Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

ధన్వంతరి

ధన్వంతరి

1 min
5


ధన్వంతరి.


జాతిమతముల్ చూడక శక్తికొలది

ప్రాణముల్ పోయు చుండెడి వైద్యవరులు

 శ్రద్ధతో నిల్చి సేవలు సల్పుచుండి

రాత్రి పవలును మరతురు ధాత్రియందు

ధర్మపరులైన వైద్యులు దైవసములు.


శాస్త్ర విజ్ఞాన శోధనల్ సల్పి సల్పి

ప్రాణములు లెక్క సేయక ప్రజల కొఱకు

నిష్టవంతులై చేయుచు నిత్య విధులు

తనువునందున్న రోగముల్ తరుము చుండి

కన్నుమూయక సల్పెడి కార్యధనులు.


వేతనంబులు చాలక వెతలు పడుచు

వైద్య వర్యులు నిత్యము బాధనొంద

పట్టనట్లుగా జూతురీ పాలక తతి.

వైద్య విద్యార్థి సంఘముల్ వివిధ గతుల

ఉద్యమంబులు చేయుచు నుద్ధతిగను 

గొడవ చేయుచు నుందురు కొలువు లేక.


సామరస్యంబు గాస్థితిన్ చక్కబెట్టి

మంచి జీతంబులిచ్చుచు మానితముగ

ఘనత కల్గిన వారిని గౌరవించ

వలయు నీ జాతి ప్రేమతో బాసటనిడి

వారిదీక్షకు సేయగ వందనములు

జాతి ప్రగతి బాటలో సాగుచుండు.//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational