ఎలా నేస్తం
ఎలా నేస్తం
ఎన్ని ఎన్ని భావాలను రాశులు గా పోసి...నా....
రాయాలి అనుకున్నా భావం...
అసంపూర్తి గానే...అక్షరాల లో మిగిలిపోయింది....
మనసు పలకను పదె పదె తుడిపేస్తు...
ఎన్ని అక్షరాలను సవరించినా...
నీ పైన నా భావం....రాయకనే రాతల లో...
ఇమిడి పోయింది....
మాటల లో వివరణకు...
గొంతుకు మాటలు కరువు...
చూపుల లో తెలిపేందుకు...
కంటికి నీ రూపం కరువు...
చెప్పాలి అని చెప్ప లేక తడ బడే మనసుకు...
మోయలేని నీ ఈ భావం భరువు...ఎలా నేస్తం