Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Others

3  

Gayatri Tokachichu

Others

వ్యసనపంకిలం

వ్యసనపంకిలం

1 min
5


*వ్యసనపంకిలం*

(కవిత )


మ్లేచ్ఛ సంస్కృతిపైనున్ను వ్యామోహం

తుచ్ఛ మైనట్టి యోచనతో బుద్ధి మాంద్యం 

దుర్బలత్వంతో నిండిపోవు మానసం

దౌర్భాగ్యవంతమైనదా జీవన ప్రయాణం 

చిరకాలం మున్గగా వ్యసనమౌ పంకిలం

పరిహారంగా ఛిద్రమౌనయ్యో!సంసారం!

క్షీణించును త్వరగా శరీరదారుఢ్యం

క్షణికావేశంలో హింసాయుత వర్తనం

ఎటు చూసినా నీచత్వపు ధృక్కోణం

కటకటా!తెగిన గాలిపటమౌను జీవితం

మేలుకొమ్ము!యువతా!మీ భవితవ్యం

కాలిపోకముందే జాగ్రత్తపడటం కర్తవ్యం

మంచిదారిలోకి మళ్ళటమే శ్రేయస్కరం

ఎంచిచూడగా సత్ప్రవర్తనయే సౌభాగ్యం

తొలగించుకోవాలి దుర్వ్యసన దుర్గంధం

చిలికించాలి నవ జీవనంలో మాధుర్యం //


Rate this content
Log in