kottapalli udayababu

Drama Romance Action

4.4  

kottapalli udayababu

Drama Romance Action

టెట్ ఫర్ టిట్ (సరసమైనకథ)

టెట్ ఫర్ టిట్ (సరసమైనకథ)

6 mins
23


"Tat ఫర్ Tit"(సరసమైనకథ)

నూతనంగా ఏర్పడిన ఆ 'కాలనీ'కి చిత్త చివరగా రోడ్డుకు ఏభై మీటర్ల దూరంలో భయానకంగా ఒంటరిగా నిలబడి ఉంది ఆ భవనం. వీధి చివర ఉన్న వీధి దీపాన్ని కావాలని ఎవరో బ్రద్దలు కొట్టినట్టుగా సగం ముక్కల దేహంతో మిగిలి ఉంది. .

కృష్ణపక్షపు రోజులు. .

రాత్రి ఎనిమిదిగంటల సమయం. నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో ప్రవేశించిన ఓ ఆకారం నెమ్మదిగా నడుస్తూ అటూ ఇటూ పరికించి రోడ్డు దాటి నెమ్మదిగా ఆ భవనం వెనక్కు చేరింది. చుట్టూ ప్రహారీ కూలిపోయిన ఆ భవనం డాబామెట్లు వెనకనుండి ఎక్కి ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్టుగా నిలబడింది - ' ఏమిటబ్బా ఇంకా రాలేదూ..' అని అసహనంగా అనుకుంటూ. .

నూతనంగా నిర్మిస్తూ డబ్బు చాలక పూర్తిచేయలేకపోయీ మానేశారో, ఎవరైనా ఆ ఇంట్లో చనిపోవడం వల్ల ఆ ఇల్లు పాడు పెట్టారో, లేదా కాలనీకి చిట్టచివర ఉండటం వల్ల దానిని ఎవరూ కొని ఉండకపోవడం వల్లనో తెలియదుగాని సుమారు అయిదారు నెలలనుంచి తాళాలు తీయనట్టుగా, మనిషి సంచారం లేనట్టుగా సన్నటి దుమ్ము గోడలనిండా పేరుకుపోయి తవ్వుతున్న నూతిలోంచి లేచి నిలబడిన మనిషిలా ఉంది ఆ భవనం.

అంతలో అదే వీధిలోకి ప్రవేశించిన మరో ఆకారం నెమ్మదిగా ముందు ఆకారం మాదిరిగానే అటూ ఇటూ పరికించి అదే మార్గాన్ని అనుసరించింది. .

నెమ్మదిగా వయ్యారంగా వచ్చిన రెండవ ఆకారాన్ని సుడిగాలిలా చుట్టేసింది మొదటి ఆకారం. .

చల్లని వాతావరణం వెచ్చని వారి శరీరాల మధ్య ఏం జరుగుతోందో ఆ చీకట్లో కనిపించక కంగారు పడుతోంది. .

''అబ్బా..మరీ అంతా తొందరైతే ఎలా డాళింగ్ ? అరె...ఆగు..... ఆగమంటుంటే... ''  ఒక్క మాటకూడా తనని పైకి అననీయకుండా తనను వివశురాలిని చేస్తున్న అతని చర్యలకు అడ్డుకట్ట వేస్తూ అంది ఆమె.

‘’చాల్లే సంబరం. లేటుగా వచ్చింది చాలక ఇంకా ఎంతసేపు ఆగమంటావ్?’’ అతను ఆమెను వదలకుండా ‘మత్తు’గా అంటూనే ఆమెలో ‘అలజడి’ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

‘’ ఎవరికైనా కనిపిస్తాం .ఉండు.అరె. ఉండమంటుంటే..’ ఆమె మరీ గారాలు పోతూ అతనిని తననుంచి బలవంతంగా విడదీసింది.

తాను కట్టుకున్న నల్లని ఓణీ తీసి రెండు మడతలుగా చేసి నేలమీద పరిచింది.

‘’ఇపుడు నీ ఇష్టం’’

‘మదన మరీచికలా ఆమె ఆహ్వానిస్తుంటే అంత ప్రశాంత వాతావరణం లోనూ చంద్రునిచే సంపూర్ణంగా కప్పబడినా, వెలిగిపోత్తున్న సూర్యుడిలా అయిపోయాడతను.

పదినిముషాల వారి సమాగమంలో యే అణు విస్పోటనం లోనూ వెలువడని వింతైన వెచ్చదనంలో వారి శరీరాలు కాగిపోతుంటే ‘అలసట’వలన ఏర్పడిన ‘స్వేద’బిందువులు చల్లని గాలితో ఎపుడు లేచిపోదామా అన్నట్టుగా సమాయత్తమవడానికి రెడీగా ఉన్నాయి.

ఆమె అతని స్వేదాన్ని తన చేత్తో తుడుస్తూ అంది.

‘’ఇపుడు చెప్పు. ఏమిటి నువు ఇందాకా అన్నావూ? లేటుగా వచ్చానా? అసలు ఈ టైమ్లో ఒక పెళ్లి కాని ఆడపిల్ల ఒంటరిగా ఇంత ధైర్యంతో ఇక్కడికి రాగలిగిందంటేనే నీ ప్రేమ నాలో ఎంతటి ధైర్యాన్ని నింపిందో నీకు ఈపాటికే అర్ధం అయి ఉండాలి ప్రకాష్...అయినా ఇలా ఎంతకాలం? ఎక్కడ బయటపడిపోతామో అని భయం వేస్తోంది.ఏరోజు కారోజు ఇదే మన చివరి కలయిక అన్నట్టుగా అనిపిస్తోంది."ఆమె కంఠం గాద్గదికంగా మారడం తో నగ్నంగా ఉన్న తన ఛాతీ మీద ఉన్న ఆమె తల నిమురుతూ అన్నాడతను.

‘’అలాంటి మాటలు అని నన్ను భయపెట్టొద్దు రోజా..నేను నిన్ను అర్ధం చేసుకోగలను.నాకోసం ఎంత రిస్క్ తీసుకుని ఈవేళప్పుడు ఇక్కడికి వస్తున్నావో నాకు తెలుసు. కానీ ఎందుకో నువు రావడం క్షణం ఆలస్యమైతే నాకు గుండె పగిలిపోయేటంత ఆరాటం. పిచ్చెక్కిపోయేంత ఆవేశం. నువు కనిపించాకా నా అనురాగవర్షంతో నిన్ను నిలువునా ముంచెత్తెయ్యాలనే ఆతృత. అనుక్షణం నీ ఒడిని వాలాలనుకునే తపన, ఈ జన్మకి నిన్ను పొందగలనా..అనే అనుమానం. ఇన్ని రకాల భావాలతో నేను సతమతమైపోతూ ఉంటాను. నిన్ను పోగొట్టుకోవడం అన్నది నేను భరించలేను డాలింగ్.’’

దానిని ఆమె బదులిచ్చింది.

అతని విశాలమైన నుదురు, కొటేరు ముక్కు, పాలరాయిలా నున్నగా మెరుస్తున్న నీలం రంగు చెక్కిళ్లు, మాలిన్యం లేని తెల్లని కళ్ళు అన్నింటిని ‘ప్రేమతమకం’తో చుంబించింది ఆమె.

వారి అన్యోన్యతను పరికించి తమ భార్యలకు కూడా అలాంటి అనుభవం అందజేయ్యాలి అనుకున్నట్టుగా వారినే పరిశీలిస్తోందా అనిపించేలా ‘సప్తర్షిమండలం’ వినీల ఆకాశంలో సరిగ్గా వారి జంటపై మరింత కాంతితో మెరుస్తోంది.సమయం వృద్ధాకానివ్వకుండా రెండవరాత్రి కూడా పూర్తవడంతో ఆమె లేచి వాచీ చూసుకుంది. అందులో రేడియం ముల్లు ఆ చీకటిలో ప్రకాశిస్తూ పదినిముషాలు తక్కువ తొమ్మిదిని సూచిస్తున్నాయి.

ఆమె అనునయంగా మంద్రంగా అంది.

‘’ప్రకాష్.మనం ఎంత తొందరగా వివాహం చేసుకుంటే అంత మంచిది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నీకేం బాబు...నువు మగాడివి... నేను..నేను ఎంకావాలి? మావాళ్లు నాకు సంబంధాలు కూడా చూస్తున్నారని మొన్నోసారి నిన్ను హెచ్చరించాను.

