శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

అజాతశత్రువు

అజాతశత్రువు

3 mins
334


అది సిటీ కి కొంచెం దూరంగా విసిరేయబడ్డ గ్రామం..ఆ ఊరికి ఓ ఘన చరిత్ర ఉంది ..ఓ తరం అంతా ప్రేమ పెళ్ళిల్లే..దానివెనకాల ఇంకో చరిత్ర ఉంది.ఆ ఊరిమొత్తానికి మోతుబరి శత్రుసేనుడు..పేరుకితగ్గట్టు అందరికి శత్రువే!అదీ అప్పు తీర్చేపుడే,ఆ ఊరిజనాలకు శత్రువులా కనిపించేవాడు..అప్పు కావాల్సివస్తే ధర్మరాజు,కృష్ణుడు,శిబిచక్తవర్తి అంతా మిక్సీ లో కొట్టినట్టు కనపడేవాడు..

అప్పు తీర్చను అన్నవాడినీ,ఎగేసేవాడినీ,రొమ్ము

విరిచేవాడినీ తనదైన స్టయిల్ లో శిక్షించేవాడు.అప్పు తీర్చాల్సిన వ్యక్తి ఇంటికి మొదటగా సామ,దాన,భేద ఉపాయాలుగా శిష్యుడు దేవరయ్య వెళ్లి..అడిగేవారు.

తగ్గింపు ఇస్తారు తొందరగా కట్టమనేవాడు.వీటికి పనికాకపోతే దండనగా ప్రేమవివాహం జరిపించేవాడు ఆ ఇంటి పిల్లలకు.

వాళ్ళచేత కాయితాల మీద సంతకాలు చేయించుకునేవాదు.అప్పుని ఇన్ని వాయిదాలో తీరుస్తాం అంటూ.పిల్లలు చదువుకుని,చేతికి అంది వచ్చే సమయానికి ,శ్రుతసేన పెళ్లి చేసేసేవాడు.అదీ తన ఇష్టం అయిన వారితో.చేసుకునేవారి ఇష్టాఇష్టాలతో అతనికి సంబంధం లేదు.ఎదిరించి నిలబడితే..అడయినా

మగయినా జైలే గతి.పోలీసులు వుండరు.కంప్లయింట్ ఉండదు.అసలు స్టేషనే ఉండదు.తన కొష్టం ఒకటిఉంది పక్కఊరిలో.అక్కడకి వీళ్ళని ట్రాన్సఫర్ కొట్టేవాడు.జీతంబత్తెo లేని గొడ్డు చాకిరీ ఉండేది.

ఒక నీతి ఉంది అతని దగ్గర.నమ్మకంగా అప్పు తీర్చడానికి వెళ్ళేవారికి ,ఉండడానికి సౌకర్యం చూపించేవాడు.వాళ్ళూ సరైన సమయానికి డబ్బులు అప్పజెప్పేసేవారు.

అప్పుతీర్చగానే వాళ్ళ ఇష్టమయినట్టు బ్రతకొచ్చు..

దీనిపై తల్లిదండ్రులు ఆ గ్రామంలో రెండుగా విడిపోయారు.శత్రుగారు చేసేది ధర్మయుద్దం అని ఒకరూ.చేతికి అంది వస్తున్న పిల్లల్ని మాకుకాకుండా చేస్తున్నాడని సగంమందిగా విడిపోయారు.మెజారిటీ వ్యతిరేకత దే.అయినా శత్రు జంకేవాడు కాదు.

ఇలా సాగిపోతున్న క్రమంలో శత్రుసేన కు పెళ్లి నిశ్చయం అయింది...మా ఉసురు పోసుకుని మూడుపదుల వాడు అయ్యాడు.ఇంకో పదేళ్ళుంటే ఈ అప్పు తీర్చుకునే పద్దతిలో ఎపుడొకపుడు టపా కట్టేస్తాడు..ఎవడొకడికి పౌరుషం పుట్టకుండా ఉంటుందా!దొంగదెబ్బ తీయకుండా ఉంటారా అన్నవాళ్ళకి చెంపదెబ్బలా..పెళ్లికూతురు పై తుది నిర్ణయం మీదే అంటూ గ్రామప్రజలకు కబురంపేడు.

ఇందులో ఎం తిరకాసు ఉందొ అని,కొంతమంది భయపడ్డారు.కానీ వ్యతిరేకులు అమ్మాయిని మేము చూస్తాం అన్నారు.శత్రు నవ్వుతూ సరే అన్నాడు.

