Anjani Gayathri

Inspirational Others

4.5  

Anjani Gayathri

Inspirational Others

🌹 కలసిఉంటే కలదుసుఖం 🌹

🌹 కలసిఉంటే కలదుసుఖం 🌹

2 mins
308


" కలసిఉంటే కలదుసుఖం "


రచన :-అంజనీగాయత్రి 


" మనలో మనకు మనస్పర్థలు ఎందుకు? " నీ ఇష్టప్రకారం ఇంటివెనక వైపు మామిడిచెట్టు నుండి చివరనున్న పనసచెట్టు సరిహద్దుగా ఉన్న స్థలం నీకు రాయిస్తాను, ముందు నీ భార్యని తీసుకొని ఇంటిలోకి వెళ్లు, " అనితమ్ముడు తో నచ్చచెప్పి గొడవసర్దుమనిగేలా చేసాడు ఇంటికి పెద్ద కొడుకు కృష్ణారావు.


 తండ్రి పోయి ఆర్నెల్లయినా కాకుండానే ఆ ఇంటిలో ఆస్తి కోసం గొడవలు మొదలయ్యాయి. చిన్న కోడలు కళ్యాణి , భర్త శ్రీకాంత్ కి ఎక్కించి ఆస్తి పంపకాలు చేస్తే వేరే కాపురం పెట్టొచ్చని ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలని చూస్తోంది. ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లి చేశారు. ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. తండ్రి పోయాడు. తల్లితో ఉంటున్నారు అన్నదమ్ములిద్దరూ. మధ్యలో కళ్యాణి కల్పించుకొని కాపుకి వచ్చే చెట్లు ఉన్న స్థలం తమకి రావాలని పట్టుబట్టింది.


 తండ్రి పోయి ఏడాది కాకుండానే ఇంటి పరువు రోడ్డుకెక్కడం ఇష్టం లేదు కృష్ణారావు కి మరియు తల్లికి. వాళ్లకు తగ్గట్టుగానే దొరికింది పెద్దకోడలు కస్తూరి. ఓర్పుతో భర్త అడుగు జాడల్లో నడిచే మనిషి పెద్దవాళ్లు అంటే గౌరవం," అత్తగారు బాధ పడుతుంది అని కళ్యాణి కోరినట్లుగానే ఇమ్మని భర్త కృష్ణా రావు కి " చెప్పింది కస్తూరి.


 " నిత్యం గొడవలు పడుతూ కలిసుండే కంటే విడిపోయి దూరంగా ఉండి ప్రేమగా ఉంటే మంచిది, " వాళ్ళు కోరినట్లుగానే ఆస్తి పంపకాలు చెయ్యండి, కరణంగారు ! అని కృష్ణారావు దంపతులు చెప్పారు. ఆ మాట ప్రకారం ఆ ఊరి కరణం , స్థలం కొలతలు వేసి దస్తావేజులు సిద్ధం చేసి పంపకాలు జరిపారు.


 అన్నగారి కంటే ముందే శ్రీకాంత్, కళ్యాణి దంపతులు వాళ్ళకు వచ్చిన ఖాళీ స్థలంలో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టారు. వెనక ఉన్న చెట్లమీద వచ్చే ఆదాయం కూడా వెనకేసుకుని వడ్డీలకు అప్పులు ఇవ్వడం మొదలుపెట్టింది కళ్యాణి


ఆమె ఆడింది ఆట పాడింది పాటగా వుంది ఆ ఇంట్లో. ఎందుకంటె?? వేరే కాపురం కదా! శ్రీకాంత్ అడ్డు చెప్పడు, వచ్చిన డబ్బు మొత్తం పెట్టి నగలు కొని ఒళ్ళంతా నింపేసుకొని, తోటి కోడలు కనిపించినప్పుడల్లా " దేనికైనా పెట్టి పుట్టాలి, ఈ ఇల్లు కట్టింది మొదలు, ఇంట్లో కి వచ్చాక నా దశ తిరిగింది, కొంతమంది ఈసురో దేవుడా!! " అంటూ మొహం పెట్టుకుని ఏడుస్తుంటారు అని సూటిపోటి మాటలు అంటుంది. కస్తూరి చిన్నబుచ్చుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది 


 కొన్ని రోజుల తర్వాత కళ్యాణి ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళుతుంది. శ్రీకాంత్ కూడా ఏదో పని మీద ఊరు వెళ్తాడు. ఇంట్లో ఉన్న నగలు, విలువైన సామానంతా దొంగలు దోచేస్తారు. వెళ్లేటప్పుడు కనీసం ఇల్లు చూడమని కూడా చెప్పరు కృష్ణారావు వాళ్లకి. అంటీ ముట్టనట్టు పరాయి వాళ్ళతో ఉన్నట్టు గా ఉంటున్నారు. మంచి చెడ్డ చెప్పడం మానేసారు. ఊరు నుండి వచ్చి ఇల్లంతా చూసుకుంటే దొంగలు దోచేసినట్లు అన్ని తెరచివున్నాయి. తలుపులుమాత్రం దగ్గరగా వేసి ఉన్నాయి. ఇద్దరు గోల గోల చేశారు. కృష్ణారావు వాళ్లు వచ్చి తమ్ముడుని మరదల్ని ఇంటికీ తీసుకెళ్లి ఓదార్చారు.


పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి శ్రీకాంత్ తో పాటు వెళ్ళాడు కృష్ణారావు. పోలీసులని మార్వాడి బంగారం షాపుల దగ్గర మఫ్టిలో నిఘా పెట్టి ఎలాగైతే దొంగని పట్టుకోగలిగారు. ఎలాగంటే?? దొంగ కాజేసిననగలు అమ్మడానికి షాపుదగ్గర సేటుతో మాట్లాడటం, "నగలు భార్యవని,అవసరానికి అమ్ముతున్నాను" అనిబుకాయించాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు నగలుతీసుకొనివెళ్లి కళ్యాణికి చూపించారు. అవి "మా నగలే అని గుర్తులు చెప్పారు," కళ్యాణి వాళ్ళు.


 దొంగని గట్టిగా నాలుగుదెబ్బలు తగిలించేసరికి " తన భార్య ఆపరేషన్ నిమిత్తం చాలా డబ్బు అవసరం అని, అంత డబ్బు తన దగ్గరలేదు అని దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నాడు, " వెంటనే అతని భార్య "ఆపరేషన్ కు అవసరం అయినడబ్బు అప్పు గా ఇస్తాను, వడ్డీ అక్కర్లేదు," అని కళ్యాణి అంటుంది. ఎలాగైతే తన నగలు దొరికినందుకు సంతోషంగా ఉంది. ఈ ఆపద సమయంలో బావగారు, తోటి కోడలు, అత్తగారు తోడుగా వున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది కళ్యాణి. ఆ సంఘటన జరిగినప్పటి నుండి వాళ్లతో సఖ్యంగా ఉంటూ అందరికి సహాయం చేసే గుణం నేర్చుకుంది.


 అందుకే " కలిసి ఉంటే కలదు సుఖం " అన్నారు పెద్దలు.

 🌹 సమాప్తం 🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational