శ్రీలత "హృదయ స్పందన "

Romance Tragedy Classics

4.1  

శ్రీలత "హృదయ స్పందన "

Romance Tragedy Classics

నాలోనే ఉండిపో...

నాలోనే ఉండిపో...

1 min
559


  

ప్రియమైన నీకు,

 జ్ఞాపకాలు.. నా హృదయం నిండా జ్ఞాపకాలు... అన్ని నీతో గడిపిన క్షణాల తాలూకా గురుతులు, గడపాలి అనుకునే కోరికల తాలూకా కన్నీటి చుక్కలు...

నువ్వు దూరం అవుతూ నాకు మిగిల్చిన స్మృతులు

నీ మాటలు.. నీ నవ్వు.. నీ చూపు..నా మనసంతా నువ్వే.. అని చెప్తున్నాయి.

నీ జ్ఞాపకాల అగ్నిలో నిత్యం జ్వలిస్తునే ఉన్నా, నన్ను నేను దహించుకుంటునే ఉన్నా ..

అయినా ఇంకా ఎదో వెలితిగానే ఉంది.. ఇంకా ఇంకా ఏదో చేయాలి.. నన్ను నేను కోల్పోవాలి.. నీ నుండి దూరంగా వెళ్లిపోవాలి..

ఇన్నాళ్లు ప్రేమంటే ఏంటో తెలుసుకున్నాను.. అనుభూతి చెందాను.. ప్రేమ ను పంచాను అనుకున్న..

నా ప్రేమ తో..నీ ప్రేమ లోకంలోకి... నీ హృదయ మందిరం లోకి చేరుకున్నాను అనుకున్న..

ఇప్పుడే కదా తెలిసినది.. నీ హృదయపు వాకిలి ఎదురుకి కూడా రాలేకపోయాను అని...ఇక ఎప్పటికి రాలేను కూడా అని...

నువ్వొక అందమైన రూపం లా కనిపిస్తావు,

అంతలోనే కనుమరుగవుతున్నావు....

నా స్వప్నం..కూడా నన్ను వదిలి పోతుంది..

నేను ఇలా కరిగిపోతాను.. నీకై మిగిలిపోతాను..

అందుకే నేనెప్పుడూ ఒంటరినే.. నీ ప్రేమలో..

ప్రేమ లోకంలో...

నా కలలు నన్ను వెక్కిరించకముందే..

నేను వాస్తవాన్ని అంగీకరించకముందే..

నా శ్వాసను ఆగిపోని... నీ ధ్యాసలో ఉండిపొని.

ఇక నాకు సెలవిప్పించండి..

నా మనసులోని ఆవేదన కు..

నీ ప్రేమలోని నాకు.....

సెలవా మరి మళ్ళీ మళ్లీ అడుగుతున్నా అనుకోకు ఇంకో సారి నిన్ను చూడాలని, నీ మాట వినాలని అంతే....

ఇట్లు,

నీకేమి కాని నేను.

శ్రీ...

హృదయ స్పందన



Rate this content
Log in

Similar telugu story from Romance