రోజూ రూంలో వంటచేసుకు తినడానికి నీకు బోర్ కొట్టడం లేదూ? నా చేత్తో నీకు వండి పెట్టి నువు మనస్ఫూర్తిగా తింటుంటే నీ కళ్ళల్లోకి చూస్తూ కాలం గడిపేయాలని నా కోరిక. రూమ్కి నేనే వస్తానంటే ఎవరో ఒకరు ఎపుడూ ఉంటూనే ఉంటారు అంటావ్.రేపు వివాహం అయినా ఇంతటి అద్భుతమైన ‘అనుభవం ‘ మనం చవి చూడగలమో లేదో..

మనం ఒకరినొకరు స్పర్శించుకోని క్రితం ఏమన్నానో గుర్తుందా? ‘ఒకరినొకరు ముట్టుకోకుండా ఎదురెదురుగా ఉంటూ ఎంతకాలం ఉండగలమో అది నిజమైన ప్రేమ’ అని. కానీ నామీద నీకెంత ప్రేమ ఉందో నీ చేతలే చెబుతున్నాయి. చూశావా..ఆదర్శాలు చెప్పడానికి బాగుంటాయి. అవే ‘అనుభవాలై ’తే ఆ అనుభవాల్లో ఆదర్శాలు దూదిపింజలైపోతాయి. అందుకే నీకు ఇప్పటివరకు ఎన్ని రాత్రుల ‘అనుభవం’ అందించానో అన్నివేలు నాకు నువు ఎదురు కట్నంగా ఇచ్చేయాలి సుమా. అన్నట్టు మొన్నఅడగలేక అడగలేక ‘వెయ్యి’ కావాలన్నాను. ‘డబ్బు’ అందలేదు అన్నావ్.

నీది హాయిగా ప్రభుత్వ ఉద్యోగం కూడాను. ఇంచుమించు నెలరోజులుగా మనం రోజూ కలుసుకుంటూనే ఉన్నాం.రేపు నా పుట్టినరోజు. రేపైనా నేను అడిగిన ‘సాయం’ చేసి పెళ్లిని గురించిన నీ నిర్ణయం చెప్తావని ఆశిస్తున్నాను.ఒకే ప్రకాష్. ఇంకా ఆలస్యమైతే నాకు ఇంట్లో ఫుల్ గా ఉంటాయి.ప్లీజ్.’’

ఆమె నెమ్మదిగా ఓణీ తీసుకుని మోకాళ్లమీద కూర్చునే కట్టుకుంది.అతను పక్కకు జరిగి చేయి తలకింద పెట్టుకున్నాడు.

‘’మరి నే వెళ్ళిరానా? ఊ?’’

వూహించనంత గాఢంగా ఆమె మెడవంపులో చుంబించాడతను.

‘’జాగ్రత్త.మళ్ళీ రేపు ఇదే సమయం. రేపు తప్పనిసరిగా ఒక నిర్ణయానికి వచ్చి, దానితో నీకు ఆనందం కలిగించే పూచీ నాడీ.సరేనా..ఉండు.ఒక్క క్షణమ.’’ అతను ఒక్కసారి పిట్టగోడకు ముక్కును ఆనించి బయటకు చూసి ‘సంతృప్తి’గా తల పంకించాడు.

‘’క్షేమంగా వెళ్ళిరా..జాగ్రత్త. బాగా చీకటిగా ఉంది.’’

ఆమె ఏమీ ఏరుగని అమాయకపు ‘పూబాల’లా పమిట భుజం చుట్టూ కప్పుకుని మెట్లు పూర్తిగా దిగి కనుమరుగయ్యెంతవరకు ఉంది దీర్ఘాలోచనలో పడ్డాడు.

నిజమే...ఇలా ఎన్నాళ్లు? ఈ సమస్యకు రేపేలాగైనా ఒక పరిష్కారమార్గం ఆలోచించాలి.

అతను పరిష్కారమార్గం ఆలోచించడమే కాదు. ఖచ్చితమైన ఇక నిర్ణయానికి వచ్చాడు కూడా.

