kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

మనసు చేసిన న్యాయం (ధారావాహిక -

మనసు చేసిన న్యాయం (ధారావాహిక -

3 mins
9


మనసు చేసిన న్యాయం (ధారావాహిక - 01భాగం)

సికింద్రాబాద్ స్టేషన్ వస్తోంది అన్న ప్రకటన వినగానే ఉలిక్కిపడి లేచాను. చక చకా నా వస్తువులు తీసుకుని సిద్ధం అయ్యాను. 

దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈవేళ మళ్ళీ నగరంలో అడుగు పెట్టబోతున్నాను అన్న ఆనందంతో మనసు ఉద్వేగంగా ఉంది. 

అంకుల్ ఎలా ఉన్నారో? ఆంటీ ఎలా ఉన్నారో? పిల్లలు సుజాత, సౌజన్య, భగత్ ఎలావున్నారో? పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. ఏమో చూడాలి. ముందు అసలు అంకుల్ నన్ను చూసి ఏమంటాడో చూడాలి? అనుకుంటూనే ఆగిన రైలు దిగి స్టేషన్ బయటకు నడిచాను. 

స్టేషన్ బయట లోపల...అభివృద్ధి చెందిన వాతావరణంతో అంతా బాగా మారిపోయింది.

నేను వెళ్ళాల్సింది సంజీవరెడ్డి నగర్...సుందర్ నగర్ కాలనీ... ఏ నెంబర్ బస్సు ఎక్కాలో అడిగి తెలుసుకుని టికెట్ తీసుకున్నాను.అక్కడ నుంచి ఆటోలో అంకుల్ అపార్ట్మెంట్ వద్దకు ఆటో కట్టించుకున్నాను.

అంకుల్ అపార్టుమెంట్ ముందు ఆటో దిగి

కాలింగ్ బెల్ నొక్కాను.

రెండు నిముషాల తర్వాత తలుపు తెరుచుకుంది.

"ఎవరు కావాలి?" అడిగిన ఆమె నన్ను పరిశీలనగా చూసి-

"వైభవ్... నువ్వేనా అసలు గుర్తు పట్టలేకపోయాను సుమా. బాగా లావు అయ్యావు లోపలి రా "అంది.

నేను లోపలి నడిచి లగేజ్ హాల్లో పక్కగా పెట్టి ఆమె పాదాలకు భక్తిగా నమస్కారం పెట్టి లేచి నిలబడ్డాను. అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగి నా బుగ్గలమీదనుంచి జలజలా రాలిపోయాయి. అది చూసిన ఆమె

" ఏమైంది వైభవ్? నాన్నగారు, అమ్మ అంతా బాగున్నారా?"అడిగింది ఆదుర్దాగా

" అంతా బాగున్నారు ఆంటీ. అమ్మ తర్వాత నా పొట్ట చూసి అన్నం పెట్టిన ఏకైక స్త్రీమూర్తి మీరే ఆంటీ" అన్నాను కళ్ళు తుడుచుకుని కంఠం వణుకుతుండగా.

"నీలో ఇంకా ఆనాటి అమాయకత్వం పోనే లేదయ్యా.కూర్చో. లక్ష్మీ ...వాటర్ తీసుకురా...''అని కిచెన్ కేసి చూసి చెప్పింది ఆంటీ.

''ఆంటీ..సుజాత, సౌజన్య , భగత్ ఎలా ఉన్నారు?''

''అబ్బో. వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నాయి నీకు?సుజాత ఇంజనీరింగ్ ఫైనలియర్. సౌజన్య మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతోంది . భగత్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంతా కాలేజీలకి వెళ్ళారు. అంకుల్ ఆఫీస్ కి వెళ్ళారు. దాదాపుగా అందరూ ఒక గంటలో వస్తారు.

''ఇంతలో లక్ష్మి మంచినీళ్ళు తీసుకువచ్చి నాకు వినయంగా అందించింది. 

''ఈ బాబు నేను భగత్ ని కడుపుతో ఉన్నప్పుడు మా ఇంట్లో మూడు నెలలు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు, అయ్యగారి అన్నయ్యగారు చిన్ననాటి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసి ఆంధ్రాలో కొంతకాలం పనిచేసారు. ఆనాటి స్నేహం ''నా గురించి లక్ష్మికి చెప్పింది శాంభవి ఆంటీ. 

