Hitesh Kollipara

Drama Romance

4  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 4

లవ్ ఇన్ అమెరికా – 4

5 mins
795


#డోంట్_హేట్


“We May Be A Nation Divided On Policies. But We Are A Country That Stands United In Condemning Hate And Evil In All It Forms – President Trump Said While Addressing The Joint Session Of Congress.”

నేను మెట్లు దిగి వస్తుంటే టీవీలో వస్తున్న న్యూస్ అది. మొన్న కాన్సాస్ లో హేట్ క్రైమ్ లో భాగంగా వెటరన్ యూ‌ఎస్ నావి మెన్ చేతిలో చనిపోయిన శ్రీనివాస్ కూచిభొట్లకి సంఘీభావంగా పార్లమెంట్ లో ప్రెసిడెంట్ ట్రంప్ అన్న మాటలు అని టీవీలో చెప్తున్నారు. నాన్న, అమ్మ టీవి చూస్తున్నారు. తమ్ముడు లేడు. నేను కూడా మాట్లాడకుండా టీవి చూస్తూ నించున్నాను.

“కారణమే వీడు మళ్ళీ మాటలు చెప్తున్నా’’ రెండు నిమిషాలకి నాన్న మాట్లాడారు.

నేను, అమ్మ ఏం మాట్లాడలేదు.                                  

క్షణం తరువాత అమ్మ నావైపు చూసి, “ఏంటి?” అంది. దానర్ధం ఎక్కడికి వెళ్తున్నావు అని.

నిన్న ఆల్బర్ట్ వచ్చి సోల్ మేట్ ని వెతకమని అడగగానే తట్టుకోలేకపోయింది నిజమే. కానీ తనేమన్నా అడిగితే కాదనే శక్తి నాకు లేదు. సరే అన్నాను. కానీ సోల్ మేట్ ని ఎక్కడని వెతకాలి? రాత్రంతా ఆలోచిస్తే ఈరోజు ఉదయం నిద్దర్లో ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆల్బర్ట్ కి పింగ్ చేశాను. ఎక్కడికని ఇంతవరకు అతడికి కూడా చెప్పలేదు. మార్నింగ్ ఫలానా టైమ్ కి రమ్మని పింగ్ చేస్తే ఇప్పుడు వచ్చి బయట కార్ లో సిద్దంగా ఉన్నాడు. ఐతే ఇవేమీ అమ్మకి చెప్పే ఉద్దేశ్యం లేదు.

“బయటకి వెళ్తున్నా..., ఓ మూడు గంటల్లో వచ్చేస్తా” అన్నాను.

“ఈ అవతారంలోనేనా?...” నన్ను నిలువెల్లా చూస్తూ అంది అమ్మ.

నన్ను నేను చూసుకున్నాను. ఏమైంది బానే ఉన్నానుగా? కాకపోతే పోనిటైల్ కట్టి టైట్ ఫిట్ స్లీవ్ లెస్ టాప్ వేశాను. దానిక్కూడానా?...

“ఏమైంది?” అన్నాను.                    

“అంత టైట్ ఫిట్ టాప్ వేసుకోవద్దు అని నీకు వందసార్లు చెప్పాను. నువ్వు ఒక్కసారి కూడా నా మాట వినవా??”

“అమ్మా..., ఇండియాలోనే అమ్మాయిలు ఇవి వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్న శ్యామల పెళ్ళికి వెళ్లినప్పుడు చూపించానుగా?... ఇక అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం ఐతే ఇది నథింగ్!”

“నాకదంతా తెలీదు. నేను నీ వయసున్నప్పుడు ఇది వేసుకోలేదు”

“నువ్వు నా వయసున్నప్పుడు పల్లెటూరులో ఓణి వేసుకుని తిరిగుంటావ్. నన్ను కూడా అది వేసుకోమంటావా?”

“నాకు ఎదురు చెప్పకు. బయటకి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఇవ్వను”

“నాన్నా...!” అరిచాను.

“నాన్న గారు!...” అమ్మ గౌరవవాచకాన్ని యాడ్ చేసింది.

