స్వాతి సూర్యదేవర

Classics Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Classics Inspirational Others

నేటి యువత ఉపాధి అన్వేషణ

నేటి యువత ఉపాధి అన్వేషణ

3 mins
520


దాదాపు ఒక సంవత్సరం క్రితం....

            దసరా కి వచ్చి వెళ్లిన తర్వాత మళ్ళీ ఊరికి రాలేదు.వేసవి కాలం సెలవులకు అని దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఊర్లోకి అడుగుపెడుతున్న.హైదరాబాద్ నుండి వచ్చే బస్ లకి, మా ఊరికి పది కిలోమీటర్లు దూరంలో ఉన్న మండల కేంద్రం స్టాప్ .అక్కడ దిగి ఆటో లో వెళ్ళాలి మా ఊరికి..అలా ఆటో ఎక్కిన నేను టైం చూసే సరికి సాయంత్రం ఐదు గంటలు అవుతుంది.నేను ఊరు ముందుకి వచ్చే పాటికి....

      మా ఊరు ఎం చిన్నది కాదులెండి ,చాలా పెద్దది..చుట్టూ పక్కల లోపల వుండే చిన్న ఊర్లకి మాఊరే అవసరాలకి అనుగుణంగా కాస్త అన్ని దొరికే ఊరు .అలా ఊర్లోకి అడుగు పెట్టి ఆటో కి డబ్బులు ఇచ్చి లగేజ్ తీసుకొని నాన్న కోసం అక్కడే నిలబడి చుట్టూ చూస్తున్నాను..ఊరు చాలా మారిపోయింది.చాలా బిల్డింగ్స్ కట్టారు..షాప్ లకి అద్దెలు ఇచ్చేలాగా...అవన్నీ ఎప్పుడు కట్టారా అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తున్న నా చూపు ఒక మూడు షాపుల దగ్గర రెండేసి నిముషాలు ఆగింది....అక్కడ ఉన్న వాళ్ళని చూసిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది.ఇంతలో నాన్న వస్తే లాగేజ్ అంతా నాన్న కి ఇచ్చి పిల్లలని బైక్ పై ఎక్కించి పంపించాను ..ఇంటికి నడిచి వస్తా అని చెప్పి..అలా ఊరు కూడా చూస్తూ వెళ్లొచ్చు అని నా ఆలోచన.

     అలా నడుస్తూ వెళ్తున్న నాకు అక్కడే మీ సేవ కేంద్రం కనిపించింది.ఇది ఎప్పుడు పెట్టారు పోనీలే బస్ టికెట్స్ రిజర్వేషన్ కోసం అన్ని కిలోమీటర్లు వెళ్లే భాధ తప్పింది అనుకున్న...అలా చూస్తూ మధ్యలో నన్ను గుర్తు పట్టి పలకరించే వాళ్లతో మాట్లాడుతూ అంత పరిశీలిస్తూ ఇంటికి వెళ్ళాను...అక్కడ అందరితో మాట్లాడి మా బాబాయ్ వస్తే ఇద్దరం పెరడు వైపు వెళ్తూ ఇద్దరి ఇంటి విషయాలు చర్చించుకుంటూ...మా బాబాయ్ వాళ్ల పిల్లల చదువులు గురించి కనుకుంటున్న నాకు..బస్ స్టాప్ దగ్గర కనిపించిన షాప్స్ గుర్తొచ్చి అదే విషయం బాబాయ్ ని అడిగాను....

బాబాయ్...ఆ సూపర్ మార్కెట్ ఎవరు పెట్టారు..అచ్చం సిటీ లో లాగా భలే పెట్టారు...

ఓహ్ అదా...మన వెంకన్న పెదనాన్న వాళ్ళ అబ్బాయి రఘు పెట్టాడు....

అవునా అదేంటి బాబాయ్ వాడు జాబ్ కోసం అని బెంగుళూరు వెళ్ళాడు అని చెప్పింది వాళ్ళ అమ్మ పోయిన సారి వచ్చినప్పుడు..

హ వెళ్ళాడు..అక్కడ వాడి చదువుకు తక్కువ జీతం ఇస్తా అన్నారంట..అలాగే నాలుగు నెలలు అక్కడే వున్నాడు గా ఖర్చులు అవి బాగా తెలిశాయి వాడికి కూడా, ఏమనుకున్నాడో ఏమో మరి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ని ఒప్పించి పొలం తాకట్టు పెట్టి 5 లక్షలు తెచ్చి ఆ షాప్( సూపర్ మార్కెట్) పెట్టాడు.కానీ మంచి ఆలోచనేలే వాడిది బాగానే మిగులుతున్నాయ్ అంట..ఇంకో ఆర్నెళ్లలో వాడి షాప్ కోసం చేసిన అప్పు తీరిపోతుంది అంట..ఎంతన్న మన ఊరు చుట్టూ పక్క ఊర్లకు కేంద్రం గా ఉంటుంది కదా ..మంచి ఆలోచనే చేసాడు పిలగాడు..నెలకి పాతిక వేలు దాకా మిగులుతున్నాయ్ అని వాళ్ళ నాన్న అన్నాడు...ఎక్కడో.. ఎవరి కిందో చేసినా అదే జీతం వచ్చేది ..ఇక్కడైతే ఇల్లు,పొలం,పశువులు అంతా రాబడే కానీ పోయేది ఏమి లేదుగా...బానే బాగుపడ్డారు .