**************

మరుసటి రోజు అదే సమయం.

అదే జంట అదే డాబాపై అదేవిధంగా కలుసుకున్నారు. అలసట నుండి సేద తీరిన అతడు అడిగాడు ఆతృతగా.

‘’నిన్నంత హుషారుగా లేవు ఈవేళ. ఏమైంది రోజా? మనగురించి ఎవరికైనా అనుమానం వచ్చిందా..లేక నీ ఆరోగ్యం బాగాలేదా?’’

‘’అబ్బే..అలాంటిదేమీ లేదు ప్రకాష్.నాన్నగారు ఏదో పని చెబితేను అర్జంటుగా ఉదయం ‘పాస్ట్ పాసింజర్’కి రాజమండ్రి వెళ్ళాను.పని అవడం కోసం ఆ అడ్రెస్సులూ అవీ వెతుక్కుని తిరిగి తిరిగి బాగా అలసటగా ఉంది.సాయంత్రం అయిదుగంటల పాసింజర్ కి బయల్దేరాను.ఇక్కడికి వచ్చేసరికి ఏడుగంటలు దాటిపోయింది.నువ్వు ఎదురుచూస్తూ ఉంటావని ఇంటికివేళ్ళకుండా తిన్నగా ఇటు వచ్చేశాను అంతే..’’

‘’పోనీలే..పని అయిందా?’’

‘’ఆ నాన్నగారికి ఆయన స్నేహితుడు ఎవరో డబ్బు ఇవ్వాలట అడిగి తీసుకురమ్మన్నారు.నేనే ఇంకో రెండు వందలు సర్దితే మొత్తం మళ్ళీ నెలలో ఇచ్చేస్తాడట.రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు.’’

‘’అంత ఇబ్బందిగా ఉందా?’’

‘’అందుకే కదా నిన్ను సిగ్గు విడిచి అడిగాను డబ్బుగురించి, పెళ్లి గురించి.’’

‘’ఇదుగో నువ్వు అడిగిన వెయ్యిరూపాయలు.’’ అతడు సరిగ్గా జేబులో చెయ్యి పెట్టాడు డబ్బు తీయడానికి.

వారిద్దరు వూహించనంత వేగం గా వారి ముందు రెండు ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి.ఆమె కొయ్యబారిపోయింది.

అతను హతాశుడయ్యాడు.ఎంచెయ్యాలో తోచలేదు.అతను నెమ్మదిగా లేచి నిలబడ్డాడు.ఆమె నెమ్మదిగా అతనివెనుక చేరింది – కలలో కూడా వూహించని ఈ హఠాత్పరిమాణానికి దడదడలాడిపోతూ భయంగా.

వచ్చిన వాళ్ళలో ఒకడు ఒక అడుగు ముందుకు వేసి ప్రకాష్ ని పట్టుకోబోయాడు. మెరుపులా అతన్ని బలంగా వెనక్కి తోసి వారు వూహించనంత వేగం గా అలవాటుపడిన ఆచీకటిలో తారాజువ్వాలా దూసుకుపోయి రెప్పపాటు కాలంలో మాయమయాడు.

ఈ షాక్ తో ఆమె మరింత బిత్తరపోయింది.

‘’ఎంతపని చేశావ్ ప్రకాష్.ప్రేమికుడిగా నాకు రక్షణ ఇవ్వలేని నిన్నా నేను ప్రేమించింది?’’ఆమె అంతరంగంలో ఆలోచనా కెరటాలు ఇద్దరూ ఒంటరిగా ఉన్న ఆమెను చుట్టుముట్టడంతో ఆగిపోయాయి.

‘’మీకు...మీకు ఎంకావాలి?’’బలవంతంగా మాట పెకలించుకుంటూ అడిగింది.

‘’నువ్వేనే...ఎంతకాలం నుంచి జరుగుతొందే ఇలా...? మాకూ ఒక అవకాశం ఇవ్వు. లేదా నీ ప్రాణం తీస్తామ్.’’

ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి.

ఆమెకు అర్ధం అయింది. ఇలాంటి సమయంలో లౌక్యమే స్త్రీకి ఆయుధం. అరిస్తే ప్రాణాలకే ప్రమాదం.

