Midhun babu

Classics Inspirational

4  

Midhun babu

Classics Inspirational

షావుకారి

షావుకారి

2 mins
13



ప్రపంచంలో వున్న కుబేరులలో బిల్ గేట్స్, వారెన్ బఫట్స్, జుకర్ బర్గ్, అంబానీలు వీళ్ళు బిజినెస్ మేన్స్........ వీళ్ళు షావుకార్లు కాదు..... పల్లె ప్రాంతాల్లో ఓ ముప్పై ఇల్ల మధ్య చిన్న కొట్టు పెట్టుకుని రోజుకి వంద రూపాయలు కూలి తెచ్చుకునే పేద ప్రజల మధ్య ఉంటూ ఇంటికి కనీస అవసరాలు తీర్చే అత్యంత బీద వర్తకుడు....... అందరూ అనుకున్నట్టు వీళ్ళు కోటేశ్వరులు కాదు...... ఒకరి దగ్గర పనిచేయని స్వాభిమానం వీరి సొంతం........ గజపతినగరం లో శివాలయం దగ్గర పునికులు అమ్ముతున్న ఒక 85 ఏళ్ల పెద్దాయన చిన్న జల్లెడ మీద వాటిని పెట్టుకుని అమ్ముతున్నాడు నేను ఆయన్ను అడిగాను..... ఈ వయసు లో ఎందుకింత ఏవ అని పరాచకాలాడితే నవ్వి ఊరుకున్నాడు..... అపుడే ఒక కారు వచ్చి ఆగింది వాళ్ళు మొత్తం కొనేసారు... ఎలా వున్నావ్ తాత? అని అడిగారు..... నాకు ఆశ్చర్యం వేసింది...... మీ పెద్ద పాప ఎక్కడుంది..... చిన్నది నీళ్లు పోసుకుందా?..... ఇలా అన్నీ అడుగుతుంటే నేను అడిగాను..... ఎందుకు? అంతలా అడుగుతున్నారని వాళ్ళని అడిగా.... సుమారు ముప్పై దశాబ్దాల పాటు వీరి చేయి తిరిగిన పునికిని తినకుండా ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు.......పని ఉండి ఈ ఊరు వచ్చావా ...ఈ పునికి కి తినవలసిందే... చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు లొట్టలు వేసుకుంటూ తినవలసిందే. పెద్దవాళ్లకు రూపాయి ఇస్తే నాలుగు ఇచ్చేవాడు చిన్న పిల్లలకు పావలా ఇస్తే రెండు ఇచ్చేవాడు అందురూ లొట్టలు వేసుకుని తింటూ ఉంటే తెగ ఆనంద పడిపోయేవాడు.... నలుగురు ఆడపిల్లల్ని ముగ్గురు మగపిల్లల్ని బండెడు సంసారాన్ని ఈ పునికి వ్యాపారం మీదే లాగాడు.... ఇంతవరకు జీవితంలో ఎవర్నీ చెయ్యి జాపి అడుక్కోలేదు..... ఒంట్లో సత్తువ లేకున్నా ఈనాటికి ఆత్మ గౌరవాన్ని దూరం పెట్టుకోలేదు..... అది విన్న నేను తట్టుకోలేక అయన ముందు సిగ్గు తో తల దించుకున్నాను......... ఇప్పటకి పల్లెల్లో అవసరానికి పేద వాడికి సరుకులు అరువు ఇచ్చేది వీళ్ళే....... సమాజం తో మమేకం అవుతూ అందరి కష్ట సుఖాలు వారివిగా భావిస్తారు.... వీరి పేరు తెలీని వారు ఎవ్వరూ వుండరు...... పెట్టుబడి. దార్లు,...సామాజిక దోపిడీ దార్లు అంటూ వీళ్ళని నిందించడం ఎంత సిగ్గు చేటు......ఇపుడు చాలా కుటుంబాలని మాల్స్ మింగేసాయి... డబ్బుని గౌరవించడం, ప్రేమ గా చూడడం వీరి లక్షణం....... కనీస అవసరాలు తీర్చే షావుకార్ల కొట్లు వెల వెల బోతున్నాయి..... పండగలకి, శుభకర్యాలకి వారి చేతితో ఇస్తే మంచిది అనేవారు...... ఇవాళ ఆ పరిస్థితి లేదు .....మనలాగా వాళ్ళు పెద్ద మేధావులు కాకపోవచ్చు..... MBA లు చేయక పోవచ్చు.... వారికీ తెలిసేది వన్ ప్లస్ వన్ టూ..... మనకి తెలిసేది వన్ ప్లస్ వన్ జీరో........


Rate this content
Log in

Similar telugu story from Classics