Lahari Mahendhar Goud

Drama Tragedy Classics

4  

Lahari Mahendhar Goud

Drama Tragedy Classics

ఇలా గడుస్తుంది అనుకోలేదు

ఇలా గడుస్తుంది అనుకోలేదు

5 mins
272


ఒక బ్రదర్ పెళ్లి, అలాగే మేనల్లుడి రాకతో కొత్త సంవత్సరం చాల హుషారుగా మొదలైంది

అలాగె కన్స్ట్రక్షన్ వర్క్ ఫినిష్ అయిపోతే ఇంక గృహప్రవేశమే అని ఆనందంగా ఎదురు చూస్తున్న సమయంలో కొద్దిగా ఆరోగ్యం క్షీణించింది


ఇంజక్షన్ నిడిల్ చూస్తేనే కళ్ళలో నుండి టపటపా నీళ్ళు కారిపోయే నేను

2 రోజులు వరుసగా సెలైన్ పెట్టించుకోవాల్సి వచ్చింది

ఒక వారానికి ఆరోగ్యం కొద్దిగా మెరుగవడంతో

ఇంక గృహ ప్రవేశానికి సంబంధించిన పనులు & షాపింగ్స్ అన్నీ చేసేసి కరెక్ట్ గా ఫంక్షన్ 4 రోజులు ఉందనగా మళ్ళీ సిక్ అయిపోయా కానీ ఈ సారి

నా హెల్త్ గురించి బయటపడకుండా అందరి ముందూ కవర్ చేసుకుంటూ కష్టం మీద నెట్టుకొస్తున్న సమయంలో బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగాయి

ఇంక ఆ క్షణం నుండీ గృహప్రేశం రోజు వరకూ

ఓ.ఆర్.యస్ ల మీదే నెట్టుకొచ్చిన

ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి మళ్ళీ ఇంజక్షన్ తీయగానే

అతను - అతని చేతిలో ఇంజక్షన్ చూస్తూంటే

నరకానికి ఎంట్రెన్స్ లో ఉన్న ద్వారపాలకుడు ముళ్ళ గదతో ఆహ్వానం పలికినట్లు అనిపించింది

నహీ అంటూ అరిచి కళ్ళు మూసుకున్న నేను

కళ్ళు తెరిచే సమయానికి సగం సెలైన్ అయిపోతూ కనిపించింది

వెంటనే నేను నా మనసులో

అయినా నాలాంటి మంచి వాళ్ళు నరకానికి ఎందుకు వెళ్తారులే అని నాకు నేనే భుజం తట్టుకున్నాను 


ఇంతలో మా బంధువుల పెళ్లి ఒకటి వచ్చింది

ఆ గ్లూకోజ్ ఎఫెక్ట్ అనుకుంటా చాలా హుషారుగా రెడీ అయి బయటకు రాగానే

శుభమా అని పెళ్ళికి వెళ్తుంటే ఈ బ్లాక్ పట్టుచీర ఏంటే అని మా అమ్మ మళ్ళీ దండకం స్టార్ట్ చేసేంది

నాకూ మా అమ్మకి బ్లాక్ విషయంలో ఎప్పుడూ ఉండేదే కాబట్టి నేను ఏమీ పట్టించుకోకుండా బయల్దేరాను

పెళ్లి చాలా బాగా ఎంజాయ్ చేసి రిటర్న్ వస్తుండగా ఒక ఆవు పరిగెత్తుతూ వచ్చి బైక్ కి గుద్దుకోగానే నేనెళ్ళి అమాంతం రోడ్డు మీద పొరివి దండాలు పెట్టడం

అక్కడే ఉన్న జనాలు వచ్చి లేపడం క్షణాల్లో జరిగిపోయింది

ఇంటికి వస్తూనే మా అమ్మ, ఆ ఆక్సిడెంట్ ను బ్లాక్ సారీ కాతాలో వేసేసింది 

స్వెల్లింగ్ ఏమి రాలేదు కాబట్టి

కాలు విరగలేదు అని సర్టిఫై చేసి

జాండూ బాం రాసి హాట్ బ్యాగ్ పెట్టింది

నెక్స్ట్ డే కొంచం పెయిన్ అనిపించినా

మూడు రోజుల్లో నార్మల్ అయిపోయా


ఆ తర్వాత చిన్నా చితకా ఫంక్షన్స్ వచ్చినా

నేను వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చుయించలేదు

ఒక 23 డేస్ కి ఇంకో బర్త్ డే పార్టీ అని ఇన్విటేషన్ రాగానే

రాత్రుళ్లు వెళ్ళటం నా వల్ల కాదు అని మా అమ్మ హాయిగ తప్పించుకోవటంతో మా అమ్మ మినహాయించి మేమంతా వెళ్లాల్సి వచ్చింది

బర్త్ డే బంకెట్ హాల్ లో చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు

అలాగె తిని పారేయటానికి అన్నట్లు ప్లేట్ లో పట్టనన్ని వెజ్ & నాన్ వెజ్ వంటకాలు చేయించారు

శుభ్రంగా భోంచేసాక

ఫైనల్ గా బర్త్ డే బాయ్ తో

ఫోటో దిగటం కోసం మళ్ళీ పైకి వెళ్ళాను

అలా ఆ పార్టీ అయ్యేలోపు ఒక 4-5 సార్లు స్టెప్స్ ఎక్కటం దిగటం చేసేసరికి

ఇంటికి చేరే లోపే కాలు నొప్పి నన్ను చేరింది

ఇంకేంటి

పోలో మంటూ అటునుంచి అటే హాస్పిటల్ కి వెళ్తే

మొదట ఎక్స్ రే అనీ, 

తర్వత యం.ఆర్.ఐ అనీ ఏవేవో టెస్టులు చేసాకా కుడికాలు నరం కొద్దిగా కదిలిపోయింది

మీరు బైక్ ఆక్సిడెంట్ అవగానే వచ్చుంటే వారం రోజుల్లో తగ్గిపోయేది,

ఇప్పుడు 40 డేస్ పట్టీ వేయాల్సిందే అంటూ

కాలు కదపరాకుండా పట్టీ వేసి బెడ్ కి అంకితం అవాల్సిందే అని హుకుం జారీ చేసాడు వెదవ డాక్టర్ (మా బ్రదర్ ఫ్రెండ్ యే లెండి)


అలా సోఫాలో కాలు కదపలేని పరిస్థితిలో

నాకు ఒక్క దానికే లాక్ డౌన్ వస్తే ఆ బాధ వర్ణనాతీతం 

టీవీలో చూసే సినిమాలు, వెబ్ సిరీస్లు అయిపోయినా

నాకు పరామర్శలు మాత్రం ఆగటం లేదు


రెస్ట్ తీసుకోవటం కూడా చాలా పెద్ద టాస్క్ అని అప్పుడే అర్థం అయ్యింది నాకు


కాలు నొప్పి కొద్దిగా తిగ్గిన తర్వాత కామారెడ్డిలో ఒక బర్త్ డేకి అటెండ్ అవాల్సి వచ్చింది

ఆ రోజు జూన్ 5థ్ నా లైఫ్ లో చాలా స్పెషల్ పర్సన్ను కలిసాను కాబట్టి నాకు అదొక అనిర్వచనీయమైన జ్ఞాపకం


కాలు నొప్పి పూర్తిగా తగ్గకపోయినా ఇంక రెస్ట్ ఉండటం నా వల్ల కాదంటూ నార్మల్గా ఉండటానికీ ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళ ముందు కుంటుతూ కాకుండ మామూలుగా నడుస్తున్న నన్ను కాలం చాలా పగ పట్టేసిందండి

ఎందుకంటారా


విపరీతమైన కడుపునొప్పితో హాస్పిటల్ కి వెళ్ళాము అమ్మా, నేనూ

డాక్టర్ చెక్ చేసి

ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే, మా అమ్మ నా మీద కంప్లైంట్స్ చెప్తుంది


ఈ వయసులో కూడా ఫుడ్ గురించి ఒకరు చెప్పాలా మీకు అంటూ 4 రోజులకు మెడిసిన్ & ఒక పేపర్ నిండా టెస్టులు రాసింది

తీరా బ్లడ్ టెస్ట్ దగ్గరకి వెళ్తే వాడేమో పెద్ద సిరంజీ నిండా బ్లడ్ తిసిందే కాకుండా 

అవసరం అయితే మళ్ళీ కాల్ చేస్తా వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్ళండి అంటే నాకు ఎక్కడా లేని కోపం వచ్చింది


హెల్లొ మిస్టర్ నేను బ్లడ్ టెస్ట్ కోసం వచ్చా

బ్లడ్ డొనేట్ చేయటానికి కాదూ అని గొడవ పెట్టుకోవాలి అని ఉన్నా

ఒంట్లో అంత ఎనర్జీలేక వాడికి ఒక వియార్డ్ లుక్ ఇచ్చి వచ్చేశా


నెక్స్ట్ డే ఈవెనింగ్ కాల్ చేసి

మేడం మీకు కుడుర్థే మళ్ళీ ఒక సారి వచ్చి బ్లడ్ ఇచ్చి వెళ్తారా అనటంతో

ఓపిక లేకున్నా వెళ్లక తప్పలేదు


రిపోర్ట్స్ రాగానే కాల్ చేస్తా మేడమ్ అంటూ స్మైల్ చేస్తున్న వాడిని చూస్తూంటే అదే సిరంజీతో చంపేయాలని అనిపించింది కానీ

వీడిని చంపి నేను జైల్ కి వెళ్తే

నా చాకొలేట్ ఫ్యాక్టరీ డ్రీమ్... డ్రీమ్లాగే మిగిలిపోతుందని దయతలచి వాడికి ప్రాణబిక్ష పెట్టి పెద్ద మనసుతో క్షమించేసా


మళ్ళీ నెక్స్ట్ డే డాక్టర్ కాల్ చేసి

అమ్మా లహరి నువ్వు మళ్ళీ వచ్చి టెస్ట్లకి బ్లడ్ ఇవ్వాలమ్మా అని చెప్పగానే


నిన్నే కదా డాక్టర్ గారు ఇచ్చొచ్చ ఇప్పటికే అరలీటరు బ్లడ్ తీసేసాడు మీ ల్యాబ్ టెక్నీషియన్ అని కంప్లైట్ లా చెప్పా ఏడుపు తన్నుకొస్తుంటే


ఆమె వెంటనే అమ్మకి కాల్ చేసి

అక్కా తొందరగా లహరిని తీసుకోని వచ్చి టెస్ట్లకి ఇచ్చి వెళ్ళండి అన్నారు 


అలా అమ్మ మళ్ళీ తీసుకెళ్ళి వాడితో బ్లడ్ తీయిస్తుంటే 

మొదట రెండు సార్లూ బ్లడ్ తీస్తుంటే టెన్షన్ తో ఎంతలా ఏడ్చి ఆ ల్యాబ్ టెక్నీషియన్ని సతాయించానో

ఈ సారి కూడా టెన్షన్ పడ్డాను కానీ

ఎందుకు నిజామాబాద్ లో ఇన్ని ల్యాబ్స్ ఉండగా

మళ్ళీ హైదరాబాద్ పంపిస్తున్నారు బ్లడ్ అనీ ఒకటే భయం


రిపోర్ట్స్ వచ్చే వరకూ నాకు భయంగానే ఉంది నాకు

ఒక నాలుగు రోజులకు రిపోర్ట్స్ వచ్చాయి

రేపు వచ్చి రిపోర్ట్స్ తీసుకోండి అని కాల్ చేశారు


ఇప్పుడు రిపోర్ట్స్ ఏమై ఉంటుంది అని మరో టెన్షన్

ఆ టెన్షన్తో రాత్రంతా నిద్రపోలేదు 


నెక్స్ట్ డే రిపోర్ట్స్ తీసుకొని రిసెప్షన్లో నా నేమ్ రాయించి క్యూ లో కూర్చున్న

ఆ హాస్పిటల్ లో పనిచేసే స్టాఫ్ ఒక్కొక్కరుగా వచ్చి

రిపోర్ట్స్ నీ - నన్నూ మార్చి మార్చి చూస్తూ ఉంటే

కొంపదీసి ఏ క్యాన్సరో , కరోనానో వచ్చి నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకనా

అందుకే అందరూ నన్ను అలా చూస్తున్నారా అని ఇంకో భయం మొదలైంది నాలో


ఇంతలో నా నంబర్ రావటంతో డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్ళాము

రిపోర్ట్స్ చూసిన డాక్టర్


అసలు నువ్వు ఎలా నడవగలుగుతున్నావు లాహరీ

నీకున్న బ్లడ్ లెవెల్ కి

ఒకటీ నువ్వు కోమాలోకి వెళ్ళాలి

లేదా

బెడ్ మీద నుండి లేచి నిలబడితేనే కళ్ళు తిరిగి పడిపోవాలి 

అసలు నువ్వు ఇలా నడుస్తుంటే నాకే విచిత్రంగా ఉంది


అక్కా లహరి బ్లడ్ రిపోర్ట్స్ చూడగానే

నేను ముందు షాక్ అయ్యా ఎందుకంటే

తను నార్మల్ గా నడిచి రావటం నేను చూసా కాబట్టి


మా ల్యాబ్ లో రిపోర్ట్స్ కరెక్ట్ గా రాలేవేమో అని

బయట వేరే ల్యాబ్ లో రెండో సారి టెస్ట్ చేయించాం సేమ్ రిజల్ట్స్ వచ్చాయి 

వెంటనే తనను పిలిపించి మళ్లీ బ్లడ్ తీసుకోని ఈ సారి టెస్ట్స్ కోసం హైదరాబాద్ పంపించాము