ఆమె అనుమతి కోసం చూడకుండా ఒకడు ఆమెను వెనుకనుంచి , మరొకడు ముందునుంచి వాటేసుకున్నారు.

‘’ ఒక్కక్షణం ప్లీజ్. ఆగండి. అతను ఇపుడేగా వెళ్ళాడు. ఒక్కసారి బాత్రూమ్ కి వెళ్ళి వస్తాను.’’ ఆమె బిక్కమొగంతో జాలిగా అడిగింది.

‘’నిజంగా వస్తావా?’’ఊరూముతున్నట్టు అడిగాడతను.

‘’మీమీద ఒట్టు..రెండు నిముషాల్లో వచ్చేస్తాను. ఇబ్బందిగా ఉంది.’’

‘’ఏరా వెళ్లనిద్దామా? ‘’ఒకడు రెండవవాడిని అడిగాడు.

‘’పాపం వెళ్ళనీయరా..’’

‘’నీ బొంద...ఒకవేళ పారిపోతే..?’’

‘’ నీమొహం. ఈవేళ కాకపోతే రేపయినా ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే ఇంకెక్కడైనా దొరక్కపోతుందా? ఈ పతివ్రత వేషాలు మనదగ్గర కాదు. దీని చరిత్ర తెలియనీది ఎవరికి?’’

‘’సరే అయితే...రెండు నిముషాల్లో రావాలి.’’అన్నాడతను ఆమెను విడిచిపెడుతూ.

‘’నేను నీవేనకే వస్తాను. ‘’అన్నాడు రెండవవాడు ఆమె వెంట వెళ్లడానికి ఉద్యుక్తుడవుతూ.

‘’తప్పురా.. రెండు నిముషాల్లో వస్తానని చెబుతోందిగా..’’ మొదటివాడు వారించాడు.

ఆమె మెట్లు దిగెంతవరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంది. మరుక్షణం వీరజవానుడి తుపాకీనుంచి వెలువడిన తూటాలా ఆచీకట్లో మాయమైపోయింది.

పది నిముషాలు గడిచాకా గానీ వాళ్ళకు తామెంత ఉత్తమ చవటాయిలమో అర్ధం కాలేదు.

‘’చ. బంగారంలాంటి చాన్సు మిస్ అయింది.’’ బలంగా పిట్టగోడమీద అతను చరిచిన చరుపు ఆ చీకట్లో ప్రతిద్వనించింది.

ఇంకా లాభం లేదనుకుని బయల్దేరబోతున్న ఒకడి కాళ్ళకి తాడులా ఏదో చుట్టుకుంది. కంగారుగా వంగి జాగ్రత్తగా పైకి తీశాడు. నల్లగా ఉంటే అది కట్లపామేమో అనుకుని కెవ్వున అరవబోయి ఆగాడు. లేడీస్ హాండ్ బాగ్ తాడు అది.

వాళ్ళ గుండెలు తేలికపడ్డాయి.

‘’వ్రతం చేద్దా ఫలితం దక్కింది.’’ అనుకుని ఆ పర్సుతో ముందుకు నడిచారు.

*********

‘’వెళ్ళిన పని ఏమైందిరా?’’ రూమ్ లోకి అడుగు పెడుతూనే ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చేతిలోని పర్సు అతనిమీదకు విసిరి డబుల్ కాట్ పై కూలబడ్డారు వారిద్దరూ...

‘’నీపని పండేరా. మాపనే ‘ కాయ’ అయింది.’’

‘’అదేంట్రా?’’

‘’అవును గురు.. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. లేకపోతే నీ ప్రాణాలు తీస్తామ్ ...అనేసరికి బెదిరిపోయి ఒప్పేసుకుంది.ఇదుగో ఈ గాడిదవల్లే మాకు ‘పని’ జరగలేదు.’’

‘’అవునురా పాపం. బాత్ రూమ్ కి వెళ్లొస్తాను - అంది. సరేనన్నాము.’’

‘’అదీ సంగతి.అసలక్కడ బాత్ రూమ్ ఎక్కడుందిరా? అంతా ఓపెన్ ప్లేస్ అయితేనూ..’’

