మదిగా మేన్ డోర్ వైపు నడిచింది.ఆ ఇల్లు మొత్తం రక్తంలో తడిపేసినట్టుగా ఉంది. తనకు రక్తం చాలా పోవటం వల్ల కళ్లు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.కాని తననిప్పుడు గాయాలు బాధించటం లేవు. తనలో ఏదో శక్తి నిండిన విధంగా తన మనసంతా ఒక కృర మృగాన్ని వేటాడి చంపిన ఆనందం నిండిపోయి ఉంది. భారతి బైరవిలా ధైర్యంగా రాజేష్ ని చంపింది.

నెమ్మదిగా మేన్ డోర్ తెరిచింది. స్వచ్ఛమైన గాలి తనకు కొత్త ఊపిరిని పోసింది. దూరంగా గేటు బయట రంధ్రాల సంధుల్లో నుంచి తన తల్లిదండ్రుల, పోలీసుల మాటలు వినిపిస్తున్నాయి. వారంతా తనకు మసకగా కనిపిస్తున్నారు.

వారంతా భారతి కోసం ఆ ఏరియాలో ఉన్న ఇల్లన్నింటిని వెతుకుతూ, వెతుకుతూ ఇప్పుడు రాజేష్ ఇంటి ముందు ఉన్న ఇంట్లో వెతుకుతూ ఉన్నారు. వారు రాజేష్ ఇంటి గేటు అవతల నిలబడి అవతలి ఇంట్లో చూస్తున్నారు. మళ్లీ చూస్తానో ,చూడనో అని అనుకున్న భారతి ఇప్పుడు తన తల్లిదండ్రులను చూస్తూ ఉండిపోయింది. వారిని పిలవటానికి ప్రయత్నిస్తుంది కానీ తన నోరు రావటం లేదు. తనలో  ఏదో మైకం కమ్మినట్టుగా అనిపించి అక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. సరిగ్గా తను పడిపోయే సమయానికే పోలీసులు , ఈశ్వర్, మౌనిక గేట్ తెరుస్తూ అక్కడ జీవచ్చవంలా పడి ఉన్న భారతిని చూసి వెంటనే పరిగెత్తుతూ తనని చేరారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురుని రక్తపు మడుగులో చూసిన ఆ తల్లిదండ్రుల గుండె చెరువయ్యింది. వెంటనే భారతిని తీసుకుని ఇద్దరు పోలీసులతో పాటు హాస్పిటల్ బయలుదేరారు. లోపలికి వెళ్లిన మిగిలిన పోలిసులు అక్కడ చనిపోయి ఉన్న రాజేష్ ని, అక్కడి పరిస్థితిని పరిశీలించసాగారు. అంత ఘోరమైన దృశ్యాలు చూసి రాజేష్ ఎలాంటి వికృత చేష్టలు చేశాడో అంచనా వేసుకున్నారు.


భారతి ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంది. తనని హాస్పిటల్ తీసుకుని వెళ్లిన వెంటనే డాక్టర్లు తనకు చికిత్స చేయటం మొదలు పెట్టారు. తన పాదాలకు ఉన్న కాల్చిన గాయాలు, డ్రిల్లింగ్ మిషన్తో చేసిన గాయాలు

తలకు , శరీరానికి ఉన్న గాయాలు చూసి భారతి పడిన వేధనకి వారి మనసు కన్నీటితో నిండిపోయింది. 



రాజేష్ శవాన్ని పోస్ట్మాస్టర్ కి పంపించారు. ప్రతి టివి ఛానల్ లో ఈ విషయాన్ని గురించే చర్చించసాగారు. ప్రతి ఒక్కరిలోనూ ఒకటే ప్రశ్న అసలేమైంది....? ఏమైందో తెలియాలంటే భారతి కోలుకోవాలని అందరు ఎదురు చూస్తున్నారు. భారతి త్వరగా కోలుకోవాలని ఎంతో మంది తన నుంచి సహాయం పొందినవారు, తన మంచి కోరే వారెందరో భారతిని చూడటానికి వచ్చారు. రాజేష్ తండ్రికి ఆ రోజు తన కొడుకు ప్రవర్తనపై వచ్చిన అనుమానం బలపడింది. ఎంతో మంది తను స్థాపించిన సంస్థల వల్ల బాగుపడ్డారు. ఎంతో మందిని తన చేతులతో మంచి మార్గంలో నడిచేలా చేశారు. కానీ తన కన్నా కొడుకును సరిగా పెంచలేకపోయానే అంటూ చాలా కుమిలిపోయాడు. తన కొడుకు వల్ల ఒక అమాయకురాలు చావు బతుకుల్లో ఉందని దుఃఖించాడు.