శత్రు మద్దతుదారులు ఎం సంబంధం చూస్తారా అని ఆరా తీసేవారు..అంతెందుకు మన కూడు లాగేసి,మనల్ని అనాథల్ని చేసినోడికి, అనాధాశ్రమం నుంచే పిల్లని కూడా తెద్దాం..అందరూ ఉండి,లేకపోవడం అంటే ఏంటో వాడికి తెలియాలి..

గ్రామ ఆచారం సందర్శనలోభాగంగా పిల్లని చూడడానికి ఊరంతా బయలుదేరింది.ఒకరికి మోదం ఒకరికి ఖేదం అక్కడ...ఓ పెద్ద కారులో శత్రు కూడా దిగేడు..అమ్మాయిని చూసినవ్వుకున్నాడు.పిల్లని చూసి పిచ్చోడయ్యాడు అనుకున్నారు వ్యతిరేకులు.

ఒక చిన్నమాట చెప్పేసి వెళ్లిపోతాను.ఇక్కడ ఉన్న ఈతరం పిల్లలు ముఖ్యన్గా వినండి.నాన్నగారి చిన్నపుడు ఈ ఊరి ప్రతి ఇంటి యువత పట్టణాల్లో చదివారు.మీ వాళ్ళని వాకబు చేస్తే మీ ప్రతి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు కూడా జనాభా లెక్కల్లో ఈ ఊరిలో ఉండరు.కానీ పట్టణంలో ఉన్నారు.హాయిగా సంసారాలు చేసుకుంటున్నారు..వాళ్ళు తప్పు తెలుసుకుని వెనక్కి వద్దాం అనుకున్నా ,మీవాళ్ళు రానివ్వరు..దానికి వాళ్ళు చెప్పే కారణం కూడా సరైనది.కానీ కుటుంబానికి విలువ ఇవ్వని మీకు,మళ్ళీ కొడుకు కూతురూ అంటూ బంధాలు ఎందుకు?అలాగే వెళ్లిపోయినవాళ్ళు కూడా ఆలోచించాలి.మనదేశమ్ ,ధర్మం,కట్టుబాట్లు అన్నీ ఓ పద్దతి కోసం ఏర్పాటైనవి..ఎదిగొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల అవసరానికి అందిరావాలి..

డిపెందెన్సీ నాకు నచ్చదు అంటారు.మన పుట్టుకే ఇంకోవారిపై ఆధారపడి ఉంది..తల్లితండ్రుల అపురూపమైన కలయిక శ్రమ ఫలితం నువ్వు..నువ్వు...మనం అంతా...అందుకే ఆ తంతూ ఓ వేడుకలాగే జరుగుతుంది.భర్త భరోసా.అందుకే కార్యం గది మొదటి ఆశీనుడు అతను.ఆడవాళ్లు నవ్వుతూ తుళ్ళుతూ గదిలోకి పంపే తంతు నీకు భయంలేదని చెప్పడం కోసమే...అంతలోకం తెలీని ఆమెతో కలిస్తేనే సంసారబంధానికి మంచి గుర్తింపు వస్తుంది బిడ్డల రూపంలో...

దాన్ని బహిరంగం చేసి వదిలిపెట్టారు కొన్ని ఏళ్లుగా...మన ఊరి ప్రతి యువతా పట్టణాలకు పోయి,చదవడానికి ఇక్కడ మీ నాన్న కిందామీదా పడి రూకలు పంపుతుంటే..నీ కష్టానికి వినియోగించడం మానేసి,వేరేవాళ్ళని మేపడానికి వాడుతున్నారు.చదివి ఓ స్థితికి రావాల్సినవాళ్ళు,వాళ్ళ ప్రేమలో పడి వలలో పడ్డ చేపల్ల కొట్టుకుంటున్నారు...

చదువుకునే యువత ఒక్కసారి ఆలోచించండి..ఓ అమ్మాయిని చూసేను.అప్సరసలా నా కళ్ళలో నిలిచిపోయింది.వాలుజడ,తీరైన కళ్ళు అనో....ఓ అబ్బాయిని చూసేను.ఆరడుగుల అందగాడు...ఇంత ఛాతీ,అంత మీసం..సిగ్గు అనిపిస్తుంది..ఎవరో!ఎలాంటివారో?ఎక్కడివారో?ఎం తెలీకుండా మీలో ప్రేమ చిగురించేస్తుంది..కానీ వందల ఎంక్విరీలు చేసిన పెద్దోళ్ళు చూసిన సంబంధాలకుతెలీనివారితో పెళ్లి ఎలాగ?

అని వంక పెడతారు..

ఓ వయసులో ప్రతీ విషయం అందంగానే అనిపించాలి.కనిపించాలి..అంతా అద్దంలా సద్దినట్టు ఉండాలి.మరి నీ ఇంతటి ఆలోచనకు పురుడుపోసిన పెద్దోళ్ళు మీ నుండి ఎం ఆశించకూడదా!?ఈ ప్రేమ జాథ్యం వల్ల మన ముందు జనరేషన్ మామూలు కష్టాలు పడలేదు.చుక్కయ్య మావా!నేనంటే చాలా కోపం కదా!మరి నీ కూతురు ఇప్పుడు నీ కళ్లముందు వస్తే...రామ్మా!పిలిచేడు ఆమెను..

నాన్నా!పిలుస్తున్నవైపు తలెత్తి చూసేడు.కూతురు ఎంత లక్షణంగా ఉందీ!?

మన నాగిది!ఎం బడ్డాయిగా ఉంది ముక్కున వేలేసుకుంది గుంపు.

వెళ్లబోతూ చెప్పేది ఒక్కటే..అమ్మానాన్నలు మీరు చదివేసి,సంపాయించి కార్లలో తిప్పుతారన్న అతి ఊహల్లో అర్థం లేదు.ముక్కుమొహం తెలీనివారిని చూడగానే పుట్టేసే ప్రేమలోనూ అర్థంలేదు.

చెప్పు,బట్ట,బంగారం ఎం కొనాలన్నా రోజులకొద్దీ సంపాదన పోగై, గంటలు సాగే అనుమానాల నివృత్తి దాటి బయటకువస్తుంది..చిన్ని మొగ్గల మొదలయ్యే జీవితం,పూలుగా..ఫలించి పండుగామారి పండుగ చేస్తుంది...ఇంత కార్యక్రమాన్ని బస్సులో చూసేమ్,కాలేజీలో చూసేమ్,మెరుపులా మెరిసింది,పువ్వులా నవ్వింది అంటూ ప్రస్తుతాన్ని వదిలి,అగాధాల్లో కూరుకుపోతున్నాం...

మీరు కుదిర్చిన సంబంధం నాకు...ఒక్కనిమిషం ,నేనూ మాట్లాడాలి అంది పెళ్లికూతురుగా తేబడ్డ అమ్మాయి.

నా అనుమానం తప్పు కాకుంటే...మీరు శత్రుగారు కదూ!

అవును అన్నాడు శత్రు.

మీ ఆశ్రమం నుంచే నన్ను పావుగా వాడడానికి తెచ్చేరన్నమాట..చిన్నప్పుటినుంచి ఎత్తుకుని పెంచిన మేనామావ,బావ వరుసవాళ్ళు కూడా వరుసైన అమ్మాయిని,నేను ఆ దృష్టితో చూడలేదు అంటారు.

నాకు మూడేళ్ళ వయసునుంచి తిండిపెడుతున్న దివిజ ఆశ్రమం కాబోయే హక్కుదారు శత్రుగారు..ఆయన నాకు ఏమవ్వాలి!?

కుళ్ళుతో కుతంత్రంతో,, మీకు మేలు చేస్తున్న ఈయనకు ఇలాంటి సంబంధం తెచ్చిన విశ్వం గారూ...మీరు శత్రుగార్ని అల్లుడు చేసుకోవలనుకున్నా,

నేను అంతటి దురాశకు తలొంచను.నాలా చాలా మందికి ఆశ్రయం కల్పిస్తున్న మీకు నమస్కారం.విశ్వంగారికి అమ్మానాన్న మాట వేదం అని పెళ్లయిన కొన్నిరోజుల తరువాత గుర్తొచ్చి,కట్టుకున్నామెను వదిలేసి వచ్చేడు....అందరి ప్రేమా అంతే కాకపోయినా...చూడగానే పుట్టేసే ప్రేమ ఎపుడొకపుడు లోటుని వెదుకుతుంది..

ఎంత తొందర అయినా తొమ్మిదినెలల గర్భవాసం ఎలా తప్పదో!పెళ్లికి ఎంత తొందర అయినా మరీ ఒకే చూపంత కంగారు పనికి రాదు.ఎందుకంటే ఇది పిల్లలాట కాదు..ఆడినంతసేపు ఆడి ఓ మూలన పడేసే బొమ్మకాదు జీవితం..తిరిగినన్ని రోజులు వారిని పరిశోధించి బ్రేకప్ చెప్పడానికి..తరువాత మాలాంటివారి అనాధజన్మకు కారణం అవడానికి..



Rate this content
Log in

Similar telugu story from Abstract