Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

శ్రీమాత వైభవము

శ్రీమాత వైభవము

1 min
360



ప్రక్రియ :పద్యములు.

మత్తేభ విక్రీడితములు


--------------------------

1.

కమనీయంబగు నీదు మోము గనుచో కామంబు లీడేరు నో

కమలాక్షీ!కనిపించు

మమ్మ!వినతిన్ గైమోడ్చి సేవింతు నా

భ్రమలన్ నాశము చేయుమమ్మ !మదిలో భావంబువై నిల్వుమా!

నిముసంబైనను విస్మరించక యుమా!నిన్నే దలంతున్సదా!./


2.

కరుణా ధృక్కులతోడ నన్ను గనుమా!

కామేశ్వరీ!నిన్ను నే 

విరులన్ బూజలు సల్పుదాన!మదిలో వెల్గించు నీ దీప్తులన్

శరణంబంటిని సిద్ధిదా !ముదముతో 

సంతాపముల్ తీర్చునీ 

చరణాబ్జంబుల ధూళి దాల్చిచని సంసారాబ్ధినిన్ దాటెదన్ /


3.

వరముల్ కోరను పార్వతీ!ప్రణతితో పాదంబులన్ మ్రొక్కెదన్

గురురూపంబున నిల్చి సాధుగుణముల్ కూర్మిన్ ప్రబోధించుమా!

పరమార్థంబునెఱుంగు బుద్ధినిడుమా!

పాపంబులే దగ్ధమౌ

మరుజన్మంబులు రోత!రోత!గరిమన్ మళ్ళించు నా కర్మలన్ /


4.

స్థిరముల్ కావిట భోగ భాగ్యములు నీ సేవయే సత్యమౌ

కురిపించున్ గద!పుణ్య రాశులిలలో

కోరంగనింకేటికిన్

దరియించన్ బ్రజ లెల్ల భక్తియుతులై దాక్షాయణీ!నీ కృపన్

జిరమౌ కీర్తిని పొందు మార్గ మిదియే శ్రీమాత!నిక్కంబుగన్ /

-


Rate this content
Log in

Similar telugu poem from Classics