Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Non-Stop November : FanFiction Edition

SEE WINNERS

Share with friends

మనలో అందరికీ ఏదో ఒక సూపర్ హీరో పాత్ర, అభిమాన సినీ నటి లేదా నటుడు మనసులో మెదులుతూ ఉంటారు. అది హార్రీ పాటర్, అవెంజర్స్, క్రిష్, రాజ్, లేదా గీత్ ఎవరైనా కావచ్చు. 

హార్రీ పోటర్ హెర్మాయిన్ దగ్గరే ఆగిపోయి ఉంటే…

పీటర్ పార్కర్ ను విషపు సాలీడు కుట్టకపోయి ఉంటే…

తెనాలి రామకృష్ణ కవి వేదం చదువుకుంటూ ఊరిలోనే ఉండిపోయి ఉంటే…

 వారి జీవితాలు మామూలుగానే ఉండిపోయేవి. అనుకోనిది జరగటమే జీవితం మరి.

రచయితలకు తమకు నచ్చిన ప్రసిద్ధ పాత్రలను అన్వయిస్తూ కాల్పనిక సాహిత్యంలో కొత్త ప్రయోగాలు చేసే అవకాశం…

కొత్త కాల్పనిక సాహిత్య ప్రయోగం చేసే అవకాశం అందుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా…

మీకు ఇష్టమైన సినీ, పౌరాణిక లేదా కాల్పనిక పాత్రల కథలకు మీరు ఊహించిన, మీకు నచ్చిన మలుపులతో రచించి కథనానికి మరిన్ని హంగులు అద్దే అవకాశం నాన్ స్టాప్ నవంబర్ పోటీ మీకు అందిస్తోంది.ఈ ఫ్యాన్ ఫిక్షన్ మారథాన్ లో మీ అభిమాన హీరోలు లేదా సూపర్ హీరోల లక్షణాలు కలగలిపి కథగా రాయచ్చు. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు ఈ పోటీ లో మీ ఊహలకు హద్దు లేదు ఈ లిట్ మారథాన్ నాన్ స్టాప్ నవంబర్ పోటీ లో.

స్టోరీ మిర్రర్ అందరు అభిమానులు రచయితలను నాన్ స్టాప్ నవంబర్ - కాల్పనిక సాహిత్యం/ ఫ్యాన్ ఫిక్షన్ పోటీ లో తమ లోని సృజనాత్మక కోణాన్ని మరింత అద్భుతంగా ఆవిష్కరంచమని ఆహ్వానిస్తోంది.

అసలు ఏమిటి ఈ పోటీ?

ఈ ఫ్యాన్ ఫిక్షన్ పోటీలో సూపర్ హీరో ల కథలు భిన్నంగా రాయాల్సి ఉంటుంది. ఒకటి లేదా అంత కన్న ఎక్కువ సూపర్ హీరోల లేదా సినిమా హీరోల లేదా హీరోయిన్ల పాత్రలను ఎంచుకోవచ్చు.

సీరియల్ హీరో/హీరోయిన్ లేదా నవలల పాత్రలను వారి లక్షణాలను కలిపి కూడా కథగా రాయవచ్చు.సదరు పాత్రల మూల కథలను నాందీ వాక్యంగా స్వీకరించి మీ శైలి లో కథ రాయవచ్చు.

నిబంధనలు:

1.అన్ని పోటీ అంశాలు పైన చిత్రంలో ఇవ్వబడ్డాయి.దయచేసి తేదీల వారీగా రోజు వారీ ఇచ్చిన అంశాల ఆధారంగా మీ కథా రచనలు పంపగలరు.

2.ప్రతి కథనూ మాతృక లో లైన్ స్వీకరించినా కథనం విభిన్నంగా ఉండేలా రాయవలసి ఉంటుంది.

3.జానర్ మీద ఎలాంటి నిబంధనలు లేవు. ఏ జానర్ లో అయినా రాయవచ్చు.

4.కథలు కేవలం పోటీ లింక్ ద్వారా మాత్రమే పంపాలి.

5.ఈ మైల్, హార్డ్ కాపీ, లేదా పోటీ లింక్ ఉపయోగించకుండా పంపిన కథలు పోటీ కి పరిగణింప బడవు.

6.పోటీ దారులు కేవలం స్వీయ రచనలు మాత్రమే పంపగలరు.

7.ఒక రోజు ఒక రోజు వారి అంశంపై ఒక రచయిత ఎన్ని కథలైనా పంపవచ్చు.

8.వ్యాసాలు లేదా ఆర్టికల్స్ పోటీ కి పరిగణనలోకి తీసుకొనబడవు.

9.పోటీ లో పాల్గొనడానికి ఎలాంటి రుసుము లేదు.

10.విజేత ఎంపిక ఎడిటోరియల్ స్కోర్, పాఠకుల లైక్స్, వ్యూస్, కామెంట్స్, రేటింగ్స్, ఆధారంగా నిర్ణయించబడుతుంది. విజేత అన్ని రోజువారీ అంశాలపై కథలు వ్రాసి ఉండాలి.

11.పోటీ దారులు ప్రతి రోజూ కనీసం ఒక రోజు వారీ అంశంపై అయినా కథ రాసి ఉండాలి.

12. పోటీ నిర్వహణ, విజేతల ఎంపిక లో స్టోరీ మిర్రర్ వారి నిర్ణయమే తుది నిర్ణయం.

విభాగాలు

కథలు మాత్రమే

భాషలు

మీ కథలు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా, బెంగాలీ భాషల్లో సమర్పించవచ్చు.

బహుమతులు

ప్రతి భాషలో అగ్ర విజేతలకు ఒక ట్రోఫీ, స్టోరీ మిర్రర్ తో కలిసి తమ పుస్తకాలు ప్రచురించే పబ్లిషింగ్ కాంట్రాక్ట్ బహుమతులు గా లభిస్తాయి.

ప్రతి రోజు అన్ని రోజు వారీ అంశాలకు కథలు రాసిన పోటీ దారులకు 200 రూపాయల విలువ గల స్టోరీ మిర్రర్ వౌచేర్ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు అందజేయబడుతుంది.

15-29 అంశాలపైన కథలు రాసిన పోటీదారులు అందరికీ 100 రూపాయలు విలువైన స్టోరీ మిర్రర్ వౌచేర్ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు లభిస్తుంది.

ప్రతి భాషలో కొన్ని ఎంపిక చేసిన కథల్ని పుస్తక రూపంలో ప్రచురణ చేయటం జరుగుతుంది.

పోటీ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నాన్ స్టాప్ నవంబర్ ఈ- సర్టిఫికేట్ అందజేయబడుతుంది.

వరుసగా పదిహేను రోజులు కథలు పంపిన పోటీ దారులకు లిటరరీ హాఫ్ మారథాన్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది.

వరుసగా 30 రోజులు కథలు పంపిన వారికి లిటరరీ మారథాన్ సర్టిఫికేట్ అందజేయబడుతుంది.

అర్హత

పోటీ జరిగే కాలం: నవంబర్ 01, 2020 వ తేదీ నుండి డిసెంబర్ 02, 2020 వరకు

ఫలితాలు

 డిసెంబర్ 2020 లో

సంప్రదించాల్సిన వారు

ఈమెయిల్:neha@storymirror.com

ఫోన్ నెంబర్:+919372458287



Trending content
28 318