బాబాయ్ తో పాటు వరిగడ్డి కట్టలు గుంజుతూ...నిజమా బాబాయ్ ...పోనీలే వాళ్ళ నాన్న ఎంత కష్టపడ్డాడు వాణ్ణి చదివించడానికి ,ఇప్పుడు దగ్గర ఉండి మరి వాళ్ళని చూస్కోవచ్చు. పట్నం లో అయిన మాకు యాభై వేలు వచ్చిన మిగిలేది అవే బాబాయ్..ఇంకా ఇక్కడ కూడా అంతే అన్నప్పుడు సొంత ఊర్లో ఉంటే అదే చాలా మంచిది కదా..

హ.అదే కాదు అమ్మాయి వీణ్ణి చూసి ఇంకా చాలా మంది పిలగాళ్ళు ఇక్కడే ఏదో ఒకటి చూసుకుంటున్నారు..నువ్వు చూళ్ళేదు ఏమో సెల్ఫోన్ పాయింట్,ఫోటో స్టూడియో,మీ సేవ ,నెట్ సెంటర్ చాలా పెట్టారు పిలగాళ్ళు ఇప్పుడు అన్ని ఊర్లోనే దొరుకుతున్నాయి...టౌను కి వెళ్లే పనే లేదు అసలు..ఇంకా కొంత మంది తక్కువ చదివినోళ్లు పాల డెయిరీ లు పెట్టుకొని అటు వ్యవసాయం,ఇటు వీళ్ళ పని అన్ని చేసుకుంటూ ఇంటి పట్టున ఉంటూ బానే సంపాదిస్తున్నారు..అంతే కాదు ఆ పాషా వాళ్ళ అబ్బాయి అయితే ఇంకో కొత్త మార్గం కూడా కనుక్కున్నాడు వ్యాపారం కోసం..

అవునా...ఏంటి బాబాయ్ అది...

అదే అమ్మాయి అదేదో పేసుబుక్ అని ఉంటది అంట కదా..

హ.....

అందులో మన ఊరొళ్లు,చుట్టూ పక్కల ఊర్లోళ్ళు తెలిసినోళ్లందరిని అందులో ఏదో గ్రూప్ లాగా చేసి ఎక్కడెక్కడో ఉన్నోళ్ళందరిని పట్టుకొని తినటానికి బియ్యం కొనుక్కునే వాళ్లందరికీ ఈడే సప్లై చేస్తన్నడంట.సిటీలలో కొనుక్కునే బియ్యం అంత బాగోటల్లేదని , చాలా మంది వీడి దగ్గరే బియ్యం ట్రాన్స్పోర్ట్ ల ద్వారా ఏయించుకుంటన్నారు అంట..మొత్తనికి భలే వ్యాపారం పట్టేసాడే వాడు..బలే సాగుతుంది అంట.

పోనీలే బాబాయ్ పిల్లలు ఉద్యోగాలు అనుకుంటూ చిన్న చదువులకు పెద్ద జీతాలు లేక ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఉన్న జ్ఞానాన్ని ఇలా ఉపయోగించుకుంటున్నారు...అటు అమ్మనాన్నలకి తోడు ఉంటూ,ఇటు వ్యవసాయం లో తోడు ఉంటూనే వాళ్ళ వాళ్ళ సంపాదన మార్గాలు చూసుకుంటున్నారు..ఇది ఒకందుకు మంచిదే బాబాయ్ ఎక్కడో ఎవరి కిందో పడి గొడ్డు చాకిరి చేసే బదులు ఇలా సొంత కష్టం పడి నాలుగు రాళ్లు వెనకేసుకురావడం చాలా మంచి విషయం...

హ.తమ్ముడు కూడా చదువు అయ్యాక వాడికి వచ్చే మార్కులుని బట్టి అలోచిస్తా అంటున్నాడు ....చూద్దాం ఎక్కడైన మిగిలేది ఆ నాలుగు రూపాయిలే అన్నప్పుడు నమోషీ కి పోకుండా ఊర్లోనే ఉండి ఇలా ఇదొకటి చేసుకొని మాకు అండగా ఉండడం మంచి విషయమే కదా....

హుమ్..అవును బాబాయ్..పెద్ద ఉద్యోగస్తులు రాలేకపోయినా, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తు చాలి,చాలని జీతాలు అందే వాళ్ళకి కాస్త పెట్టుబడి బరువు అయిన ధైర్యం చేసి ఇలా చేయడమే ఉత్తమం ..

హ...అవును..సరే పదా ఇంట్లోకి పోదాం చాలా చీకటి పడింది..

హ.సరే అంటూ ఇంట్లోకి వెళ్లి మరోమారు అమ్మతో ఈ విషయాలు అన్ని మాట్లాడి తిని నిద్రకు ఉపక్రమించాను...

        మళ్ళీ లక్డౌన్ సమయంలో వూరిలో వాళ్ళ వ్యాపారాల గురించి ఒకేసారి మా బాబాయ్ ని అడిగా...అప్పుడు తను చెప్పిన మాటకి నాకు భలే సంతోషమేసింది..లక్డౌన్ లో కూడా ఆగకుండా ఇంటి దగ్గర వుండే వాళ్ళ వ్యాపారాలని బాగా చూసుకున్నారు అంట అంతా....

     


  



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar telugu story from Classics