A T

Comedy Classics

4.5  

A T

Comedy Classics

పోరపాటు మంచిదే

పోరపాటు మంచిదే

2 mins
325


అది 2012 సంవత్సరం సూర్యుంగారికి కాకినాడకి ట్రాన్స్ఫర్ అయింది.ఆయన ఒక పెద్ద కంపెనీలో ప్రభుత్వ ఉద్యోగి.తన భార్యా ఇద్దరు కుమారులుతో అక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఊరు‌ చిన్నది కానీ బాగానే ఉంది ‌‌‌అనుకున్నారు ఆయన ఆయన భార్య.అవును ఇంతకీ ఆయన భార్య పేరు చెప్పనే లేదు కదా నా పేరే రాధ అని.అందరూ వాళ్ళ వాళ్ళ దైనందిన కార్యక్రమంలో బిజీ బిజీ అయ్యారు.ఓక కుమారుడు బిటెక్ కోర్సులో చేరాడు, చిన్న వాడు ఎనిమిదవ తరగతిలో చేరాడు.అదే‌‌ పాఠశాలలో‌‌ రాధగారు‌ పదవ తరగతికి ఇంగ్లీష్ టీచర్గా చేరారు.ఆమె ఫుల్ టైమ్ టీచర్గా కాకుండా పారటైం టిచర్ గా చేరారు.ఒక రొజు సూర్యంగారి సహూద్యోగి వాళ్ళ ఇంటికి వచ్చాడు.పరిచయాలు, పలకరింపులు అయ్యాక అతను ఒక ఫారం ఇచ్చి అది ఫిల్ చేసి ఇవ్వమని అడిగాడు.ఆ ఫారం లేడీస్ క్లబ్ది.అలా ముదలయింది క్లబ్కి వెళ్లి రావడం, అక్కడి పాటలు డ్రామాలు, ఆటల్లో పాల్గొన్నారు.బొలెడు‌ ప్రశంసలు అందుకున్నాక, ఆమెను ‌‌‌క్లబ్లో సెక్రటరీగా ఎంపిక‌ చేసారు.అందులో భాగంగా ఆమె పలు రకాల బాధ్యతలను చేపట్టారు.ఆడుతూ‌‌ పాడుతూ మహిళలు సాధ్యమైనంత సందడి చేశారు.ఇక ఒక రోజు చాలా మంచిదియన ఒక పని చెయ్యాలి అని అందరూ ‌‌అనుకున్నారు.అదేమిటంటే బడుగు వర్గాల మహిళలకు మషింలు పంపిణీ చేయాలని సంకల్పించారు.దానికి‌ కావలిసిన విరాళం పొగు చేసి మషింలు కొని కొంత మంది బడుగు వర్గాల మహిళలను ఆహ్వానించారు.కొంత మంది వచ్చాక కార్యక్రమం‌ ముదలు పెట్టారు.కానీ ఇంకా ‌‌‌‌‌‌ముఖ్య అథితి రావాల్సి ఉందని అందరూ వేచి చూస్తూ వున్నారు.ఇంతలో‌‌ శుబ్రంగా ఉన్న చీరలో ఒక మహిళ రావడం చూసి రాధగారుఎదురు వెళ్లి ‌‌‌‌‌‌ఆమెను ఆహ్వానించి గ కాఫీ కూర్చోమని చెప్పి ఆవిడ వేరే అతిథులును పలకరించడానికి వెళ్ళారు.కాని ఆవిడకి ఆ వచ్చిన అతిథి ‌‌‌‌‌‌‌‌‌ఎవరొ అస్సలు అంతుపట్టకుండా వుంది ఇంత లో ముఖ్య అతిథి (క్లబ్ ప్రెసిడెంట్) రావడం అక్కడ ఉన్న అందరినీ సంబోధించిన తరువాత పేరు పేరునా కుటు మిషన్లు పంపిణీ మొదలు పెట్టారు.ఇంకొక ఐదు గుర మిగిలారు.అపుడు.పిలిచి‌న పేరుకి లేచి నిలబడిన ఆమె ఎవరో తెలిసి రాదగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆమె ఎంతో కృతఘ్నత చెపుతూ రాధగారిని పొగిడింది ఇంతకీ ఆమె‌ ఎవరో తెలుసా ఆమె ఆ క్లబ్ ప్రెసిడెంట్గారి కారు డ్రైవర్ భార్యా అన్నమాట.ఆమె ఎవరో తెలియనందున ఆమెకు మర్యాద ఇచ్చి ఆదరించినందుకు అందరి దగ్గరా పోగిడి వాళ్ళ క్లబ్కి మంచి పేరు వచ్చేలా చేసింది.మరి అపుడపుడు పోరపాటు కృడా మంచిదే కాదంటారా?? 


Rate this content
Log in

Similar telugu story from Comedy