శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

సంకెళ్లు

సంకెళ్లు

4 mins
289


అవి మాట్లాడలేవు..కానీ కరడుకట్టిన నేరస్తుడిని నిరంతరం ప్రశ్నిస్తూ ఉంటాయి..మారమని రోధిస్తాయి..ఆస్తికురాలు అయితే అయ్యో!నా దేవుని చేతుల్ని బంధించానే అనుకుంటూ..తాను ఏడిస్తే చిందించే కన్నీళ్లు స్వామి చేతులను అపవిత్రం చేస్తాయేమో అని నోరు మూసుకుంటుంది..మౌనంగా రోధిస్తుంది..వారిని మార్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తుంది..ఇన్ని చేసి,తోడుగా కలకాలం ఉంటే బాగోదని తెలిసి,ఏదొకరోజు హఠాత్తుగా దూరం లేదా మాయమౌతుంది..దాని అభిమానాన్ని అన్నమయ్యే చెప్పాలేమో లేదా చెప్పగలడేమో అనిపిస్తుంది..


సాధారణంగా ఇంగ్లీష్ టీచర్ స్మార్ట్,లెక్కల మాస్టర్ నాటు ఉంటారు..ఇక్కడ అంతా ఏవిటో విచిత్రంగా ఉంది..సనత్ సర్ భలే అందంగా ఉంటారు..వైనతి మామ్ కోతికి చీర కట్టినట్టు ఉంటారు..ఇది పిల్లల ఆలోచన..


అదేమిటి మావైపు మొహాలు తిప్పారు !?ప్లీస్ మాజోలికి రావద్దు..ఎదో అందంగా ఉంటాము అనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం..మా ఆరాధ్యదేవత కోవై సరళ అయితే అక్కడక్కడా మా టీం టీచర్స్కి నాగార్జున వెంకటేష్ దొరికినా ,అమ్మఒడి డ్వాక్రా ఋణాల్ని సాయి వైన్స్,తిరుమల ఫైన్స్ లాంటి కలియుగ అవతారాల సాయంతో నడుస్తున్న మెడిసినల్ ఖర్చుకి వాడుతుంటారు అని సరదాగా ఉదయం ఏడు నుంచి రాత్రి ఎనిమిది వరకూ నవ్వుకుంటాం..


ఆతరువాత వాటిని రేపటికోసం దాచుకుంటాం..ఇప్పుడు సొంత నిర్మాణ సారథ్యంలో,పతిదేవుడి దర్శకత్వంలో

తన్నులు- టన్నులు సీక్వెల్స్ సీరియల్స్ లా సాగుతుంటాయి..అన్ని అపార్ట్మెంట్ కిటికీలు ఆహా!లో చూసినంత గౌరవంగా సోఫాలో కూర్చుని మరీ ఈ దాడి ప్రయత్నాల్ని కన్నీళ్ళతో పర్యవేక్షిస్తూ ఉంటారు..


ఇక మన హీరో,హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తే..వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండిపోతే విద్యాసంస్థానానికి శాశ్వత సబ్జెక్ట్ వెచ్చన్దార్లుగా ఉంటారని ఏవో,డీన్,హెడ్ మిస్ట్రెస్ అనుకోని క్షణం లేదు..మేఘాలు,గాలులు,వర్షాలు అన్ని ఇన్ని ఆలోచనల్లో తడుస్తూ,మెరుస్తూ,వీస్తూ ఉన్నపుడు అనుకున్నది వాస్తవం కాకుండా పోతుందా!అనుకున్నారు..


ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది..ఆ బ్రాంచ్కి ప్రైమరీ టీచర్స్గా ముగ్గురు ముద్దుగుమ్మలు విచ్చేసారు..మేమంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డాం..మొహాలు ఏ జక్కన్న చెక్కాడో కానీ,అంతా దేవతలు మాదిరి ఉన్నారు..మేము అప్పటివరకూ వాడుతున్న ఫెయిర్ అండ్ లవ్లీ మానేసామ్ ఇక..వేమన గారు అన్నట్టు మాకు జ్ఞానోదయం అయింది..ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అని మా హ్యాండ్బ్యాగ్ పై చిన్ని చిన్ని అక్షరాలతో రాసుకున్నాం..తద్వారా మాకు మా సబ్జెక్ట్ పై మరికాస్త పట్టు వచ్చింది..క్రీమ్ ల ఖర్చు కరెంట్ బిల్ పట్టుకుపోయేది..తప్పదు కదా!ప్రజల ప్రభుత్వం ..మనమే బ్రతికించాలి.


