ప్రేమంటే ఇదేలే
ప్రేమంటే ఇదేలే
సుఖాన్ని సంతోషాన్ని
నా వైపు తోసేసి ...
లాభాన్ని నాకోసం తీసి ఇచ్చేసి
కష్టాన్ని దుఃఖాన్ని
నీకోసం తీసేసుకున్నావు ...
నష్టాన్ని నీ పక్కన అట్టి పెట్టేసుకున్నావు
ఇదేమి పంపకమనే నా అయోమయానికి
పకపక నవ్వినదే నీ జవాబు
ప్రేమంటే ఇదేలే ! ఇలాగే ఉంటుందిలే !!
అంటూ ఆనందంగా ముక్తాయిస్తూ