''ఆరోజుల్లో అయ్యగారి స్నేహితుని కొడకా ఈ బాబు?...ఆరోజుల్లో స్నేహమంటే అంత మంచిగ ఉండేవారన్నమాట.''అనేసి లోపలి వెళ్ళిపోయింది లక్ష్మి.

నేను టీ తీసుకున్నాను. తరువాత ఎన్నెన్నో విషయాలు ఆంటీ అడిగారు. నేను ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నాను. ఎంత సమయం మాట్లాడుకున్నామో తెలీనే లేదు. 

అంతలో ఒక నవయవ్వనవతి లోపలికి వచ్చింది. నన్ను చూడటంలో కన్నా తన తల్లి ఎవరితో మాట్లాడుతోందో అన్న ఉత్సాహంతోనే ఆమె చూపులు చురుగ్గా ఉన్నాయి. 

''గుడ్ ఈవెనింగ్ మమ్మీ.''

''గుడ్ ఈవెనింగ్. ఈ అబ్బాయి ఎవరో తెలుసా నీకు?''

అపుడు చూసింది నన్ను ఆ అమ్మాయి. అదీ ఒక్క క్షణం మాత్రమే.. ఎవరు? అన్నట్టు భ్రుకుటి ముడిచి ఎగరేసి.

" నాకైతే గుర్తులేదు మమ్మీ. నువ్వే చెప్పు."అంది ఆ అమ్మాయి జుట్టు ముడిపెట్టుకుంటూ.

" రాజమండ్రిలో బాబాకి ఒక స్నేహితులు ఉన్నారని చెప్పానే. ఆ అంకుల్ వాళ్ళ అబ్బాయి. నీ చిన్నప్పుడు మూడు నెలల పాటు మన ఇంట్లో ఉన్నాడు. ప్రతి రోజు నిన్ను కాన్వెంట్ కి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడు. నీ చేత దగ్గరుండి హోంవర్క్ చేయించేవాడు. నీకు మ్యాథ్స్ బాగా చెప్పేవాడు.

" అంటే ఇతను వైభవ్ అన్నయ్యా?"

" అబ్బో నీ అతని పేరు కూడా గుర్తుందే?"అంది ఆంటీ మెచ్చుకోలుగా.

"అంత సీన్లేదు మమ్మీ. బాబా ఆ అంకుల్ తో మాట్లాడినప్పుడు వైభవ్ ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అని అడగడం రెండు మూడు సార్లు విన్నాను. అందుకని గుర్తొచ్చింది. సరే నేను ఫ్రెషప్ అవుతాను మమ్మీ. లక్ష్మీ..బోర్ణవిటా..."అని అరిచేసి తనగదిలోకి వెళ్ళిపోయింది నన్ను పలకరించకుండానే.

లక్ష్మీ వచ్చి ట్రేలో కాఫీ కప్పు నాకు ఇచ్చి సౌజన్య గదిలోకి వెళ్ళింది.

"ఉంటావా రెండు రోజులు?"అడిగింది ఆంటీ.

"CCRT అని ఒక శిక్షణాకార్యక్రమం తెలుగు లలిత కళాతోరణంలో 15 రోజులపాటు ఉంది ఆంటీ. పాఠశాలతరవున వచ్చాను.ఎన్నో ఏళ్ళు అయింది మిమ్మల్ని, అంకుల్ ని చూసి.ఒకసారి చూసి కనిపించి వెల్దామని వచ్చాను."అన్నాను.

"ఒకే. నువు కాఫీ తాగుతూ ఉండు. ఇపుడే వస్తాను." ఆంటీ సౌజన్య గదిలోకి వెళ్లారు.

"సుజి. అదేంటి. అతన్ని పలకరించకుండా వచ్చేశావ్?అన్నయ్యా! బాగున్నావా అని పలకరించవచ్చుకదా" ఆంటీ అడుగుతోంది.

"అతన్ని చూసాను కదా...ఇక పలకరించేదేముంది?అయినా అన్నయ్యలా ఉన్నాడా అతను?ఇద్దరు పిల్లల అంకుల్ లాగానే ఉన్నాడు.సరే. నేను బాత్ కి వెళ్తున్నా"అంది సౌజన్య.

"హు.నీకు నేను చెప్పలేను."ఆంటీ తిరిగి వచ్చి సోఫాలో నా ఎదురుగా కూర్చుంటూ అడిగారు.

"అన్నట్టు వైభవ్.నీకు పెళ్లయింది కదూ...పిల్లలు ఏం చదువుతున్నారు?

(తరువాత 2 వ భాగంలో)

(సశేషం)



Rate this content
Log in

Similar telugu story from Drama