సర్!లూకింగ్ సో క్యూట్ ప్రైమరీత్రయంలో మానసటీచర్ అంటుంటే..మాకు గొంతులో ముద్ద అడ్డడిపోయింది..ఆదిభిక్షువు విషాన్ని ఎట్టా దాచాడో అర్ధమైనా,ఆట్టే మింగకపోతే పోతాం అనిపించి నీళ్లు గొంతుక్కి సప్లై చేశాం..


థాంక్స్!నవ్వేడు సనత్..


మేడం ఎం చేస్తుంటారు!?


----(తెలిసి ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు ఆలోచిస్తున్నాడు సనత్)


ఓహో!మేము ట్రయ్ చేసుకోవచ్చు అన్నమాట క్షిప్ర టీచర్ నవ్వింది..


మేడం!నాకూ పెళ్లి కాలేదు ప్రైమరీ మాథ్స్ వినయ్ సర్ నవ్వుతుంటే..


సనత్ సర్ ఎవరికో తెలిసిపోయాక,మిగతా ఇద్దరం మీ గురించి ఆలోచిస్తాం సర్ ..


ప్రణామాలు ..వినయ్ సర్ నవ్వుతూ వెళ్లిపోతుంటే


ఈలోపు మీరు ఎవరికీ సొంతం కాకండి సర్..అరిచి మరీ చెబుతున్న క్షిప్ర ని చూస్తే,రాఖీ స్వయంవరం లైవ్ లో కనిపించింది..


ఇలా మాట్లాడితే మీ ఇళ్ళకాడ ఏమీ అనరా!!


మాకు ఇళ్ళు ఏడిస్తే కదా!ఒకవేళ ఇళ్ళు ఉంటే మమ్మల్ని ఖాళీ ఉండనివ్వరు ఎవరూ!!కన్ను గీటింది..


ఈ సంభాషణ అక్కడి స్టాఫ్ని గతుక్కుమనిపించినా...

ప్రైమరీ సోషల్ టీచర్ స్వాతి బుర్ర రోబో 2.0 లా పని చేస్తోంది..


స్టడీ హవరికి ముందు టిఫిన్ టైం లో..వాళ్ళు వాళ్ళు అయి ఉండొచ్చు అంటావా..!?స్వాతి మిగతా వారిని అడిగింది


వాళ్ళు అంటే ప్రైమరీ సైన్స్ క్రాంతి అర్థం కాలేదని అడిగింది..


రోడ్డు మీద,రాత్రి తొమ్మిది దాటాక అందర్నీ ..ముఖ్యన్గా మన మగాళ్లని ఆపుతారూ...ఊ..ఆగిపోయింది ఎదురుగా నుంచున్న క్షిప్రని చూస్తూ..


ఎం స్వాతి మామ్ ఆగిపోయారు!?క్షిప్ర ఆడిగినతీరుకు మొహం పాలిపోయింది స్వాతికి..


వచ్చేయ్ క్షిప్రా!శీతల్ లాక్కునిపోయింది అక్కడినుంచి.


ఆరోజు మొదలు వాళ్ళు ముగ్గురూ అంతా అయ్యాక భోజనాలకు వచ్చేవాళ్ళు..వాష్రూమ్ యూస్ చేయాలన్నా మిగతా స్టాఫ్ తరువాతే అని కట్టడి చేసుకున్నారు,చేయబడ్డారు కూడా..


డీన్ భార్య,హయ్యర్ సైన్స్ హెడ్..ఆమె ద్వారా విషయాన్ని తెలుసుకున్న డీన్ స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసేరు..పిల్లలకి పాఠం నేర్పే విధానం నుంచి,ఆటల్లో వీకెండ్ ప్రాజెక్ట్ వర్క్ లో వాళ్ళు అక్టీవ్ ఎలా ఉండాలో చెబుతూ...ముగ్గురు ప్రస్తావన తెచ్చేరు డీన్..


నన్ను క్షమించాలి ముందుగా మీ ముగ్గురూ అంటూ మొదలెట్టారు..వీళ్ళను అంటూ చెప్పబోతుంటే..మేము చెప్పొచ్చా సర్ శీతల్..


ఆడవిబిడ్డలు అంటే అందరికీ బిడ్డలు కారు..అలా అని భార్య కూడా కాలేరు..కానీ ఓ ...(మాటలురాలేదు శీతల్ కి..) ఆటబొమ్మ అవ్వొచ్చు..మేము కొన్నాళ్ళు అలానే బలయ్యాం..అందరూ రాక్షసులు కారు అన్నట్టు,ఓ రోడ్ కాంట్రాక్ట్ ఇంజినీర్ మమ్మల్ని పోలీస్ ద్వారా అక్కడినుంచి తప్పించి,గురుకుల హాస్టల్ లో వేసేరు..మా పీజీ ఖర్చు వరకూ వారే భరించేరు..సివిల్ కోచింగ్ కి వెళ్ళమన్నారు..

