Lahari Mahendhar Goud

Children Stories Drama Inspirational

4  

Lahari Mahendhar Goud

Children Stories Drama Inspirational

టీచర్ స్టాఫ్ రూంకి పిలిస్తే

టీచర్ స్టాఫ్ రూంకి పిలిస్తే

2 mins
238


 ""మనసన్నది నాకున్నది

అది విన్నది ఓ చిన్నది

నూవన్నది నేనన్నది

మనమన్నది రేపన్నది""


ఏంటి లహరి కవిత్వంకి బదులు కపిత్వం రాసింది అనుకుంటున్నారా

అవును మరి అది నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు రాసింది

అప్పుడు ప్రాసలో రాయడమే కవిత్వం అనుకునేదాన్ని


ఒకరోజు తొందరలో మా చెల్లి దాని బుక్ కు బదులు నా నోట్బుక్ పట్టు కెళ్ళింది స్కూల్ కి


ఆ బుక్ లోనే పైన రాసిన కవి(పి)త్వం ఉంది

నా బ్యాడ్ లక్ కొద్ది అది కొత్తగా వచ్చిన మా హిందీ టీచర్ కళ్ళలో పడింది 

టీచర్ కి మా చెల్లి వాళ్ళ క్లాస్ అయిపోగానే అందరికీ మార్నింగ్ బ్రేక్


ఆ బ్రేక్ టైం లో ఒక అబ్బాయి వచ్చి 

నిన్ను జ్యోతి మేడం రమ్మంటుంది అని చెప్పి వెళ్ళాడు

స్టాఫ్ రూమ్ లోకి మేడం పిలిచింది అంటే 

సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అండి...😱😰


అంతకుముందు జరిగిన యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ లో నాకు హిందీ లో 16 మార్క్స్ వచ్చాయి 


[కానీ నేను రాసిన దానికి అన్ని మార్క్స్ మేడం ఎలా వేసిందో ఇప్పటికీ నాకైతే అర్థం కాలేదు...😜]


ఆ మేడం పర్సనల్గా మా అమ్మకి చాలా క్లోజ్ 

ఎక్కడ ఆ మార్క్స్ గురించి క్లాస్ పీకడానికి పిలుస్తుందోనని మా ఫ్రెండ్స్ ఒకవైపు భయపెట్టేస్తున్నారు 


భయంతో ఫుల్లుగా చెమటలు పట్టేశాయి 

పక్కనున్న నా ఫ్రెండ్స్ ప్రేయర్ స్టేజి వరకు తోడు రమ్మంటే వస్తాము గాని 

స్టాఫ్ రూమ్ లోకి రావడం మా వల్ల కాదు అని చేతులెత్తేశారు


పాపం వాళ్ళు అన్నట్లుగానే ప్రేయర్ స్టేజి వరకు నాకు తోడు వచ్చారు


ఇంక అక్కడి నుండి భయంతో కాళ్లు వణుకుతుంటే అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా స్టాప్ రూమ్ దగ్గర నిలబడి పర్మిషన్ అడుగుతున్న నన్ను 

స్టాఫ్ రూమ్ లో ఉన్న టీచర్స్ అందరూ ఒకేసారి తలెత్తి చూడటంతో 

నా పై ప్రాణాలు పైనే పోయాయి అంటే నమ్మండి


వెంటనే మేడం రా నా దగ్గరికి అని సైగ చేసింది

నేను వెళ్లి చాలా వినయంగా చేతులు కట్టుకుని మేడం పక్కన నిలుచున్నాను 

కానీ భయంతో మేడం ని నేను ఫుల్లుగా చూడలేకపోతున్నాను


వెంటనే మేడం మా చెల్లి బుక్ ని అదేనండి 

మా చెల్లి దగ్గర తీసుకున్న నా బుక్కు ని టేబుల్ పైన పెట్టి 

ఏంటిది అని అడిగింది

నాకు భయంతో అంత పెద్ద మేడమ్ ఏ కనబడడం లేదు ఇంక ఆ బుక్ ఏం కనిపిస్తుంది 

ఆ బుక్ లో ఉన్న అక్షరాలు ఏం కనిపిస్తాయి


కష్టం మీద ఒక్కో అక్షరం నోట్లోకి తెచ్చుకొని 

ఏం..టి..   మే...డం... అని అడిగాను


ఆ బుక్ లో ఉన్నది ఎవరు రాశారు అని అడుగుతున్నా 

అని బేస్ వాయిస్ లో మేడం అడగ్గానే 

నేనేదో తింగరి పని చేశాను 

అది మేడం కంట్లో పడింది 

అని నా కంట్లో నుండి జలజలా 

కన్నీళ్లు బయటకి జంపు చేసేసాయి


అప్పుడు చూసింది మేడం నాలోని భయాన్ని

ఏ అమ్మాయి (ఇక్కడ నా పేరు అనుకోండి) ఎందుకు ఏడుస్తున్నావ్

నువ్వు చాలా బాగా రాస్తున్నావు 

లాంగ్వేజ్ టీచర్ గైడెన్స్ తీసుకో లేదా 

ఎవరైనా పెద్ద వాళ్ల గైడెన్స్ తీసుకో 

అని చెప్పటానికి పిలిచానమ్మా

అంటూ ఆవిడ మెచ్చుకోగానే అప్పటివరకు నిండిన భయం ప్లేస్ లో చిన్న స్మైల్ వచ్చి చేరింది


వెంటనే మా తెలుగు టీచర్ సర్వోత్తమ రావు సార్ 

మేడం చేతిలో నుండి ఆ బుక్ తీసుకుని చూసి వేలెడంత లేవు ఇలాంటి కవిత్వం వ్రాయటం ఏంటి

మనం రాసే టాపిక్ అందరి మనుసులకి చేరేలా ఉండాలి అని నెత్తి మీద చిన్న మొట్టికాయ వేశారు


మీ ఇంటి ముందరే లైబ్రరీ ఉంది కదా 

స్కూల్ నుండి వెళ్ళగానే అక్కడ ఉన్న బుక్స్ చదువు, చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలా రాశారో జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్ 

అని సలహా ఇచ్చి, ఒక ఆశ చాక్లెట్ ఇచ్చి బయటకు పంపించారు


యాక్చువల్లీ నేను గెలిచిన ఫస్ట్ గిఫ్ట్ ఆ ఆశ చాక్లెట్ ఏ అనుకుంటా😎




Rate this content
Log in