శ్రీలత "హృదయ స్పందన"

Classics Inspirational

4.7  

శ్రీలత "హృదయ స్పందన"

Classics Inspirational

ప్రేమ!

ప్రేమ!

1 min
599



  ప్రేమ.. !


ప్రేమ అంటే భారం కాదు, 

బాధ్యత.. 

ప్రేమంటే అవసరం కాదు, 

అనుభూతి...

ప్రేమ అంటే నమ్మకం.. 


 ప్రేమను వర్ణించడానికి పదాలు.. పాటలు.. మాటలు.. కవితలు.. కథలు.. చాలవు..


కనులతో.. కనులు..

మనసుతో.. మనసు..

హృదయం తో.. హృదయం.. 

సంబాషించుకునే భావం ప్రేమ.. 

మనుషులు వేరు ప్రాణం ఒక్కటే.. అదే ప్రేమ.


 ప్రేమ వినటానికి రెండు అక్షరాలు.. అనుభవించాలి అంటే కొన్ని జన్మలకు సరిపోయే మధురమైన భావం..విఫలమైతే ఒక జీవితకాలం నరకం.

 

  నిజానికి ప్రేమ అంటే ఏంటి.. ఎప్పుడు.. ఎందుకు.. ఎలా కలుగుతుంది.. అది భావన నా..బాధ నా.. బాధ్యత నా..


ప్రేమ ఎప్పుడైనా.. ఎవరి మీద అయిన కలగొచ్చు.. దానికి సమయం.. సందర్బం.. అర్హత ఏది లేదు. 


మనిషిని చూసి కాదు.. మనసు చూసి ముందు ప్రేమ కలగాలి అంటాను నేను.. మనిషి లేకుండా మనసు ఎక్కడిది అని అనొచ్చు.. ముందు మనిషిని చూసి ప్రేమ పుడితే అది ఆకర్షణ.. అవసరం అని నా అభిప్రాయం.. అదే మనసు చూసి పుడితే అది ప్రేమ అంటాను.. 


 ప్రేమ అనుభవిస్తే మనసుకి అంతులేని అందమైన భావన...ప్రేమ అప్పుడప్పుడు వేదనతో కూడిన తీయని మధురమైన బాధ.. 

ప్రేమ అంగీకరిస్తే భరించగలిగే బాధ్యత..

 

 ఇది తెలియని చాలా మంది ప్రేమ విఫలం అయితే డిప్రెషన్ లోకి వెళ్ళటం, కెరీర్ నాశనం చేసుకోవటం, వ్యసనాలకు బానిస అవటం, చంపడం లేదా చావటం చేస్తున్నారు. మీ నిర్ణయం సరైందా కాదా అని ఒక్క నిముషం అలోచించి చూడండి..


  ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు. దేవుడు ఇచ్చిన జీవితాన్ని నిలబెట్టింది మన తల్లితండ్రులు. మరి మీరు ఒదులుకుంటున్న జీవితం ఎవరు ఇచ్చారు.. ఎవరికోసం ఒదులుకుంటున్నారు ఆలోచిస్తున్నారా? 

మీ ప్రాణం ఇచ్చేంత గొప్ప వాళ్ళు ఎవరు దేవుడా? తల్లిదండ్రులా లేకపోతే మిమ్మల్ని మీ ప్రేమను ఒద్దు అనుకున్న మీరు ప్రేమించిన వాళ్ళా? 


 మనకు జీవితం ఇచ్చిన దేవుడు కానీ, ఆ జీవితాన్ని నిలబెట్టిన తల్లిదండ్రులు కానీ మన ప్రాణం అడగనప్పుడు.ఇంకెవరికోసమో దాన్ని ఒదులుకోవటం అవివేకం కదా. 


 మీరు నిజంగా, నిజాయితీగా, నిస్వార్ధంగా ప్రేమిస్తే . మీ ప్రేమను వదులుకున్న వాళ్ళది దురదృష్టం.


 మీ ప్రేమ స్వచ్ఛమైనది ఐతే ఆ ప్రేమను స్వేచ్చ గా వదిలేయండి.. ఎప్పటికి అయినా అంత కంటే రెట్టింపు ప్రేమ మీ దగ్గరికి వస్తుంది.కావాల్సింది సహనం, నమ్మకం.



ఇదే నా భావాలలో ప్రేమ.. 




శ్రీ... 

హృదయ స్పందన.. 


  



ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar telugu story from Classics