alekhya eluri

Drama Romance

5.0  

alekhya eluri

Drama Romance

నీ చూపుకై...

నీ చూపుకై...

3 mins
760


జాహ్నవి...రఘు రామ్ జంట చూడముచ్చటగా ఉంటారు...ఒకరికోసం మరొకరు పుట్టారా అన్నంతగా కలిసిపోయారు...


తల్లిదండ్రులు మాట మీరని రఘురాముడు వాళ్ళు మెచ్చిన పిల్లనే తన ఇల్లాలిగా చేసుకున్నాడు...


ప్రేమ వివాహం లోనే కాదు పెద్దలు కుదిరించిన వివాహంలోను అనురాగలతో పాటు...తరగని ప్రేమ ఉంటుంది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఇద్దరూ...


పెళ్లి అయ్యి ఆరునెలలు దాటింది...


ఒక రోజు జాహ్నవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగిపడిపోయింది...


అత్త మామలు త్వరలో మనవడిని ఎత్తుకోవచ్చు అని సంబరపడిపోయారు...


రఘు ఆనందంగా జాహ్నవిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చెక్ చేస్తే అలాంటిది ఏమి లేదు అని చెప్పారు...


నిరాశగా వెనుదిరిగారు ఆ జంట...


ఇంటికి వచ్చాకా పెద్దవాళ్ళకి చెబితే వాళ్ళకి బాధ కలిగిన కూడా తమ బిడ్డలు చిన్న బుచ్చుకున్న మోము చూసి ఇంకా చాలా వయసు ఉంది..మీకు అపుడే ఇలా డిలా పడిపోతారు ఏంటి...ఎం కాదు...అంతా మంచే జరుగుతుంది అని నచ్చచెబితే మనసు కుదుర్చుకున్నారు ఆ జంట...


ఆ తరువాత చాలా సార్లు అలాగే జాహ్నవికి తలనొప్పి వచ్చి కళ్ళు మసక బారెవి...అప్పుడప్పుడు రాత్రిళ్లు కళ్ళు కనపడేవి కావు...


రఘుకి చెబితే కంగారు పడతాడేమో అని...తనే డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకుంది...అక్కడ డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యింది...


ఆ రోజు మొదలుకొని...జాహ్నవి ఇంట్లో పెద్దవాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించేది...రఘు ని లెక్క చేసేది కాదు...ఇల్లు రణరంగంలా మార్చేసింది...జాహ్నవి లో యీ ప్రవర్తనకి రఘు కి బాధ కలిగిన తన మీద ప్రేమతో సర్దుకునేవాడు...కానీ ఒకనాడు జాహ్నవి తన సంస్కారాన్ని మరిచి తన తల్లిదండ్రులని నానా మాటలు అంటుంటే రఘు తట్టుకోలేక జాహ్నవిని ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు...


నేను చదువుకునే రోజుల్లో ఒక అతన్ని ప్రేమించాను..అప్పుడు సరైన సంపాదన లేదు అని మా నాన్న అతనికి ఇచ్చి పెళ్లి చేయలేదు .... .అతను మళ్ళీ నాకోసం వచ్చాడు బాగా డబ్బు సంపాదించి...నాకు అతను కావాలి...నువ్వు వద్దు అంది...


ఆ మాటలు విన్న రఘు మనసు ముక్కలు అయ్యింది...


తరువాత రఘు,జాహ్నవి కోర్టు ద్వారా విడాకులు పొంది విడిపోయారు...


ఆ తరువాత జాహ్నవిని తీసుకుని తన పేరెంట్స్ ఊరు వదిలి వెళ్లిపోయారు...


ఒక సంవత్సరం తరువాత...


ట్రాఫిక్ లో ఒక అమ్మాయి రోడ్ దాటడానికి ఎవరినైనా సహాయం చేయమని అడుగుతుంది...


ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ తమ పనిలో తాము బిజీగా ఉంటూ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు...


నిస్సహాయంగా నిలబడిన ఆమె చేతిని ఒకతను అందుకున్నాడు...


అతని చేతి స్పర్శ తగలగానే ఆమె కళ్ళు తడిని చేసుకున్నాయి...అయినా బయట పడకుండా తలవంచుకుని అతనితో ఇంకోసారి ఏడడుగులు నడిచింది...


ఇద్దరూ కలిసి రోడ్డు దాటారు...


వచ్చేసాము అన్నాడు అతను...


ఎలాగో గొంతు పెగుల్చుకుని థాంక్ యూ అంది...


హ్మ్...అన్నాడు...


మెల్లిగా బాధగా అడుగులు వేయడం మొదలు పెట్టగానే ఆమె చీర కొంగుపట్టుకుని ఆపి..ఇప్పటికన్నా నాకు నిజం చెప్పాలని లేదా...అప్పుడు వదిలి వెళ్లినట్లు..ఇపుడు వదిలి వెళ్తావా...ఇలా వదిలి వెళ్లిపోయే బదులు నన్ను చంపేసి పోవే...నీకోసం ఏడిచే బాధ అన్నా తప్పుతుంది...అన్నాడు ...


ఒక్కసారిగా రఘు అంత మాట అనకు అని రఘు ని పట్టుకోబోతు తూ లి పడబోయింది...


జాహ్నవిని పడిపోకుండా పట్టుకుని తన మోము అరచేతులలోకి తీసుకుని ఇదే పరిస్థితి నాకు వస్తే వదిలి వెళ్ళిపోతావే...


రఘు..అంటూ ఏడుస్తూ తన నోటికి చేయి అడ్డు పెట్టింది...


ఎందుకు నన్ను వదిలి వెళ్లిపోయావు...నీకు మనసు ఎలా వచ్చిందే...నన్ను అలా నిర్దాక్షిణ్యంగా వదలడానికి..అంటూ జాహ్నవిని కౌగిలించుకుని ఏడుస్తున్నాడు రఘు...


అది కాదు రఘు...చూపులేని నాతో నీకు జీవితం ఏమి ఉంటుంది..అదే నేను తప్పుకుంటే ఏ బాధ లేని జీవితం నీకు దొరుకుతుంది అని ఇలా చేసాను...నిన్ను బాధ పెట్టాలని కాదు...అంది బాధగా...


నీ బొంద...అర్ధేచ..ధర్మేచ..కామేచ..మోక్షేచ...నాతిచరామి అంటూ ప్రమాణము చేసింది ఇలా అర్దాంతరంగా వదిలేయడానికి కాదు...పద కష్టమో,సుఖమో కలిసి నడుద్దాం బ్రతుకుదాం...అని జాహ్నవిని తిరిగి తనతో చేయి పట్టి తన జీవితంలోకి తెచ్చుకున్నాడు రఘు...


మీకు ఎలా తెలిసింది...


అదా..నాన్న గారి స్నేహితుడికి నీలాగే తలనొప్పి వచ్చి చెక్ చేయించుకోడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ నీ వచ్చిన రేటినెటిస్ పిగ్మెంటోస అనే ఐ డీసీజ్ గురుంచి చెప్పారు...ఆయన కంగారు పడుతుంటే అది ఎటాక్ అయిన వాళ్ళ గురుంచి చెబుతుంటే నీ ప్రొఫైల్ ఉండడం చూసి అనుమానం వచ్చి మమల్ని అడిగారు...


అప్పటివరకు నువ్వు అలా చేయవు అన్న నా అనుమానం నిజం అయ్యింది...వెంటనే హాస్పిటల్ కి వెళ్లి నీ గురుంచి ఎంక్విరీ చేసాను...నిజం తెలిసింది...నాలుగు నెలల నుంచి వెతుకుతుంటే ఇప్పటికి దొరికారు మహారాణి గారు అన్నాడు నవ్వుతూ...


ఆ..నవ్వులో తను కూడా కలిసిపోయింది...


నిశీధిలో మేడ మీద పడుకున్న ఆ జంట తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ప్రణాళికలు వేసుకుంటున్నారు...


*****


వెన్నెల వెలుగుల్ని చూసిన జాహ్నవి జీవితం ఒక్కసారిగా చంద్రుడులేని రాత్రిలా మారింది...ఎప్పుడైతే తిరిగి రఘు పున్నమి చంద్రుడిలా నిత్యం తనతో ఉండటానికి వచ్చాడో..అప్పుడే తన జీవితం వెన్నెల వెలుగుల్ని రఘు కళ్ళతో చూడడం మొదలు పెట్టింది జాహ్నవి...


*****




Rate this content
Log in

Similar telugu story from Drama