Lahari Mahendhar Goud

Drama Tragedy Crime

4  

Lahari Mahendhar Goud

Drama Tragedy Crime

ఫ్రీడం మీకా మాకా

ఫ్రీడం మీకా మాకా

3 mins
396



డాడీ నా సిమ్ తీసుకురమ్మని చెప్పి 2 డేస్ అవుతుంది అయినా మీరు పట్టించుకోవట్లేదు

అంటూ వాళ్ళ డాడీ పైన అరుస్తూ కాలేజ్ కి టైం అవుతుండడంతో బ్యాగ్ సర్ధుతుంది నవీన...



హడావిడిగా వెళ్తున్నా కూతురుని ఆపి ఆమె చేతిలో కంప్లైంట్ లెటర్ పెట్టాడు నవీన తండ్రి


నవీన

ఏంటి డాడీ ఇది...?


డాడీ

నీ మొబైల్ పోయినట్టు పోలీస్ కంప్లైంట్ లెటర్

ఇది తీసుకెళ్లి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఇచ్చావంటే

నీ నెంబర్ తో కూడిన సిమ్ నీకు ఇచ్చేస్తారు....


నవీన

అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి నేనే వెళ్లాలా...? 

అక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది

నావల్ల కాదు


వంశీ

క్యూ లైన్ మాత్రమేకాదు

బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఆడవాళ్లు అరుదుగా కనిపిస్తారు మామయ్య

సిమ్ తీసుకోవడం నవీనకు కష్టమే కానీ 

ఆ కంప్లైంట్ లెటర్ ఇటివ్వు నవీన నేను తీసుకొస్తాను


డాడీ

ఏంట్రా నువ్వు తీసుకొచ్చేది

దాని పనులు అది చేసుకోవడం అలవాటు చేయాలి

చూడు నవీన ప్రతీ పని ఇండిపెండెంట్గా చేసుకోవడం చదువుకున్న అమ్మాయిల లక్షణం

ఎప్పటికీ నీ పని చేసి పెట్టడానికి నేను ఉంటాను అనే నమ్మకం లేదు కదా


వంశీ

నేను ఉన్నా కదా మామయ్య నవీనా పనులు చేయడానికి


డాడీ

అయినా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ 

మీ కాలేజ్ పక్కనే

నీ ఫ్రెండ్స్ ని ఎవరినైనా తీసుకుని వెళ్ళు

అప్పుడే బయట ప్రపంచంలో ఎలా మసలుకోవాలో నీకు తెలుస్తుంది

ఆడపిల్లలు ఎప్పుడు తమ అవసరాల కోసం ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతారో 

అప్పటినుండి వాళ్ళు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు 

ఇది బాగా గుర్తు పెట్టుకో నవీన


వంశీ

నవీనకు మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారేమో అని మీకు అనిపించట్లేదా మావయ్య


డాడీ

నా కూతురికి ఇండిపెండెంట్గా బతకడం నేర్పిస్తున్నాను అనుకుంటున్నాను వంశీ 

ఇందులో నీకు ఏమైనా అభ్యంతరం ఉందా


గేట్ దాటుతున్న నవీన వాళ్ల మాటలు వింటూ కాలేజ్ కి వెళ్లిపోయింది


*************

మూడు సంవత్సరాల తర్వాత


నవీన

బావ నువ్వు మొన్న తెచ్చిన స్టిక్కర్ ప్యాకెట్ సైజ్ చాలా పెద్దగా ఉంది 

నా ఫేస్ కి అస్సలు సూట్ అవ్వట్లేదు

నన్ను షాప్ కి తీసుకెళ్తే నేనే తీసుకుంటాను కదా


వంశీ

ఒక చిన్న స్టిక్కర్ ప్యాకెట్ కోసం నువ్వు షాప్ కి ఎందుకే

ఏ నాకు ఆమాత్రం బ్రెయిన్ లేదు అనుకుంటున్నావా...!

నువ్వు అడగాలే కానీ నింగిలోని జాబిల్లినైనా తీసుకొచ్చి 

నీ అరచేతిలో పెడతాడు మీ బావ


నవీన(మనసులో)

నీలాంటి వాడు భర్తగా దొరకడం నా అదృష్టం బావ 

అయినా మా డాడీ నా కోసం ఏం సెలెక్ట్ చేసినా 

అది పర్ఫెక్ట్ గా ఉంటుంది 

అని మురిసిపోతూ ఉంటుంది


రెండు రోజుల తర్వాత


నవీన

బావ ఈవెనింగ్ ఆఫీస్ నుండి వచ్చాక నన్ను షాప్కి తీసుకెళ్ళవా


వంశీ

షాప్ కా

ఎందుకు అని నొసలు చిట్లించగానే


నవీన 

అదేంటి బావా రేపు నా ఫ్రెండ్ స్వాతి పెళ్లి ఉందిగా

నా సారీకి తగ్గ బ్యాంగిల్స్ లేవు

నువ్వు ఆఫీస్ నుండి వచ్చాక నన్ను షాప్కి తీసుకెళ్ళావంటే బ్యాంగిల్స్, అలాగే నాకు కావాల్సిన కొన్ని పర్సనల్ వస్తువులు ఉన్నాయి అవి కొనుక్కోవాలి


