Venkata Rama Seshu Nandagiri

Classics

4  

Venkata Rama Seshu Nandagiri

Classics

శ్రీ గురవే నమః

శ్రీ గురవే నమః

2 mins
320


గురః బ్రహ్మ గురు ర్విష్ణుః

గురుః దేవో మహేశ్వరః

గురు స్సాక్షాత్ పర బ్రహ్మ

తస్మై శ్రీ గురవే నమః.

గురువు గారికి మన సంస్కృతి లో దైవం తో సమానం గా, ఒకింత ఎక్కువ గా నే ఉన్నత స్థానాన్ని కల్పించారు. అందుకే గురువు లో నే బ్రహ్మ, విష్ణు మహేశ్వరు లను దర్శిస్తూ గురువు గారి కి ప్రణామాలు అర్పిస్తున్నారు.

గురు అనే పదాని కి గొప్ప, శ్రేష్ట మైన మరియు మంచి అనే పర్యాయ పదాలు ఉన్నాయి. తల్లి జన్మనిస్తే, తండ్రి పెంచి పోషిస్తారు. గురువు లు విద్యా బుద్ధులు నేర్పి ప్రయోజకులు గా తీర్చి దిద్దుతారు. కనుకనే గురు స్థానాని కి అంతటి ప్రాముఖ్యత.

మనం మన కి తెలియని విషయాన్ని ఎవరి దగ్గర నేర్చు కుంటే వారే మన గురువు లు. అందుకే మన మొదటి బడి ఇల్లు, గురువు లు తల్లి దండ్రులు.

కబీర్ గురువు యొక్క విశిష్టత ను ఈ విధంగా తెలియ చెప్పారు:

ఒక సారి తను గురువు, దైవం ఇద్దరి ఎదుట నిలచి ఎవరి కి ముందు గా నమస్క రించాలి అనే మీమాంస లో ఉండగా, తనకు గురువు గారి కి ముందు గా ప్రణమిల్లా లని స్ఫురించిందట. ఎందు కనగా ఆ దైవాన్ని చేరే మార్గాన్ని, అటువంటి జ్ఞానాన్ని అందించేది కూడా గురువు గారే. ఆయనే లేకుంటే తాను అజ్ఞాని గానే ఉండి పోయే వాడు. కనుక దైవం కన్నా గురు స్థానాని కే ప్రాముఖ్యత అని తెలిపారు

గురువుల ను పూజించ డానికి, స్మరించ డానికి ఒక ప్రత్యేక మైన రోజే కానక్కర లేదు. వారిని మనం తల్లి దండ్రుల తో పాటు, దైవాన్ని స్మరించి నట్లు నిత్యం మన మనో మందిరము న స్మరించ వచ్చు.

ప్రతి వారికి చదువు మొదలు పెట్టిన నాటి నుండి పూర్తి అయ్యే వరకు ఎంతొ మంది గురు స్థానం లో తారస పడుతుంటారు. అయితే అందరి కీ, తమ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి, లేదా తాను ప్రేరణ పొందిన లేదా తనకు నచ్చిన లేదా తనను మెచ్చిన వ్యక్తులు తారస పడవచ్చు. వారే తమ నిజమైన గురువు. చదువు నేర్పిన వారే కాక ఇటు వంటి వారిని కూడా గురు తుల్యులు గా భావించ వచ్చు.

ఉదాహరణకు ఉదయాన్నే ఉదయించే సూర్య భగవానుడు క్రమం తప్పకుండా తమ పని తాము చేయాలన్న సందేశాన్ని ఇస్తారు. చెట్లు, నదులు వంటివి పరోపకార మే జీవిత పరమార్థం అని తెలియ చెపుతాయి. ఈ విధంగా ప్రకృతి కూడా మనకు గురువు తో సమానమే.మన జీవితంలో మనం ఎందరి వద్ద నుండో, ఎన్నో నేర్చుకుంటాం. వారందరి నీ కూడా మనసారా స్మరించి నమ‌స్కరించడ మే మనం వారికి చేయగల సత్కారం.

శ్రీ గురవే నమః


Rate this content
Log in

Similar telugu story from Classics