Gandrothu Nagendra

Drama Horror Thriller

4.5  

Gandrothu Nagendra

Drama Horror Thriller

బన్నీ & మెస్సి

బన్నీ & మెస్సి

1 min
307


ఒక ఊరిలో రాజు అరవింద్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు . రాజుకి ఒక చిన్న కుక్క పిల్ల ఉండేది. దానికి అతని బన్నీ అని పేరు పెడతాడు. రాజు అతని స్నేహితులతో కలిసి బయట ఆడుకుంటూ ఉంటాడు. ఒకనాడు రాజు ఫ్రెండ్ అరవింద్ కి కూడా ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది దాని పేరు మెస్సి దానిని అతడు తీసుకువస్తాడు. అప్పుడు బన్నీ మెస్సికి పరిచయం అవుతుంది. ఆరోజు నుండి అవి రెండు కలిసి ఆడుకుంటూ ఉంటాయి. ఒక రోజు అవి ఆడుకుంటూ ఉండగా వేరే వీధి కుక్కలు వాటిని తరుముతాయి. ఆలా అవి వాటి నుండి తప్పించుకోవడానికి ఒక పాతబడిన ఇంట్లోకి వెళ్లి దాకుంటాయి. అక్కడ వాటికి ఒక అరుపు వినిపిస్తుంది. లోపలి వెళ్లి చూస్తే ఒక అమ్మాయి తాళ్లతో కుర్చీలో కట్టబడి ఉంటుంది. బన్నీ, మెస్సిలు వెంటనే రాజు దగ్గరికి వస్తాయ్. ఈలోపల రాజు అరవింద్ లు వీటి కోసం వెతుకుతుంటారు. రాజు, అరవింద్ దగ్గరకు అవి వచ్చి వాళ్ళని ఆ ఇంటికి తీసుకెళ్ళతాయి. అప్పుడు వారు ఆ అమ్మాయిని చూసి ఆమె కట్లు విప్పగా ఆ అమ్మాయి తన పేరు సింధు అని డబ్బు కోసం కొందరు దుండగులు తనను కిడ్నాప్ చేశారని చెబుతుంది. ఈలోపల ఆ దుండగులు అక్కడకు వస్తారు. ఆ అమ్మాయితో పాటు రాజు, అరవింద్ లను కూడా పట్టుకుంటారు. బన్నీ, మెస్సిలు రాజు మావయ్య రవి దగ్గరకు వెళ్లి బిగ్గరగా అరుస్తాయి. అప్పటికే రాజు అరవింద్ ఇంట్లోని వారు వీళ్ళ కోసం వెతుకుతుంటారు. అప్పుడు రవి తన పోలీసు సిబ్బందితో కలిసి వెళ్లి వాళ్ళను విడిపిస్తాడు. అప్పుడు రాజు, అరవింద్ లు బన్నీ, మెస్సిలను మెచ్చుకుంటారు. రవి ఇతర పోలీసులు ఆ దుండగులను అరెస్టు చేస్తారు. సింధును వాళ్ళ తల్లితండ్రులకు అప్పగిస్తారు. ఇలా సాహసం చేసి అందరిని కాపాడినందుకు వాటి ధైర్యసాహసాలు మెచ్చి బన్నీ, మెస్సిలకు ఒక అవార్డు ఇస్తారు.


Rate this content
Log in

Similar telugu story from Drama