Anjani Gayathri

Inspirational Others

4.5  

Anjani Gayathri

Inspirational Others

🌹అవకాశం 🌹

🌹అవకాశం 🌹

2 mins
362


🌹 అవకాశం🌹

రచన :- అంజనీ గాయత్రి.


" ఒక్క అవకాశం ఇయ్యి సుధా, " అంటూ ప్రాధేయపడ్డాడు రవి. ఎందుకంటే??


 రవి, సుధను గాఢంగా ప్రేమిస్తున్నాడు. అదే విషయంగురించి చెప్పి తాను ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని ప్రాధేయ పడుతున్నా  సుధా ఒప్పుకోవడం లేదు.


" మరి నేను ఏం చేస్తే నీ మనసు మారుతుంది? నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు?? ప్లీజ్ చెప్పు సుధా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, చావడానికి అయినా సిద్ధమే, " అంటూ ఎమోషనల్ డైలాగులు చెబుతూ రోజు వేధిస్తున్నాడు.


" ప్రేమ అనేది మనసులో పుట్టుకు రావాలి గాని బలవంతం మీద, ఒప్పందం మీద వచ్చేది కాదు, నా గురించి ఎదురు చూడకు, నాకు నీపై అటువంటి అభిప్రాయం లేదు, " అంటూ ఖచ్చితమైన తన అభిప్రాయం తెలిపి అతని బారి నుండి జారుకుంది.


కానీ అతని నిరీక్షణ ఎంత కాలం అని ఎదురుచూస్తాడు, కానీ ఆమె మనసు మారడం లేదు, స్వతహాగా మనసులోంచి ప్రేమ పుట్టుకు రావాలి గాని, ఎవరి ఒత్తిడి మీద ప్రేమ పుట్టుకురాదు.


"మనిషిని చూడగానే పుట్టే ప్రేమ శాశ్వతం అనుకుంటే పొరపాటే," అని ఇలాంటి మగవాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో? రోజురోజుకి ఇతని బాధ ఎక్కువైంది అని ఆలోచిస్తుంది సుధ.


 కాలేజీలో కనిపిస్తే చాలు, ఇంటికి వచ్చే వరకు వేధిస్తూనే ఉంటాడు. ఆ విషయమే ఇంట్లో తెలిస్తే అతని మూలంగా తనని కాలేజ్ మాన్పించేస్తారు. ఎలా ఇతనిని వదిలించుకోవాలా? అని ఆలోచిస్తుంది.


 అదే విషయం ఫ్రెండ్ నీరజాతో చెప్పింది .


" నువ్వేమీ అనుకోనంటే నాదో మాట, " అంటూ సందేహంగా చూస్తూ ఉండిపోయింది నీరజ.


"ఏమిటో? ఆ మాట! అలా రాయిలా ఉండిపోక అసలు విషయం చెప్పు?" అంటుండగానే


 మనసులో కొంచెం ధైర్యం కలిగి అసలు విషయం బయట పెట్టింది ఇలా, " మా అన్నయ్య హెల్ప్ తీసుకుని , ఆ రవి బారినుండి నిన్ను రక్షించవచ్చు, " అని చెబుతుండగానే,


" అంటే నీ ఉద్దేశం ఏమిటి?? ఇలా డొంకతిరుగుడుగా కాకుండా డైరెక్ట్ గా చెప్పు?" అంటూ నిలదీసింది సుధ.


" ఏం లేదు మా అన్నయ్య నువ్వు ప్రేమించుకుంటున్నారు అని చిన్న అబద్ధం చెబితే రవి ఆటలు కట్ , ముందుగా ఈ విషయం మా అన్నయ్యని అడిగి, ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండేట్టుగా నాటకం ఆడదాం , ఏమంటావే? " చెప్పు అంటూ మాట పూర్తి కాకముందే,


" ఏడ్చినట్టు ఉంది నీ ఐడియా , ఇలాంటి ఐడియాలు రిస్క్ కదా, మీ అన్నయ్య ముందు నా పరువు పోతుంది, " అంటూ నోటికి వచ్చిన తిట్లు తిట్టి ఆమె వైపు చూడకుండా ముఖం తిప్పుకుంది.


" మా అన్నయ్య మంచివాడు, అందరి లాంటి వాడు కాదు , కావాలంటే తర్వాత నువ్వే చూస్తావుగా? ఈ విషయం తనతో మాట్లాడిన అంటే చెప్పినా ఏమీ అనడు, మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. రవిగాడిలా వేధించే రకం కాదు ,


 తర్వాత నీ ఇష్టం చెప్పవలసింది చెప్పాను , రోజు ఆ రవిగాడి వేధింపులు భరించు,అంతే,నీ ఖర్మ, " అని తన పని తాను చూసుకుంటుంటే,


" అయితే నువ్వు చెప్పిన ఐడియాకు ఓకే , మీ అన్నయ్య అభిప్రాయం అడిగిచెప్పు, " అంటూ స్నేహితురాలితో ఏకీభవించింది.


 నీరజ వాళ్ళ అన్నయ్య వాళ్ల ఒప్పందానికి ఒప్పుకుంటాడని ఆ అవకాశాన్ని సుధా సద్వినియోగం చేసుకుంటుందని

అనుకుందాం.


🌹🌹🌹🌹🌹🌹.


Rate this content
Log in

Similar telugu story from Inspirational