శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Tragedy Inspirational

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Tragedy Inspirational

అలల గోదారి

అలల గోదారి

4 mins
261


కోసల్యా సుప్రజా రామా....గుడిమీద సుప్రభాతం వేసిన వెంటనే లేస్తుంది పద్మ...

రాముడు లేచాక లేద్దూవులే...పడుకో అనేది నాన్నమ్మ...

అమ్మ మాత్రం, ఆయనకి పడుకోవలసిన అవసరం లేదు....మనకి మంచి బుద్ధులు నేర్పడానికే సుప్రభాతం....

ఉందిలేవే....మీ రాముడికి పే....ద్ద సుప్రభాతం.....బడాయిగా తిట్టేది నాన్నమ్మ ,తన కోడలిని....

నా రాముడికి కాకపోతే,సుబ్బరావా....వెంకమ్మ కొడుకా.... అని మీ అబ్బాయికి ఉంటుందా ఏవిటి?...

మీ అమ్మ తగ్గదే.... నేనె తగ్గాలి...ముసలిదాన్ని అయ్యాను కాబట్టి గానీ,కొరకంచి పోయిలో పెట్టి వాతలు వేసేదాన్ని.....అభినయించి మరీ చెప్పేది...

ఒకసారి నాన్నమ్మని అడిగేను... ఎన్నిసార్లు వాత వేస్తాను అంటావే కానీ,ఎపుడూ కొరకంచిని పోయిలో పెట్టిన పాపాన కూడా పోలేదు.... ఎందుకే బడాయి మాటలు ....అంటే

కోడలు ,కూతురైపోతే.... వాతలతో ఎం పనే!?

మరి మా అమ్మ ఎదిరిస్తుంది కదా నిన్ను....

అది అంతే... నీకు తెలీదు...నీకు పెళ్లి అయితే అన్నీ అవే అర్థం అవుతాయి....

అయితే ఇపుడే పెళ్లి చెయ్యి .....అంటూ నడుం మీద చెయ్యేసి ఆరిందాలా నుంచుంది....

కొరకంచి ఎక్కడా?అని నాన్నమ్మ అంటుండగానే,తుర్రుమంది పద్మ....

ఒసేయ్!మాలోకం....ఏడవుతోంది.... కాఫీ తగలేస్తే పేపర్ చదువుకుంటాను....కొంచెం మనస్సాన్తి దొరుకుతుంది....అంటూ కుర్చీ లో కూలబడ్డాడు లక్ష్మణ్....

ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది పద్మ...తొందరగా కాఫీ కలిపి తెచ్చింది....

ఊహాలోకంలో మీ ఊరికి వెళ్ళొచ్చావా....అందరూ బావున్నార... ఎవరైనా చచ్చారా.... ఎందుకు ఛస్తారు.... అల్లుడి కట్నం ఎగ్గొట్టి,ముప్పొద్దుల తింటూ గుండ్రాళ్ళల్లా ఉన్నారు....మొన్న మీ నాన్నని చూసేను....గంజి....గంజి పెట్టిన తే....ల్ల షర్ట్ వేసి,50 ఏళ్ళు వచ్చిన,టింగు రంగా అని రోడ్డు పట్టుకు తిరుగుతున్నాడు....

పెద్దవాళ్ళని అన్నన్ని మాటలు ఎందుకు అంటారు...మనింట్లో పిల్ల ఇంకొక చోట ఉంది .....దాని పరిస్థితి నాలానే ఉంది....దాని గురించి ఆలోచించండి ముందు....

నీ బాబు..ఇదే నేర్పేడే నీకు....మొగుడు మాటకి అడ్డడిపోయి, ఎడాపెడా డైలాగులు వేసేయ్యమని....నా అక్క అక్కడ ఏడుస్తుందంటే, దానికి నీ బాబే కారణం....

బెవార్స్ మొహం గాడు....కట్నం ఎగ్గొట్టి,నా అక్క కాపురం పుట్టింటికి పరిమితం చేసేడు...దాని ఉసురు తగలక పోదులే....

నోరుమూసుకోండి....ఇష్టం వచ్చినట్టు మట్టాడకండి.... అక్కకి ఇల్లు కొనుక్కోవడాని డబ్బు ఇవ్వాలనే కదా,కట్నం డబ్బు మొత్తం మావయ్యకు ఇస్తే ,మనది అని భయమూ ఉంటుంది...వాడుకోవడానికి సాహసించడు అన్నారు అపుడు....ఇపుడు ఇలా మాట్లాడతారే..... వాక్యం పూర్తవుతుండగానే చెంప చెళ్ళు మనిపోయింది పద్మకి....