చదువు నేర్చుకున్న మాకు,దాని విలువ తెలుసు కాబట్టి ఇలా ఈ ఫీల్డ్ కి వచ్చెమ్..ఎవరో నవ్వు అపుకుంటున్నట్టు అనిపించిన డీన్ ...శీతల్ ఇక నా టర్న్ ఇపుడు..

కూర్చోండి ప్లీస్ అన్నారు..


చెడిన(మీ ముగ్గురూ నన్ను క్షమించాలి ఈమాటకి) వారి దగ్గర నేర్చుకునేది,వాళ్ళు నేర్పేది ఏమి ఉంటుందని కొంతమందికి నవ్వు రావచ్చు..వారికి మరో సిగ్గుతో కుంగిపోయే గొప్ప విషయం చెప్పబోతున్నాను..వీళ్ళు వారి జీవితాన్ని చదువు చెప్పడానికే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు..లోకం నుంచి రిటైర్ అయ్యేవరకూ..ఇంకా ఉ..చి...తమ్..గా...!!


ఉలిక్కిపడ్డారు స్టాఫ్..ఫ్రీ గానా..!?


వీళ్ళు మన హాస్టల్ లో ఉండడం లేదు..మీ దయవల్ల ఇక్కడ తినడం కూడా మానేసేరు..వీరికి ఒక స్థిరమైన జీవితాన్ని నేటికీ అందిస్తున్నది ..సనత్ సర్!ప్లీస్ ముందుకు రండి...ఈయన లెక్కల మాస్టర్గానే మనకు తెలుసు..వీరికి విద్యాబుద్ధులు చెప్పిస్తున్న ఇంజినీర్ ఈయన.ముదురు బెండకాయ,పెళ్లికాదు లాంటి విశేషణాలకి అవలీలగా నవ్వుకోగల దిట్ట..ఒక సేఫ్టీ కోసం వీళ్ళని ఇక్కడకు చేర్చింది ఈయనే!!కానీ ముందు మేమూ కంగారు పడ్డాం..మీ ఉద్దేశ్యంలో ఉత్తినే చెబుతారు కాబట్టి జాయిన్ చేసుకున్నారు అని అనుకున్నా..మన చైర్మన్ ఎలాంటి స్టాఫ్ ని వేరే బ్రాంచ్ కి ప్రిఫర్ చేస్తారో మీలో ప్రతిఒక్కరికి తెలుసు!?చెప్పాలంటే మీరూ మీ తెలివి,జ్ఞానం కారణంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ..ఇక నేనేం చెప్పాల్సిన అవసరం లేదని నా ఉద్దేశ్యం .


నన్ను క్షమించండి క్షిప్రా!ఇవ్వాళ్టినుంచి మా లేడీ స్టాఫ్ కి దేవుడు ఇచ్చిన ముగ్గురు కూతుళ్లు మీరు, స్వాతి దగ్గరికి తీసుకుంటున్న ముగ్గురిలో ఒకరిని ఇది నాకు కోడలు అవుతుంది అంది ప్రైమరీ హెడ్ సౌమ్యా టీచర్..నాకు ఒక్కడే కొడుకు..ముగ్గురు కోడళ్ళు వద్దు..కానీ!


మేడం!నాకూ బాధ్యత ఉంది..తప్పకుండా అంతా కలిసి ,వెతుకుదాం సనత్ మాటలకు మనసారా నవ్వుకున్నారు స్టాఫ్..


సమాజంలో మనం ఎం చూడాలి!? చూస్తున్నాము !?అది మంచా చెడా ఎంతవరకూ ఉపయోగం లాంటి విషయాల్ని మనకి మనం గుణించుకోవాలి. ఎవరి

అభిప్రాయాలు అడిగినా ఆవి మన ఆలోచనల్ని క్రాస్ చేయకూడదు..తోడవ్వచ్చు పర్వాలేదు..ఎక్కడో జరిగిన మీడియా వార్తకి రోదించే మనసు,చుట్టూ తన చిన్ని ప్రపంచంలో తరచి చూస్తే క్షిప్ర,సీతల్ లు కనిపించినా సనత్లా మనం సాయం చేయొచ్చు..తారసపడకుంటే మరీ మంచిది..నీ చుట్టూ బావున్నట్టేగా!అలా అంతా తమ చిన్ని ప్రపంచాన్నీ సరిచేస్తూ ఉంటే చాలు ...స్టేజీలేక్కి శుద్ధి చేయక్కరలేద్దు..అలా అయితే ఎన్నో మూగసంకెళ్లు రెక్కలు విప్పార్చుకుంటాయి...చక్కగా చెక్కిన ప్రపంచంలో ఎక్కడైనా ధైర్యంగా వాలి,సరదాగా జీవితాన్ని గడుపుతాయి...



Rate this content
Log in

Similar telugu story from Abstract