‘’నిజమేరా... మాకు ఆ ఆలోచనే రాలేదు.ఏది ఏమైనా నువు చాలా అదృష్టవంతుడివి రా,,,నీకు అసలు ఆ అమ్మాయి మీద అపనమ్మకం ఎలా కలిగింది?’’

       ‘’నాకు అనుకోకుండా బ్యాంక్ లో పరిచయం అయ్యిందిరా...అన్నీ కలిసి వస్తే నిజంగా పెళ్లి గురించి ఆలోచిద్దామనుకున్నా..ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినా ‘తన’మీద నాకు అసలు అపనమ్మకమే కలగలేదు. నాలుగు రోజుల్ణించి ఓ వెయ్యి సర్దావా....అంటూ ‘పెళ్లి’ గురించి ఒకటే నస. పాపం పిచ్చిది. నాదగ్గర వేద్దామనుకుంది వేషాలు.’’అన్నాడు ప్రకాష్ . గెలిచానన్న గర్వం అతనిలో అణువణువుణా తొణికిసలాడుతోంది.

‘’ ఏది ఏమైనా నీ సెలెక్షన్ అద్భుతంరా...పిటపిటలాడే పిట్టని కానీ ఖర్చు లేకుండా ‘సొంతం’ చేసుకున్నావ్. ‘డబ్బు’ఇవ్వబోతున్నతున్నట్టు నటించి ఆ క్షణం లో మమ్మల్ని అక్కడికి రప్పించి ‘పైసా’ నష్టం రాకుండా ఆమెను వదిలించుకునే అద్భుతమైన ప్లాన్ వేసిన నీదిరా బుర్రంటే. ఇంతకీ నీ ‘ప్లాన్’ అమలు చేసినందుకు మాకేమ్ బహుమతినిస్తావ్?’’

‘’మీరే తెచ్చారుగా..ఈ పర్సులోదంతా మీదే..అయినా ఈ పాటికి దీన్లోదంతా వూడ్చేసి ఉంటారు.’’

‘’నీమీదోట్టూరా...మాకు అన్నీ తెలివితేటలుంటే ‘దాన్నే’ దక్కించుకునేవాళ్లం.’విషయం’నీకు తొందరగా చెప్పాలనే ఆత్రంలో ఎక్కడా ఆగకుండా సరాసరి ఇక్కడకు వచ్చేశామ్.’’

నమ్మాడు ప్రకాష్.మంచం మీద మఠం వేసుకుని కూర్చుని ఆ బాగ్ తెరిచాడు.

ఒక అరలో పడిరూపాయల నోటు , కొంత చిల్లర, చిన్న అద్దం, చిన్న దువ్వెన, లిప్-స్టిక్ ...మరొక అరలో రాజమండ్రిలో ఖరీదైన లాడ్జిల చిరునామాల కార్డులు మూడు ఉన్నాయి.

మధ్యన గల పెద్ద అరాలో ఎర్రని పొడుగాటి కవరు - మీద డాక్టర్ గారి పేరు టైప్ చేసి ఉంది.

వణుకుతున్న చేతులతో దానిని విప్పి చదివిన ప్రకాష్ కి గుండె ఆగినంత పనై, కృష్ణ పక్షపు రోజులలో చంద్రుని రూపం మారినట్టుగా అతని ముఖంలో రంగులు మారి భవిష్యత్తు నిర్వీర్యమై వూగుతూ కనిపించసాగింది.

అది ఆమెకు ‘ఎయిడ్స్ ‘ ను నిర్ధారణ చేసున్న డాక్టర్ రిపోర్ట్.

అంటే...

తనకి కూడా...

‘’చూశావా..నీ ‘టాట్’ కి నా‘టిట్’ ఎలా ఉందో... అంటూ అతని కళ్ల ఎదుట రోజా రూపం వెక్కిరిస్తూ పకపకా నవ్వుతోంది ఈజిప్ట్ ‘ మమ్మీ’లా.

ఆమె ఓడినా తిరుగులేని ‘విజయం’ సాధించింది మగవాడి పురుషాహంకారం మీద!!!

సమాప్తం


 

 



Rate this content
Log in

Similar telugu story from Drama