Varanasi Ramabrahmam

Classics

5.0  

Varanasi Ramabrahmam

Classics

అసమర్థుల అడ్డాలు

అసమర్థుల అడ్డాలు

1 min
34.8K



ఈ ప్రపంచంలో మనుషులెందరో ఆధ్యాత్మిక గురువులందరు. లోకో భిన్న రుచిః, పుఱ్ఱెకో బుద్ధి, జిహ్వకో రుచి లాగా, మన వ్యక్తిత్వాలనుసరించి మార్కెట్లో సరిపడే గురువులు ఉంటారు. అందుకే ఇన్ని రకాల ఆశ్రమాలు. ఇందరు గురువులు.


50 ఏళ్ళ క్రితం వరకు, కుటుంబంలో తల్లిదండ్రులది మార్గదర్శకత్వం అయినప్పుడు, లౌకిక, ఆధ్యాత్మిక విషయాలు ఇళ్ళలోనే నేర్పబడేవి. నాగరికత, సంస్కృతి, జీవన విధానాలు, జీవన శైలులు, హక్కుల పరిరక్షణ పెరిగిన తర్వాత తల్లిదండ్రులు ఆ నిపుణతను, స్థానాన్ని కోల్పోయారు. తామే అయోమయ స్థితిలో ఉన్నారు. పిల్లలకేం నేర్పుతారు?


అలాగే ఇన్నాళ్లూ ఇంటో తల్లిదండ్రులతో పాటు పాఠశాలలలో, కళాశాలలలో, విశ్వ విద్యాలయములలో, రచనా రంగంలో, విజ్జులైన, లౌకిక, ఆధ్యాత్మిక విషయాలు తెలిసి బోధించే సమర్ధులైన గురువులు, రచయితలు ఉండేవారు. వారు ఈ రోజున లేరు.


అందుకే గురువులు, ఆశ్రమాలు తామరతంపరగా పెరిగి పోయాయి. వీరికి డబ్బు సంపాదించడం మాత్రమే ధ్యేయమైంది. 


శిష్య వాత్సల్యం కరువై, గురు శుశ్రూష మీద దృష్టి ఎక్కువైంది. 


తల్లిదండ్రులు అన్ని విషయములలోనూ ప్రథమ గురువులు. వారి స్థానం, పటిమ

తగ్గుముఖం పట్టాక, కుటుంబాలకు మార్గ

దర్శకత్వం ఆధ్యాత్మిక గురువులకు కట్టపెట్ట

బడింది. ఇది ముదావహమైన, చక్కని మార్పు కాదు. తల్లిదండ్రుల ప్రభావం మనపై ఉండి తీరాలి. ఆ విధంగా తల్లిదండ్రులు బాధ్యత వహించ గలిగే స్థాయిలో ఉండాలి.


లేకపోతే కుటుంబాలు మోసగాళ్ళు, అజ్ఞానులు అయినా ఆధ్యాత్మిక గురువుల అడ్డాలుగా మారతాయి.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Classics