Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

మనక్రీడలు

మనక్రీడలు

1 min
352



*మన క్రీడలు*


(తేటగీతి పద్యములు )


1.


క్రీడయనగా క్రికెట్టంచు నాడుచుండ

నడుసులోనుండు మన జాతి యాటలెపుడు

క్రీడ హాకీని మెచ్చునా కీర్తి కాంత?

పరుల క్రీడకు ప్రోత్సాహ బహుమతులిడ!/


2.


దేశసత్క్రీడలకు నేడు దిక్కులేదు

కాగితంబులపై జూపి కాకిలెక్క

దులుపు కొందురు చేతులన్- దోషులెవరు?

పరుగు పందెంబులన్ మన ప్రతిభ యెచట?


3.


ప్రశ్నలన్నియు వేసినన్ బదులురాదు

వీరకిరికెట్టుకనికట్టువెఱ్ఱిపట్టి

ఘనతవహియించుమనయాట గాంచరకట!

పాలకుల బుద్ధి మార్చెడి పథకమెద్ది?/


4.


ఉద్యమంబులు నడుపుచు నుధ్ధతిమెయి

పెంచి పోషింప క్రీడలన్ విరివిగాను

జనుల యభిమాన వరముచే జయము కల్గ

పతకములను దెత్తురు భావి పౌరులెపుడు./


5.


భారతస్థానమెద్దిప్రపంచమందు?

పరువు నిల్పెడి క్రీడలన్ బ్రతుక నిచ్చి 

ప్రోత్సహించిన క్రీడల పోరునందు

విజయులౌదురు మనవారు విశ్వమందు.//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational