Sirisha Siri

Classics

4.5  

Sirisha Siri

Classics

కన్నె పొర

కన్నె పొర

4 mins
426


సంధ్య కి అంత అయోమయం గా ఉంది... ఎందుకో దీపక్ తనతో రెండు రోజుల నుంచి ముభావంగా ఉంటున్నాడు..

ఎంత ఆలోచించిన కారణం అంతుపట్టడం లేదు తనకి... ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అడిగి చూసింది... గట్టిగ అడుగుదాం అంటే వాళ్ళ పెళ్ళి అయ్యి వారం రోజులు మాత్రమే అయ్యింది... ఏది ఐతే అది అయ్యింది విషయం ఏంటో కచ్చితంగా తెల్సుకోవాలి అని నిర్ణయం తీసుకుంది..

సంధ్య,దీపక్ లది పెద్దలు కుదిర్చిన పెళ్ళి.. పెళ్ళి చూపులలో ఒకరిని ఒకరు చూసుకుని చూసుకుని ఒకరికి ఒకరు విడి విడి గా మాట్లాడుకుని ఇద్దరి అభిప్రాయాలు కలిసాక పెళ్ళి చేసుకున్నారు.. పెళ్ళి ఐన మరుసటి రోజుకే శాంతి ముహూర్తం కి కుదరడం తో ఆ రోజుకే ముహూర్తం కాయం చేసారు..

అందరి అమ్మాయిలలానే ఎన్నో ఆశలతో తన కొత్త జీవితానికి నాంది పలుకుతూ పాల గ్లాస్ తో శోభనపు గది లోకి అడుగు పెట్టింది సంధ్య.. సిగ్గుతో ముందుకు కదలకుండా అక్కడే ఉండిపోయిన సంధ్యను ఎంతో అపురూపం గా చూస్తూ దగ్గరకు తీసుకున్నాడు దీపక్..

అలా ఎన్నో ఊసులతో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఆ రాత్రి ని మధురమైన రాత్రి గా మల్చుకున్నారు ఇద్దరు..

కానీ ఆ తరువాత రోజు నుంచే దీపక్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది..

సంధ్య ఎం మాట్లాడిన విని వినినట్లు గా ప్రవర్తించడం తను చేతితో వండినివి ఏమి తినకపోవడం.. పడక గదిలో కూడా తనని దూరంగా ఉంచడం లాంటి పనులు అన్ని చేస్తున్నాడు..

వారం రోజులుగా ఉన్న దీపక్ ప్రవర్తన కు మొదటి రాత్రి వరుకు ఉన్న ప్రవర్తన కు గల తేడా వల్ల సంధ్య కి చాలా కోపం వస్తుంది.. చెప్పాలి అంటే కోపం కంటే చాలా బాధగా ఉంది సంధ్య కి.. అందుకే ఇంక తప్పక ఆ రోజు ఆ విషయం మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి సిద్దపడింది.

ఇంతలో కాలింగ్ బెల్ మోగడం తో ఎవరా అని అనుకుంటూ తలుపు తీయడానికి వెళ్ళింది సంధ్య..

ఎదురుగా చుస్తే తన అత్త మామలు, అమ్మ నాన్నలు ఉన్నారు.. వాళ్ళందరిని చూసి ఒక్క సరిగా ఆశ్చర్య పోయింది సంధ్య.. పెళ్ళి ఐన వారం రోజులకే వీళ్ళు అందరు ఒకేసారి ఎందుకు వచ్చారో అర్ధం కాలేదు తనకి. కనీసం అమ్మ ఐన వస్తున్నట్టు చెప్పలేదు అనుకుంది... ఇంతలో దీపక్ వచ్చాడు అందరిని ఒక చోట కూర్చోపెట్టి

దీపక్... మీ అందరితో ఒక విషయం మాట్లాడడం అనుకుంటున్న..నేను సంధ్య నుంచి విడిపోదాం అనుకుంటున్న..

