మధురం
మధురం
తన సన్నిధి చేరగల్గు..ఉపాయమే మధురం..!
ఈ విరహం మాన్పగల్గు..ఔషధమే మధురం..!
పరిమళించు మెఱుపులాగ..వచ్చివెళ్ళె తాను..
ఎదురుచూపు అడవిన తన..విలాసమే మధురం..!
ఎంత మంచు పడుతున్నా..ఎందుకింత తాపం..
ఓ రవంత తన అనుగ్రహ..ప్రసాదమే మధురం..!
ఒక తియ్యని మౌనమేమొ..దీపంలా ఉందే..
అక్షరాల వెలుగునదీ..విశేషమే మధురం..!
మట్టితోటి అనుబంధం..యుగాలుగా మనసుకు..
హృదయగగన సీమలలో..విహారమే మధురం..!
మరి మనసు పలికే వేళ..ఆనంద నిలయమా..
ఆస్వాదన తోడయ్యిన..అనుభవమే మధురం..!