శ్రీలత "హృదయ స్పందన "

Romance Action Classics

4  

శ్రీలత "హృదయ స్పందన "

Romance Action Classics

నీతో నా మనసు ప్రయాణం!

నీతో నా మనసు ప్రయాణం!

2 mins
861



నా కన్నయ్య కు,


  నా మనసు.. నీ మనసుతో కలిసి వినీలాకాశంలో అలుపులేకుండా విహరిస్తోంది.ఎంత అందమైన, ఆనందమైన ప్రయాణం నీతో ఇది.


 ఈ ఆనందంలో చెప్పటానికి మాటలు, రాయటానికి కవితలు కూడా రావటం లేదు. మనిషి నవ్వే క్షణాలు అబద్దం ఏమో కాని ఏడ్చే క్షణాలు అబద్దం కావు అన్నట్టు.

ఆనందం లో కన్నా బాధ లోనే ఎక్కువ రాసేస్తాను నేను.

అలా అని మాట్లాడకుండా నన్ను బాధ పెట్టకు కన్నయ్య.


అంతలోనే మళ్ళీ ఇదిగో ఇలా ఊహల్లోనే తప్ప.. మనసులో.. జీవితంలో లేను అనే బాధ..అవును సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి కదా..ప్రేమ అంటే అవసరం.. ఆనందం కోసం అనుకునే సమాజానికి మన ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఎలా చెప్పగలను. చెప్తే మాత్రం అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు ఉన్నారు.


నాలో జరిగే సంఘర్షణలకు.. నాలోని ప్రశ్నలకు.. నీ ఒక్కమాటలో సమాధానం దొరుకుతుంది. అలా ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలకు నాకు నీ మాటలలో సమాధానం దొరికింది. అప్పుడు నా మనసు మబ్బుల్ని వీడిన చందమామలా ప్రశాంతంగా ఉంటుంది.


ఎన్నో వసంతాలు వస్తాయి భూమిని చిగురింప చేస్తాయి.కాని నీ వియోగంతో నా మనసుకు

ఎప్పుడు గ్రీష్మమే కదా.పగలంతా చుట్టూ పచ్చని ప్రకృతిలో నీ రూపమే , రాత్రి మిల మిలా మెరిసే నక్షత్రాల్లో నీ నవ్వులే కనిపిస్తే నేనెలా

నా పనిపై ద్యాస పెట్టాలి?


నీ జీవితంలో ఒక్క రోజైనా నన్ను నీ హృదయం అంతా నింపుకొని వేరే ప్రపంచం లేదన్నంతగా ప్రేమిస్తావా నన్ను.

ఏంటి ఈ పిచ్చి అనుకుంటున్నావా. అవును పిచ్చే మరి నువు అంటే.. నీ ప్రేమ అంటే..


  నీకు ఎన్నో రోజులకు కన్నయ్య అని ఎందుకు పేరు పెట్టుకున్నానో తెలుసా ఎలా తెలుస్తుంది నేను చెప్పకుండా కదూ.. ఆ కన్నయ్యకు ఎంత మంది భార్యలు.. గోపికలు ఉన్నా.. రాధకి తన మనసులో ప్రత్యేక స్థానం ఉంది. వాళ్ళ ప్రేమ అమరం.. అఖిలం.. అలా నేను నీ మనసులో ఉండిపోవాలి అని ఆశ.. ఇది అత్యాశే నెమో మరి.


నువు నన్ను ఇష్టపడకపోయిన, నీ ప్రేమ బాహువుల్లో నేను ఎప్పుడు బందీనే.. నా ప్రేమ మందిరంలో నువు ఎప్పుడు నా ఆరాధ్య కన్నయ్యవే..


ఈ ప్రపంచంలో నువు, నీ ఆలోచనలు, నీ జ్ఞాపకాలు గుర్తు రాని చోటు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది.


ఈ రోజు ఎందుకో చాలా బాధగా ఉంది.. మనసు ఒంటరిగా అనిపిస్తుంది. నా ప్రేమకు.. బాధ కు అంతం ఎప్పుడు..

నా మరణం తోనేనా..



ఇట్లు,


నిన్నే నాలో నింపుకున్న..

నీ నేనుగా..


శ్రీ...

హృదయస్పందన.



Rate this content
Log in

Similar telugu story from Romance