సంధ్య కి ఒక్క సరిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది.. అసలు తను ఎం వినిందో కూడా అర్ధం కాలేదు.. అక్కడ అందరికి పరిస్థితి అలానే ఉంది.. తనకి కనీసం ఎందుకు అని అడగడానికి మాటలు కూడా రావట్లేదు.. సంధ్యకి తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి..

ఇంతలో సంధ్య వల్ల అమ్మ గారు.. అదేంటి బాబు పెళ్ళి అయ్యి వారం ఏ అయ్యింది అప్పుడే విడాకులు ఏంటి.. అసలు మీ ఇద్దరి మధ్యలో ఎం జరిగింది.. కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి విడాకులు ఏంటి అండి..

దీపక్...ఎవరు ఏమి మాట్లాడకండి అత్తయ్య గారు.. మీరు చేసిన మోసం చాలు ఇంకా నన్ను మోసం చెయ్యాలి అని చూడకండి మీరు ఎన్ని చెప్పిన నేను వినాలి అనుకోవట్లేదు..

దీపక్ వల్ల అమ్మ గారు... ఎరా నీకు ఏమైనా పిచ్చి కానీ పట్టిందా.. మతి ఉండే మాట్లాడుతున్నావా అసలు పెళ్ళి ఐన వారానికి విడాకులు అంటే ఎం అనాలి నిన్ను

దీపక్...అమ్మ నేను అన్ని ఆలోచించే మాట్లాడుతున్న..

దీపక్ వల్ల అమ్మ గారు.. అమ్మ సంధ్య ఎం అయ్యిందో నువ్వు ఐన చెప్పు..

సంధ్య...ఏడుస్తూ..నాకు ఎం తెలుసు అని చేప్తా అత్తయ్య... వారం రోజులు గా నాతో మాట్లాడం లేదు.. నేను ఎన్నో సార్లు అడిగి చూసా.. కానీ ఎన్ని సార్లు అడిగిన ఆయన నాతో ఎం చెప్పలేదు.. కనీసం మీరు అందరు వస్తున్నట్టు కూడా నాకు తెలియదు.

అందరు గట్టిగ అడగమని చెప్పడం తో..

దీపక్.. అమ్మ వీళ్ళు అందరు కలిసి మనల్ని మోసం చేసారు..తనకి పెళ్ళి కి ముందే ఎవరితోనో సంబంధం ఉంది అందుకే నేను విడిపోదాం అనుకుంటున్న..

సంధ్య.. నేను చెప్పనా మీకు నేను వేరే వారిని ప్రేమించా అని వేరే వారితో సంబంధం ఉంది అని

దీపక్.. నువ్వు చెప్పకుండానే అర్ధం అయ్యింది నాకు.. ఆ మాత్రం తెలుసుకోలేని వాడిని అనుకున్నావా

అందరు.. నీకు ఎలా తెలుసు అది చెప్పు.. దాని బట్టి మేము చూసుకుంటాం..

దీపక్...మీ అందరి ముందు మేము చెప్పలేను

సంధ్య.. గట్టిగ..ఎందుకు చెప్పలేరు.. చెప్పండి మీకు ఎం తెలుసు అని నన్ను అంత మాట అన్నారు..

దీపక్.. సరే.. చెప్తాను.. అందరు వినండి..

తొలి రాత్రి మా కలియకలో ఒక్క రక్తపు చుక్క కూడా పడలేదు..

అది విన్న సంధ్య ఒక్క సరిగా కుప్పకూలిపోయింది... ఎంత పెద్ద అబండం... అది తన నాన్న, మావయ్య గారి ముందు...ఒక్క సారిగా అందరి ముందు తన కొట్టేసినట్టు అయ్యింది..తన భర్త అంత చదువు చదివి నెలకు లక్ష రూపాయలు సంపాదించి ఎం లాభం..ఎం అనుకోవాలి తన భర్త ను అమాయకత్వం అనుకోవాలా.. అజ్ఞానం అనుకోవాలా..