“అమ్మా..., రోజురోజుకి నేను నిన్ను తట్టుకోలేకపోతున్నాను. నాన్నని నాన్న అని పిలిస్తే ఏంటి? నాన్నగారూ అని పిలిస్తే ఏంటి? బయటివ్యక్తుల ముందు సంభోదించేటప్పుడు ‘గారు’ అనే సంభోదిస్తున్నాగా?... ఇంట్లో కూడానా?!”

“బయటా.., లోపలా..., అని కాదు. నాన్నని గారు అని సంభోదించటం పిల్లల ధర్మం. అదే గౌరవం”

“నాన్న మీద ఉండాల్సింది ప్రేమ. గౌరవం కాదు”

“రెండూ ఉండాలి”

“నాన్న!...” మళ్ళీ అరిచాను.

నాన్న నవ్వాడు గాని మాట్లాడలేదు.

అప్పుడే టైమ్ అయినట్టు వాల్ క్లాక్ శబ్దం చేసింది. వెంటనే మా అమ్మ నాన్న చేతిలోని టీవి రిమోట్ లాక్కుని టీవీలో Hotstar ఓపెన్ చేసింది. అప్పటికే ‘వెలగనిదీపం’ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అయి ఉంది. ప్లే చేసింది అమ్మ.

“చెత్త సీరియల్! డి‌ఎన్‌ఏ టెస్ట్ చేస్తే తేలిపోయేదానికి సాగదీస్తున్నాడు. అందులో జడ్జ్ కారెక్టర్ కన్నా ఉండాలి. నువ్వు మళ్ళీ దాన్ని తెగ చూస్తావు. లాజిక్ లెస్ సీరియల్” అమ్మని పరిహాసంగా అన్నాను.

“సీరియల్ ని సీరియల్ లా చూడు”

“ఐతే నన్ను కూడా అమెరికాలో అమెరికన్ లా ఉండని”

“నువ్వు ఎక్కడికీ వెళ్లట్లేదు. ఇంట్లోనే ఉండు. నేను నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు” అంది.

నాకు చిర్రెత్తుకొచ్చింది. “నాన్నా!...” ఈసారి ఇంటికప్పు ఎగిరిపోయే రేంజ్ లో అరిచాను.

నాన్న మళ్ళీ నవ్వాడు. ఐతే ఈసారి మాట్లాడాడు కూడా – “అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా అటండ్ చేయ్. కట్ చేయకు. వెళ్ళు” పర్మిషన్ ఇచ్చారు.

“ఎలా భరిస్తున్నావ్ నాన్న అమ్మని?”

“హ... హ... మీ అమ్మ దేవత రా. అది నీకు ఇప్పుడు తెలీకపోవచ్చు. కానీ ఎప్పుడొకప్పుడు తెలుస్తుంది” అన్నారు.

నాన్నన్తే అమ్మ మీద ఈగ వాల్నివ్వరు. అమ్మ కూడా నాన్నకి అంతే గౌరవాన్ని ఇస్తుంది. గౌరవం వచ్చేలా చేస్తుంది. అమ్మ నాకు చిన్నప్పుడు ఆది దంపతులుగా శివపార్వతుల గురించి చెప్పింది. వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూడలేదు. నాకు తెలిసిన శివపార్వతులు మా అమ్మానాన్నే!

“అమ్మా..., చెప్తున్నా విను. నేను నాన్నని ఇంట్లో నాన్నా అనే పిలుస్తాను. గారు అని పిలవను. ఏం చేసుకుంటావో చేసుకో...” చెప్పేసి విసురుగా బయటికొచ్చేశాను.

అప్పటికే కార్ తో సిద్దంగా ఉన్నాడు ఆల్బర్ట్.

“నీ కార్ ఇక్కడే పార్క్ చేయ్. నా కార్ లో వెళ్దాం” అన్నాను.

“ఆ సెకండ్ హ్యాండ్ కార్ లోనా?..., అది చాలా పాతది!”

“కానీ పని చేస్తుంది”

నేను నా కార్ తీసి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను. చేసేదిలేక ఆల్బర్ట్ తన కార్ ని పార్క్ చేసి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు.