వంశీ

బ్యాంగిల్స్ ఏదో సైజు నాకు ఇవ్వు

అయినా నా దగ్గర చెప్పలేని పర్సనల్ వస్తువులు ఏంటే

ఏం కావాలో వాట్సాప్ లో మెసేజ్ చేసి

నా ఆఫీస్ టైమింగ్స్ కన్నా 20 మినిట్స్ ముందు కాల్ చెయ్ వచ్చేటప్పుడు తీసుకొస్తా


నవీన

నీ దగ్గర నాకు పర్సనల్ ఏంటి బావ

కానీ షాప్ లో అవి నువ్వు అడగడం అంత బాగోదు

అందుకే నన్ను తీసుకువెళ్ళమని అడుగుతున్న


వంశీ

నేను అడగడానికి బాగోలేనివి

నువ్వు షాప్ లో ఎలా కొనుక్కుంటావ్

నోరు మూసుకుని నాకు వాట్సప్ చెయ్

నిన్ను షాప్ కి తీసుకెళ్లటం మాత్రం కుదరని పని


నవీన

ఏంటి బావ ఏది అడిగినా

నువ్వే తీసుకొస్తాను అంటావు కానీ

నన్ను మాత్రం షాప్ కి తీసుకెళ్ళవ్


వంశీ

ఇండివిడ్యువాలిటీ, ఇండిపెండెన్సీ అనే మాటలతో

నీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చి చెడగొట్టాడే మీ డాడీ

నేను మీ డాడీలా కాదు

ఆడవాళ్ళు అస్తమానం షాప్ ల వెంట తిరగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు


నవీన

అంటే ఏంటి నీ మాటలకి అర్థం బావ

లైఫ్ టైం నన్ను ఏ షాప్ లోకి వెళ్లనివ్వకుండా

ఇలా అన్నీ నువ్వే తెచ్చి పెడుతూ ఉంటావా

లోకం మీద ఎవరు షాప్ లోకి వెళ్లి కొని తెచ్చుకోవటం లేదా

అయినా నేను ఎలా పెరిగానో తెలిసికూడా ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు


వంశీ

లోకంలో ఉన్న ఆడవాళ్ళు సంగతి నాకు అనవసరం

బయట మగ పురుగులు ఎలా ఉన్నారో నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను విను

నా భార్యను అలా షాపులలో ఎవరూ తాకకూడదు, చూడకూడదు అనుకుంటాను

నీకు ఏమీ తక్కువ కాకుండా అపురూపంగా చూసుకుంటాను అని మీ డాడీకి మాట ఇచ్చాను 

అలాగే కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటాను

మన బంధువుల్లో, ఫంక్షన్స్ లో ఎలాగైనా ఉండు పర్లేదు

కానీ పదిమంది తిరిగే పబ్లిక్ ప్లేస్ లోకి తీసుకు వెళ్ళమని మాత్రం అడగొద్దు

కాదు కూడదు మా డాడీ నన్ను చాలా స్వతంత్రంగా పెంచాడు అలాగే ఉంటాను అనుకుంటే

వెళ్లి మీ డాడీ దగ్గర నీకు కావలసినంత స్వతంత్రంగా బ్రతకొచ్చు నిన్ను ఆపే వాళ్లెవరూ లేరిక్కడ


నవీన

బంధువుల్లో ఫంక్షన్స్ లో మాత్రం ఎందుకు

ఎంచక్కా ఒక బుర్కా తెచ్చి నాకు వేసి తీసుకెళ్ళు

అప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ నన్ను చూడలేరు కదా

నీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది


వంశీ

నిజంగా నా మనసు కలవరపడిన రోజున

అలా బుర్క వేయడానికి కూడా వెనకాడనులే

నాకు ఆఫీస్ కు టైం అవుతుంది

నోరు మూసుకుని నీకేం కావాలో

వాట్సప్ చెయ్ 

నేను వెళ్తున్న బాయ్



వంశీది ప్రేమనుకోవాలో...,

అనుమానం అనుకోవాలో...,

భయం అనుకోవాలా తెలియని పరిస్థితులలో కళ్ళలో నుండి కన్నీళ్ళు చెక్కిళ్ళ మీదుగా జారిపోతుంటే

"""ఆడపిల్లలు ఎప్పుడు తమ అవసరాల కోసం ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతారో 

అప్పటినుండి వాళ్ళు తమ అస్తిత్వాన్ని కోల్పోతారు"""" 

అని వాళ్ల డాడీ మాటలు పదే పదే చెవిలో మ్రోగుతుండగా వెళ్తున్న వంశీని అలాగే చూస్తూ నిలబడిపోయింది నవీన



ఎవరైనా అబ్బాయి పెళ్లి సెట్ అయింది అనగానే

ఇంకేంటిరా నీ లైఫ్ కి ఫ్రీడమ్ పోతుంది అంటూ చుట్టూ ఉన్నవాళ్లు ఆటపట్టిస్తుంటారు

నిజానికి

పెళ్లితో ఇండివిడ్యువాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ పోయేది అమ్మాయిలకే


పెళ్ళికి ముందు అమ్మాయి తల్లితండ్రులు ఎంత ఉన్నతంగా చదివించినా, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినా...,

పెళ్ళి తర్వాత భర్త మెంటాలిటిని బట్టి మాత్రమే 

ఆ అమ్మాయి చదువుకు, వ్యక్తిత్వానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి




Rate this content
Log in

Similar telugu story from Drama