సరిగ్గా రెండు రోజుల తర్వాత భారతి కళ్లు తెరిచింది. తను తనంతట తానుగా మిడియాతో మాట్లాడుతాననటంతో కెమెరాలు ఏర్పాటు చేశారు. టివి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ స్పీచ్ వింటున్నారు. భారతి జరిగింది మొత్తం చెప్పింది. భారతి చెప్పటం మొదలు పెట్టింది "ఆడపిల్ల గట్టిగా నవ్వినా తప్పే. ఎక్కువ నవ్వకూడదు మంచిది కాదు అంటారు. ఆడపిల్ల ఏడ్చిన తప్పే. ఆడపిల్ల ఏడుపు ఇంటికి అరిష్టం అంటారు. చివరికి సొంత నిర్ణయాలు తీసుకున్న తప్పే. తన కళ్ల ముందు జరిగిన అన్యాయాన్ని వారిస్తూ వాదించిన తప్పే.గట్టిగా మాట్లాడిన తప్పే. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయినా మాట్లాడరు.ఈ ఆంక్షలు ఇంకా ఎన్నిరోజులు అని ప్రశ్నించే ధైర్యం ఏ ఒక్కరూ చేయరు.ఎందుకంటే మౌనం అనే గొప్ప వరాన్ని దేవుడు మనకు ప్రసాదించాడుగా. ఏంటమ్మా అలాగంటావ్..? ఈ రోజుల్లో ఇలాగెక్కడున్నాయి అని అనుకుంటున్నారా...? ఎక్కడో ఎందుకు మీ ఇంట్లోనే ఉంటుంది. లోతుగా పరిశీలించి చూడండి. అయినా కూడా మౌనంగానే ఉంటారు లెండి. మౌనం ఆడదాని ఆభరణమై ఆనాటి నుండి ఈనాటి వరకు కొందరు ఆడవారి జీవితాలను నాలుగు గోడల మధ్య శిలగా మార్చేస్తుంది. ఆ మౌనం మృదంగమై మాట్లాడితే....? శిలే ఉలి కోసం బయలుదేరితే..... ఎలాగుంటుంది.

ఉదాహరణకు ఒక విషయం చెప్పన మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రి బాయి పూలే చీకటి గదిలో నాలుగు గోడల మధ్య నాకేంటని ఉండుంటే ఇప్పుడు మన ఆడవారిమంతా ఇంత స్వేచ్ఛగా చదువుకునేవారిమా....? ఆమెను సమాజం నిందించింది. చదువు చెప్పటానికి వెళ్తుంటే పేడతో కొట్టింది. పేడ నీరు పోసి అవమానించింది. కానీ వాటన్నింటిని ఎదిరించి విలువైన విద్యా ధనాన్ని మనకు అందించారు. ఆ విద్యలో ధైర్యం, సమయస్పూర్తి మొదలైన అన్ని విషయాలు నేర్చుకుని మగవారి కన్నా ముందు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కూడా ఆడవాళ్లపై ఎందుకో ఆ చిన్న చూపు. స్త్రీ విద్య కోసం కష్టపడిన ఆ సావిత్రి బాయి పూలే వెనుక ఒక ఆదర్శ భర్త సహకారం ఉంది. ఓ అమ్మాయికి మగవాడు పక్కన ఉంటే రక్షణగా ఉండాలి. తనకు తోడుగా నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. పచ్చిగా చెబుతున్నానని కాదు కానీ, మగవాడు, ఆడదాని పక్కలో ఉండటానికి ప్రయత్నించకూడదు. తన గుప్పెడంతా గుండెలో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. మగవాడిని అనే అహం వదిలి మనిషిని అని ఆడపిల్లలకు భరోసా ఇవ్వాలి. తన ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. తప్పులు చేస్తే వివరించాలి. తనను తానుగా జీవించే హక్కు తనకు తెలియపర్చాలి. మగవారి ఆలోచన విధానం మారినప్పుడే ప్రతి ఆడపిల్ల అభివృద్ధి బాటలో నడవగలదు. అలాగని అందరూ మగవాళ్లు అలాంటివారు కాదు. అమ్మాయిలను కేవలం ఆడుకునే వస్తువుగా చూసే 

కొందరు రాజేష్ లాంటి వారికి మాత్రమే. .....




ఈ రోజుల్లో ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన, ఏ వార్త పత్రిక పట్టుకున్న ఎదో ఒక వార్త ఆడవారి గురించే ఉంటుంది. వార్తలోకి వచ్చినవి వేలల్లో, లక్షల్లో ఉంటే, పరువు పోతుందని కడుపులో దాచుకున్నవి కోకొల్లలే ఉంటాయేమో. ఆడపిల్ల ఒంటరిగా ఉన్న సమయంలోనే కాదు బస్సుల్లో ప్రయాణించినప్పుడు, చదువుకునే చోట, ఇంటి పక్కన, ఇంకా చెప్పాలంటే ఇంట్లో వ్యక్తుల వల్ల కూడా ఆత్యచారానికి గురి అవుతూనే ఉంటుంది. ఎదో ఒక ఆగాయిత్యం జరగగానే కొత్త చట్టాలు, కొత్త శిక్షలు అమలులోకి వస్తాయి కానీ ఆచరించబడవు. బలికాబడిన అమ్మాయినే బలి పశువులా చేసి సమాజం జాలి చూడకుండా సూటి పోటీ మాటలతో వేదిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఈ సమయంలో నడకనేర్వని పసికందు నుంచి కాటికి చేరే ముసలమ్మ దాకా. ....మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఒకటే ఎవరైనా మిమ్మల్ని తప్పగా చూసిన, తప్పుగా మాట్లాడినా, తప్పుగా ముట్టుకున్న ఆ క్షణమే నీ పిడికిలి బిగించి, ఆడదంటే బొమ్మ కాదు ఆది పరాశక్తి అని వారికి తెలిసేలా చేయాలి.  

. ఒక అమ్మాయి బలంలో తక్కువ అని భయపడి తాను  చులకన చేసుకోకూడదు. ఆ బలవంతమైన మగానికి జన్మనిచ్చేంత బలం అమ్మాయిలకే ఉందని గుర్తు పెట్టుకోవాలి. చిరు రవ్వంత నిప్పు కణిక పెద్ద అగ్ని గుండాన్ని సృష్టించినప్పుడు నీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, సమయస్పూర్తి నిన్ను బలంగా మలిచి ప్రమాదాల నుంచి రక్షించలేదా.....? ఆలోచించి చూడు. నేను రాజేష్ ని ఎదుర్కవటానికి ఆ ధైర్యమే కారణం. ఇది మనకు ఎవరు నూరి పోయలేరు. మనకు మనముగా ప్రేరణ పొందితేనే అది బరటపడుతుంది. ప్రాణం పోయే చివరి శ్వాస వరకు అది మనల్ని గర్వంగా నిలబెడుతుంది"

అంటూ తడబడుతూ చెబుతూ శూన్యంలోకి చూస్తూ కన్ను మూసింది భారతి.  





కొమ్మల్లో దాగిన కోయిలమ్మ, పరిమళాలు వెదజల్లే మల్లే పూవమ్మ, ఆకులు రాల్చి మోడుబారిన చెట్టమ్మ 

బీటలు వేసిన నేలమ్మ ఎదురు చూస్తున్నాయి వసంతం ఇంకా రాలేదని. కానీ వారికి తెలియదు వసంతం మూగబోయిందని.......



సమాప్తం.......



ధన్యవాదాలు 

ఇట్లు

ముండ్రాతి రజిత

6281202613





  




Rate this content
Log in

Similar telugu story from Crime