“ఎక్కడికి?” అన్నాడు.

నేను సమాధానమివ్వలేదు. కార్ ని పోనిచ్చాను.

ఎన్నో దారులు దాటాం. మరెన్నో వంతెనలు ఎక్కి దిగాం. చెట్లు, పుట్టలు పోటీపడి మా కార్ వెనక్కి పరిగెత్తాయి. ప్రయాణం అంతా ఆల్బర్ట్ నన్ను ఎక్కడికని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. నేను మాత్రం సమాధానం చెప్పకుండా పోనిస్తూనే ఉన్నాను. ఒకానొక సందర్భంలో చెప్పకపోతే దూకేస్తా అని ఆల్బర్ట్ అంటే అప్పుడు కార్ షడన్ బ్రేక్ వేశాను. ఎగిరిపడ్డాడు ఆల్బర్ట్. ఆ వెంటనే ఎదురుగా అద్దంలోంచి చూశాడు. ఎదురుగా పెద్ద గూడౌన్ లాంటి కట్టడం.

“షాపింగ్ మాల్ కి ఎందుకొచ్చాం?” అన్నాడు.

“నీ సోల్ మేట్ ని వెతకటానికి”

“షాపింగ్ మాల్ లోనా?”

“అవును”

“ఆర్ యు మ్యాడ్?”

“లేదు. కానీ ఒకటి చెప్పు…, నీ జోడీ అయ్యే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? మన వర్శిటీలో?..., వర్సిటీకి సెలవులు ఇచ్చారు! పబ్బుల్లో, పార్కుల్లో?..., సిటీలో నీకు తెలీని పబ్బులు, పార్కులా?! పోనీ చర్చ్ లో?..., నీకు దేవుడు అంటే పడదు! ఇక షాపింగ్ అంటే పడని షాపింగ్ మాల్ లోనే నీ సోల్ మేట్ దొరుకుతుంది అని నా థాట్”

“నాకెందుకో నీ లాజిక్ లాజిక్ లెస్ గా అనిపిస్తుంది”

“డూ యు హావ్ బెటర్ ఐడియా?”

‘’……..”

“లేనప్పుడు నన్ను ఫాలో అవ్వు. పైగా ఈరోజు క్లియరెన్స్ సేల్ నడుస్తుంది. షూర్ గా సిటీ గర్ల్స్ ఇక్కడకి వస్తారు”

స్థలం లేక మాల్ కి దూరంగా కార్ ని పార్క్ చేసి మాల్ వైపు నడిచాం. మాల్ లోకి వెళ్తుండగా వినిపించింది వెనుక నుంచి అరుపు – “ఆల్బర్ట్!...” అంటూ.

ఎటునుంచో అర్ధంకాక ఇద్దరం అరుపుకి వ్యతిరేక దశలోకి తిరిగాం. ఒకమ్మాయి కావాలనే అరుస్తూ వచ్చి ఆల్బర్ట్ ని వెనుకనుంచి గుద్దుకుంది. ముందుకి పడబోయి ఆల్బర్ట్, ఆ చేష్ట నచ్చక నేను తమాయించుకుని వెనక్కి తిరిగాం.

“హేయ్..., మార్గరేట్!” గుద్దింది ఎవరో గుర్తుపట్టినట్టు ఆశ్చర్యారుపు విసిరాడు ఆల్బర్ట్.

“అవును..., నేనే...” ఉత్సాహంగా ఆల్బర్ట్ కి తన పెదాలు రాయబోయింది ఆ పిల్ల.

ఇదీ..., దీని వేషాలు!!

ఆల్బర్ట్ మాత్రం ఆ ముద్దుని దాటేస్తూ, “ఐ యామ్ సర్ప్రైజ్డ్ టు సీ యు హియర్” అంటుండగానే అది అతడ్ని అల్లుకుపోతూ గంతులేయసాగింది ఆ మెంటల్ ది.

ఆల్బర్ట్ ముద్దు పెట్టుకోలేదు - గుడ్ బోయ్!!

వాళ్ళు అలా పరిచయ కార్యక్రమాలు చేస్తుండగానే నేను ఆమెని గమనించటం మొదలుపెట్టాను. నేను హై హీల్స్ వేసుకుంటేనే ఆల్బర్ట్ భుజం దగ్గరకి వస్తాను. ఇది మామూలు చెప్పులకే బారెడు హైట్ ఉంది. అమెరికన్ తెల్లతోలు, చక్కటి జుట్టు. ఇక ఫిగర్ గురించి ఐతే చెప్పక్కర్లేదు. సింపుల్ గా చెప్పాలంటే నాకు లేనివి అన్నీ తనకి ఉన్నాయి.

“ఈమె పేరు మేఘన్...” చివరికి నన్ను పరిచయం చేశాడు ఆల్బర్ట్.

“ఊ!... ఇండియన్??” ఆమె చూపులో ఆశ్చర్యం కంటే జుగుప్సే కనిపించింది నాకు.

“యుప్”

“వాట్ యు డూ? H1B?”

“నో..., నేను కూడా ఆల్బర్ట్ తోపాటు వర్సిటీలో PhD చేస్తున్నాను. అండ్ మై ఫాదర్ వర్క్స్ ఫర్ నాసా ఇన్ ఆస్ట్రానమి డిపార్ట్మెంట్”

“ఊ ఆల్బర్ట్!..., డోంట్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియన్స్. దె ఆర్ హియర్ జస్ట్ టు రాబ్ అవర్ జాబ్స్! హర్ ఫాదర్ ఆల్రెడీ రాబ్డ్ ఒన్ ఆఫ్ అవర్ జాబ్స్ అండ్ నవ్ షి ఈజ్ బికమింగ్ రెడీ టు స్టీల్ అనదర్” ఆల్బర్ట్ తో అంది.

ఇందాకటి ఆమె చూపులోని జుగుప్సకి కారణం ఇప్పుడు అర్ధమైంది.

“వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్?” కోపంగా అరిచాను.

“మరి లేకపోతే?..., మీ ఇండియన్స్ వల్లే మా జాబ్స్ పోతున్నాయి. నిన్న మా బ్రదర్ జాబ్ కూడా పోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ యు ఫకింగ్ ఇండియన్స్” తను కూడా నాతో సమానంగా అరిచింది.

నాకు కోపం తన్నుకొచ్చింది. “వాట్ ద ఫక్ ఆర్ యు టాకింగ్? మీకు జాబ్స్ నిలబెట్టుకొనే తెలివి లేక మా మీద పడి ఏడుస్తారు?! ట్రై టు బికమ్ స్మార్ట్ అండ్ ఎగ్జిబిట్ యువర్ స్కిల్స్. డోంట్ బ్లేమ్ ఆథర్స్..., ఓకే?”

“డోంట్ షౌట్ లైక్ మ్యాడ్ డాగ్, ఓకే? యు కేమ్ టు అవర్ ల్యాండ్ ఫీలింగ్ లైక్ ఎంపరర్స్?!”

“అఫ్కోర్స్ వి ఆర్! అండ్ గో బ్యాక్ టు హిస్టరి…, మీరు కూడా ఇక్కడికి వలస వచ్చి ఇక్కడి నేటివ్ అమెరికన్స్ ని చంపి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినవాళ్లే”

మా వాదనకి ఫ్రీజ్ అయిపోయినట్టు నించుండిపోయాడు ఆల్బర్ట్. ఒక్కక్షణం అతడికి దిమ్మతిరిగిపోయినట్టు ఉంది మమ్మల్నే మార్చిమార్చి చూస్తున్నాడు గాని మధ్యలో వచ్చి సర్దిచెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడు. మేము వాదన కొనసాగిస్తూనే ఉన్నాం. అది పీక్స్ కి చేరిపోయింది. ఒకానొక సందర్భంలో అక్కడి ట్రాలి అందుకుని ఆమె నా మీదకి దూసుకురాబోయింది. అప్పుడు అరిచాడు ఆల్బర్ట్ –

“ఓ‌ఎం‌జి!...” అంటూ.

ఆమె దూసుకువస్తూనే ఉంది.



Rate this content
Log in

Similar telugu story from Drama