ఎం మాట్లాడకుండా ఆ ఊరిలోనే ఒక పెద్ద హాస్పిటల్ కి లాక్కుని వెళ్ళింది దీపక్ ను... వెనకే వల్ల రెండు కుటుంబాలు వచ్చాయి.. అక్కడ ఉన్న సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది..

సురేష్ ( డాక్టర్ ).. చెప్పండి ఏమిటి మీ ప్రాబ్లెమ్

సంధ్య... మీరు ఎదురుగా ఉన్నారు గా డాక్టర్ అడగండి అతనని..

దీపక్... జరిగిన విషయం చేప్తాడు

సురేష్.... మీకు కొంచెం ఐన బుద్ది ఉందా mr. దీపక్... అంత చదువు చదువుకున్నారు.. మీకు కనీసం ఈ విషయం కూడా తెలియలేదా..

దీపక్... ఎం అయ్యింది డాక్టర్

సురేష్...కన్నె పొర అనేది అమ్మాయిలలో చిట్లిపోవడానికి చాలా కారణలు ఉంటాయి..ఆ కన్నె పొర అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబ్బట్టి అమ్మాయిలు సైకిల్ తొక్కినప్పుడు కానీ , లేదా వాళ్ళు ఆదుకునే సమయం లో కానీ, హై జంప్ చేస్తున్న సమయంలో కానీ aa పొర చిట్లిపోవడం సహజం..కేవలం నలభై శాతం మందికే ఆ సమయం లో రక్త స్రవం అవుతుంది.. ఐన ఇంత టెక్నాలజీ పెరిగిన తరువాత కూడా మీలాంటి చదుకున్న వాళ్ళు అలా ప్రవర్తిస్తే ఎలా??

దీపక్.. నాకు నిజంగా ఈ విషయం తెలియదు డాక్టర్.. నన్ను క్షమించండి..

సురేష్.. నాకు కాదు మీ భార్యకు చెప్పండి

దీపక్ కు సంధ్యతో మాట్లాడడానికి చాలా సిగ్గు గా ఉంది... విషయం ఏమిటో తనకి చెప్పకుండా అంత మూర్ఖమ్ గా ప్రవర్తించినందుకు ఏ మొహం పెట్టుకుని సంధ్య తో మాట్లాడాలో అర్ధం కాలేదు... కనీసం విషయం ఏంటి అనేది తనతో మాట్లాడిన సరిపోయేది.. కానీ ఒకే సారి పెద్దల దగ్గర పెట్టాడు ఇలాంటి విషయం ని.. ఎలా ఐన సంధ్య ని ఒప్పించాలి అనుకున్నాడు....సంధ్య ముందు నుంచుని చేతులు జోడించి క్షమాపణ అడిగాడు...ఒకే ఒక అవకాశం ఇవ్వమని బ్రతిమాలాడు...

కానీ సంధ్య ఒప్పుకోలేదు... తనకి జరిగింది మాములు అవమానం కాదు కదా...

చివరకు రెండు కుటుంబాలు నచ్చచెప్పే సరికి ఒప్పుకుంది...

అలా వల్ల మధ్య అపార్ధాలు తొలిగిపోయి ఒకరికీ ఒకరు సంతోషం గా ఉన్నారు...

                             ×××

కన్నె పొర అనేది కాలం చెల్లిన భావన..అర్ధం లేని భ్రమల నుంచి, అజ్ఞానం నుంచి పెద్దలు యువత బయటకి రావాలి..ఎంతో నమ్మకం తో తన జీవితం లో అడుగుపెట్టిన నవ వధువు ని మనస్ఫూర్తిగా స్వీకరించి వల్ల బంధం మొదలు పెడితే ఆ బంధం బలపడి సంతోషం గా ఉంటారు..



Rate this content
Log in

Similar telugu story from Classics