విచిత్రం ఏమిటంటే

అక్కడ రిపోర్ట్స్ లో ఇంకా తక్కువే వచ్చింది

అంటే మొదటి సారికీ - మూడో సారికి మధ్య 3 డేస్ గ్యాప్ లో

ఆమె ఇంకా బ్లడ్ లాస్ అయింది కాబట్టి రిజల్ట్స్ ఇలా వచ్చాయి 

అని మా అమ్మకి చెప్తూ

అసలు తింటున్నావా లహరీ ఓన్లీ గాలి పీల్చుకొని బ్రతికేస్తూన్నావా

కాస్త ఇష్టంతో ఫుడ్ తీసుకోమ్మా అని చెప్పి


అమ్మ వైపు తిరిగి

ఏం లేదక్క 

తనకి అర్జెంట్ గా 2 యూనిట్స్ బ్లడ్ అయినా ఎక్కించాలి

లేదా

నేను రాసే బ్లడ్ ఇంజక్షన్ 10 డేస్ కి ఒక సారి 3 సార్లు సెలైన్తో కలిపి పెట్టించాలి


ఇంక మా అమ్మ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నన్ను తీసుకోని ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పటం

మా వాళ్లు అదేదో పెద్ద నాకొచ్చిన మెడల్ లా మా కసిన్స్ గ్రూప్ లో పెట్టేయడం వెంట వెంటనే అయిపోయాయి


ఇంక చూడండి పరామర్శింపు కాల్స్ 🤦

నాకొచ్చిన ప్రాబ్లెమ్ తెలియనంత వరకూ ఉన్న దైర్యం కాస్త ఈ కాల్స్ తో పోయింది

చాలా నిరసపడిపోయా 

1స్ట్ టైమ్ నా రింగ్ టోన్ మీద నాకే విరక్తి వచ్చేసింది


మా బ్రదర్ వాడి డాక్టర్ ఫ్రెండ్స్ ను పిలిపించి ఇళ్లును హాస్పిటల్

బెడ్ రూం ను ఐసీయూ చేసేసాడు


అప్పటి నుండి నాన్ వెజ్, ఫ్రూట్, జ్యూస్ అంటూ డస్ట్ బిన్ లో వేసినట్లు

నా పొట్టలో పోస్తునే ఉంది మా అమ్మ

నా చేతిలో మొబైల్ చూస్తే చాలు దీని వల్లే ఆరోగ్యం పాడుచేసుకుంటున్నావ్ అని ఫోన్ ను తీసుకెళ్ళి బీర్వా లాకర్ లో పారేసింది


రాసిన బ్రెయిన్ కాలిగా ఉండదుగా 

ఒక నోట్ బుక్ లో సీరిస్ రాయటం మొదలు పెట్టా

ఈ సారి నా రచనల మీద పడింది మా అమ్మ చూపు

హెల్త్ సెట్ అయ్యే వరకూ ఏమీ రాయొద్దని హుకూమ్ జారీ చేసింది

అలా ఈ సంత్సరమంతా నేను పెట్టిన అప్డేట్స్ అన్నీ కూడా మా అమ్మకి తెలియకుండా రాసినవే


సో ఇదండీ నా 2022 ప్రయాణం

తీరా ఇయర్ ఎండింగ్ వచ్చాక వెనక్కి తిరిగి అదే నండీ 2022 మొత్తాన్ని తరచి చూస్తే

నేను ఎక్కువగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ

మెడిసిన్ని ఫుడ్ లా

తీసుకుంటూ నేను బాధ పడుతూ ఇంట్లో వాళ్లని బాధ పెడుతూ ఉన్నానా అనిపిస్తోంది


కాబట్టి కొత్త సంవత్సరంలో ఫుల్ గా తింటూ

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నా ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నానండీ 


ఇది నిన్న పెట్టాల్సింది

బట్ కుదరలేదు

పోనీలే కాంపిటీషన్ కోసం కాకపోయినా అందరికి

విషెస్ చెప్పినట్లు ఉంటుంది కదా అనిపించింది

అందుకే 2022 లాస్ట్ అప్డేట్ పెడుతున్న



Rate this content
Log in

Similar telugu story from Drama