ఎం జరుగితుందో అర్థం కాలేదు...ఆడపడుచు వరం కొట్టింది అని ....కళ్ళల్లోంచి వస్తున్న నీరు మసగ్గా చూపించింది....

మా ఆన్నకు నాతో అబద్ధం ఆడాల్సిన ఖర్మెంటే!?....అసలు ఆ డబ్బేదో నేనె ఇచ్చి,నా కూతురునిచ్చి చేసేదాన్ని....

పిల్లలు చదువుకుంటున్నారని....అమ్మా.....అమ్మా....అంటూ కళ్ళు తిరిగిపోతున్నట్టుగా ,నటిస్తూ పడిపోయింది కింద....

పద్మ పట్టుకోలేదు.... ఇంకెవరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు....ఇంకోసారి బాణం మళ్ళీ దూసుకొచ్చింది ....ఈ సారి అత్త మీనా మొదలెట్టింది...

మీ అమ్మ ఇంతే నేర్పిందేంటి నీకు....ఎవరైనా పడిపోతుంటే చూస్తూ నుంచో అని....భలే సంప్రదాయం గల కుటుంబం.... పొద్దున్నే మీ మావగారూ హార్లిక్స్ తాగి వాకింగ్ కి వెళ్తారు....నాకో బూస్ట్....నా వరాలుకి ఒక గ్లాసుడు పాలు.....ఇవ్వన్నీ ఎగ్గొట్టి మొగుడితో మీటింగ్లేస్తావా.....ఎమ్మా....పదగ్గదిలోకి పోతూనే లైట్లు కట్టెయ్యకపోతే,మొగుడితో మంచి చెడు మాట్టాడుకోవద్దూ....మా అమ్మ నాకు ఏమీ చెప్పకపోయినా,ఎంత గుట్టుగా సంసారం చేసేననీ..... వీధి.. వీదంతా మురిసిపోయేవారు.....మాటే వినపడదే మీనా ఇంట్లో....అని....

మార్రాత్తల్లివి.... ఏవంటా వచ్చావో కొంపకి రోజూ గొడవలే.... ఒరేయ్....లక్ష్మణూ....నీకిదే చెప్పడం, నీ పెళ్ళాన్ని నోరు అదుపులో పెట్టుకోమను.....నా కూతురి ఇంటికోసం డబ్బులు అడిగి ,ఆ కాకిజమీందార్ ని అడిగి తీసుకురమ్మను.....

ఎప్పుడు చూడు...బావున్నారా చెల్లెమ్మా అంటూ...కిలో కిలో స్వీట్ హాట్ పొట్లాలు మొహానకోట్టేసీ,కప్పుడు కాఫీ కుడితి తాగినట్టు తాగుతాడు....ఎప్పుడన్నా చూసావే వరం..... భలే కామెడీగాడు దీని బాబు....అంటూ వెకిలిగా నవ్వుతూ, కూతుర్ని తీసుకు లోపలికి పోయింది....

ఇంకా ఆ దేభ్యపు మొహం ఎందుకు... పోయి టిఫిన్ పని చూడు....ఇదిగో...ఈ కాఫీ వెచ్చబెట్టుకుని ,ఎవరూ చూడకుండా తాగేయ్యి....నీకు అలవాటుగా బాగా.... అదో రకం నవ్వుతూ కప్ కుర్చీ లో పెట్టి స్నానానికి వెళ్లిపోయేడు మొగుడు......

ఇదిగో ఆ జుట్టు దెయ్యంల విరబోసుకుని ,పొద్దుపొద్దున్నే ఇంట్లో నడవకు...అసలుకే నిన్ను చూస్తే దయ్యాలు భయపడతాయి....ఆనక పోటీకి వచ్చేవని తీసుకుపోయి ఎక్కడో వదిలేస్తాయి....బూ.....అంటూ చెవి పక్కనుంచి పోయేడు మరిది.....

అమ్మయ్యా!గండం గడిచింది ....ఇవ్వాళ పావుగంట ముందే వదిలేసారు....నోరు నొప్పెట్టినట్టుంది పాపం....అనుకుంటూ చెవిలోంచి bluetooth తీయడానికి జుట్టు ముడేసుకుంది,అప్పటి వరకూ

.....సుప్రభాతం వింటున్న పద్మ......

ఇలా ఇది ఇపుడే కాదు..

గత ఐదు సంవత్సరాలుగా....ఎందుకో మావగారూ డబ్బులు వెనక్కి ఇవ్వడు.... అల్లుడూ తెగేసి అడగడు... కానీ ఒక రోజు ఆడపడుచు కూతురికి దొరికిపోయింది పద్మ.....

అమ్మ....అత్యయ్యా! దొంగ నువ్వు...నేను చూసేనులే అంటూ ,వెనక్కాలే వచ్చి పట్టుకుంది ఆడపడుచు కూతురు వనిత.....

పర్లేదు ఆత్తయ్యా....మా..అదే ..మీ ఇంటి సంగతి,మా అమ్మ సంగతి మాకు బాగా తెలుసు...నాన్న ఎపుడూ భయపడతాడు.... అమ్మ ఇలా ఇంకొక ఇంటి అమ్మాయిని ఎడిపిస్తే,నా పిల్లలు సుఖంగా ఉండగలరా,....అని....కానీ మా అమ్మ ,నా చిన్నప్పటినుంచీ కొంచెము కూడా మారలేదు...ఊరిలో సంబంధం కావడంతో, మా అమ్మతో నీకు తిప్పలు తప్పడం లేదు....

నువ్వు చెప్పవే వనితా....ఇంత మంచి మావయ్యని నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదే!?

జోకులెయ్యకు అత్తా.. ....మా అమ్మ ఇక్కడికి పంపినపుడల్లా చిన్నప్పటి నుంచీ చెప్పేది.....మనం ఆస్తిపరులం,చిన్న చిన్న వాళ్ళతో చుట్టరికాలు వద్దు అని....

మరి ఇల్లు కొనుక్కోవడాని డబ్బులు ఎందుకు!?

మాకు ఇల్లేందుకు ఆత్తయ్యా.....మా ఊరికి నువ్వు రాలేదు ఎపుడూ....ఊరిలోని పెద్దిల్లు మాది....మూడు ఎకరాల్లో ఉంటుంది అత్తా.... అన్ని రకాల పువ్వులు,కాయల మొక్కలుతో పెద్ద తోట,లోపలికి నడిస్తే మా ఇల్లు....మా ఇంట్లో ఒక పనమ్మాయి పెర్మనెంట్ గా ఉంటుంది ఎపుడూ....అబ్బో రాజభోగమే అంతా.....

ఏంటో... కొంతమందికి ఎంత ఉన్నా,సరిపోదు అనుకుంటూ పనిలోకి జారుకుంది పద్మ...

హాల్ లో ఫోన్ రింగ్ అవుతుంటే తియ్యరేంటి.... నన్ను ముట్టుకొనివ్వరు....ఏదైనా అర్జంట్ అయితే ....వీళ్ళకి దేనిమీద శ్రద్ధ ఉండదు,డబ్బు మీద తప్ప అనుకుంటూ ...లిఫ్ట్ చేసింది....

ఏమండీ...డబ్బులు అందినియ్యా... ఆ రాక్షసి ఇంటికి వెళ్లిందా....ఎపుడులాగానే కోతుల భాగోతమేనా...మాట్లాడేస్తోంది.....

ఒసేయ్!క్లాస్ ఫోరు.... నీకు ఫోన్ తో ఎం పనే,ఎవడు వాడు....ఎన్నాళ్ళు నుంచి సాగుతుంది వ్యవహారం.....దాదాపు పరిగెట్టుకుంటూనే వచ్చింది అత్తగారు..

నా సంగతి తర్వాత చెప్తాను....ముందు ఈ ఫోన్ లో అమ్మాయి సంగతి చెప్పండి.... ఎవరి ఇంటి కోసం ఎవర్ని డబ్బులు అడుగుతున్నారు.....మా వెనక ఈ ఇంట్లో ఎం భాగోతం జరుగుతుంది....ఇన్నాళ్లు కట్నం డబ్బులు తేకపోవడం పాపం అనుకున్నాను....అదే నా మొగుడు నాకు దూరంగా ఉండడానికి,నాకు పిల్లలు కలగకపోవడానికి కారణం అనికూడా మనసుని ఒప్పించుకున్నాను....కానీ నాకు తెలీకుండా,మీ కూతురు,కొడుకు ....అంతా కలిసి ఎదో నాటకం ఆడుతున్నారని అర్థం అవుతుంది....విషయం చెప్తారా లేదా....కాళికలా గర్జించింది....అసలే జుట్టు వదులుగా ఉంచుతుందేమో,ఆ తల ఊపుకి కొప్పు జారి ,గోదావరి పాయలా విడివడింది ఆమె జుట్టు...

ఎపుడూ అణుగు కోడిలా ఉండేది, ఇపుడేంటి పులిలా గర్జిస్తుంది ఆంటూ బయటకి వచ్చారు అంతా....

కధ పాకానికి వచ్చిందన్నట్టు.... నాన్నగారు కూడా వచ్చేరు....ఆశ్చర్యపోయింది ముందు.....రండి నాన్నా ఆంటూ ఎదురేళ్లబోయింది.....

ఇవ్వాళ నేనె ధైర్యంగా వచ్చెనమ్మా....లోపలికి వచ్చి తేల్చే లెక్కలు చాలా ఉన్నాయి....కూతుర్ని ఇచ్చాను కాబట్టి కప్పు కాఫీ మాత్రమే కుడితిలాగా తాగేనమ్మా చెల్లెమ్మా.....ఎందుకంటే గుప్పెడు అప్పుకొచ్చి కుంచాలు దోచేసే వంశం కాదు మాది....మా ఇంటికొచ్చి మా అక్క ఈ రోజుకు మా కొంప మీద పడితింటుంది,అంతకన్నా ఎక్కువ పట్టుకుపోతుంది....ఎప్పుడన్నా మమకారం ఎక్కువై ,నా పిల్లలకి మిగల్చకుండా నా కట్నం డబ్బు కూడా ఇచ్చేస్తుందని భయం వేస్తోంది మావగారూ అంటే మురిసిపోయెను.....

ఆ డబ్బుని పలానా ఆమెకి ఇస్తే ,మీకు నెలనెలా వడ్డీ టంచనుగా ఇచ్చేస్తుంది అంటే,తీసుకున్న అమ్మాయే నా రెండో కూతురు అవుతుందని ,అనుకోలేకపోయాను....

అవునమ్మా పద్మా....వీళ్లంతా చాలా తెలివిగా ,మీ నాన్నచేతే ,మీ ఆయనకి రెండో పెళ్ళాన్ని తెప్పించేరు.. నేనె నీ జీవితాన్ని నాశనం చేసేనమ్మా.......ఇందాక వచ్చిన ఫోన్ ఆ అమ్మాయి దగ్గర్నుంచె..... నిన్ననే నేను వీళ్ళిద్దర్నీ హాస్పిటల్లో చూసేను...ఏమిటా అని ఆరా తీస్తే విషయం తెలిసింది.....నీకు పిల్లలు పుట్టరని,సంసారానికి పనికిరావని చెప్పి,ఈ ప్రబుద్ధుడు ఆమె పుట్టబోయే సంతానానికి తండ్రిగా సంతకం చేసెడమ్మా రిజిస్టర్ లో.......ఆమెకి సిటీ లో ఇల్లు కొంటున్నాడు.....దానికోసం డబ్బులు కావాలి....నీకు తెలిసిన కధ నాకు కట్నం తెచ్చి ఇవ్వడం వరకే,నీ కట్నం ఆమె పరం ఆరోజే అయిపోయింది....

ఇంకా నువిపుడు ఎవరి పరం కావలనుకుంటున్నావో తేల్చుకో.....నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చెను....రావడం , రాకపోవడం నీ ఇష్టం....

మౌనంగా భర్త కాళ్ళకి దణ్ణం పెట్టుకుంది....అందరికి మీ నమ్మకద్రోహనికి నమస్కారం అంటూ బయటకు వచ్చేసింది....

గడప దాటితే....ఇంక...... అంటూ ఫార్మల్ డయలాగ్ వెయ్యబోతున్న భర్తని ఆపింది..

ష్.....నోరు విప్పకు....ఇన్నాళ్లు చెవులు మూసుకున్నాను....ఇపుడు ఇంత విన్నాక,ఈ గడప తో నాకు ఎలాంటి సంబంధమూ లేదు...

కోర్ట్ లో కలుద్దామ్...జాగ్రతా...ఆఖరి అస్త్రం సంధించబోయాడు....

అదే జరిగితే .......నీ రెండో పెళ్ళాన్ని కూడా కోర్టుకి ఈడుస్తా......

ఇంకేం చెప్పిన వినడం లేదు....నాన్నమ్మ మాటలు గుర్తొచ్చాయి....కోడలు కూతురైతే అని,అదే సరిపోదు అత్త కూడా అమ్మలాగా మారాలి,మా నాన్నమ్మలా....తల్చుకుంటే గుండెల్లో బరువంతా.......అక్కరలేని గోదారివరదనీళ్లు సముద్రంలో కలిసినట్టు......ఆనక గోదారి తల్లి ఎప్పటిలాగానే నవ్వుతూ పరవళ్లు తొక్కినట్టు....హాయిగా అనిపించింది......వాడి నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ......

కధకాదు నిజం



Rate this content
Log in

Similar telugu story from Abstract