శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Children Stories Children

3  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Children Stories Children

రంగు తీసి కొట్టు...

రంగు తీసి కొట్టు...

3 mins
166


స్కూల్ బస్ హల్ట్ స్పాట్ ...కొయ్యలగూడెం..

సమయం..5:30

కొట్టు కొట్టు కొట్టు..ఱంగుతీసి కొట్టు..రంగులోన లైఫ్ ఉందిరా...

ఈపాట రోజూ వస్తుంది డ్రైవర్ యతి ఫోన్ లోంచి..యతి మంచి డ్రైవర్,పిల్లలకి కూడా పాటలు వినిపిస్తూ డ్రైవ్ చేస్తాడు..అదే స్కూల్ మిగతా బస్ డ్రైవర్లు ఇయర్ఫోన్ లో వింటూ బస్ నడుపుతుంటారు..

పేరెంట్స్ ఎవరూ కంప్లైంట్ చేయరు..ఎందుకో మరి!?

కొయ్యలగూడెంలో బస్ స్టార్ట్ అయింది..యతి అన్నా!ఇవ్వాలంతా మా నాగ్ అన్న హొలీ పాట వినిపించాలి..పొద్దున్న సాయంత్రం కూడా..గ్రాండ్హౌస్ అత్త,మామలకి మాడు పగిలిపోవాలి(సనత్ ఇన్నర్ వాయిస్ ఇది)

సరేరా అబ్బాయ్!కానీ బస్ లో పిల్లలు గోల చేయకుండా నువ్వే చూసుకోవాలి..ఒక్కడు కిక్కురుమన్నా పాట ఆగిపోద్ది,ఆపై నీ యుద్ధం కూడా..

ఎం వద్దు!అంతా నేను చూసుకుంటా అని స్టైల్ కొట్టేడు,ఒక కొత్త ఒరవడి సృష్టించేలా...

సనత్ స్కూల్ అందరికీ నచ్చుతాడు..సినిమా,గేమ్స్ వాడికి అంతగా ఎక్కవు..నిజమైన ఆట గ్రౌండ్లో ఆడాలి లేదా గ్రాండ్ హౌస్ లో ఆడాలి..ఇది వాడి టాగ్ లైన్..

చదువు సరిపడినంత,ఆటల్లో విజృభించేస్తాడు...వాడి ధాటికి టెన్త్ వాళ్ళు హడలి చస్తుంటారు..

ఎవడో డిసైన్ చేసిన వీడియో గేమ్ కాదురా ఇది!ఒంటికి కండ పట్టించే దేశీ గేమ్ అంటాడు..కబడ్డీ లో వాడి కూత కూడా ఇదే!క్రికెట్ లో ఓ దేశం ఆటగాళ్లు విపరీతంగా తిడుతూ ఉంటారట అవతలి జట్టుని..శత్రువు కుంగిపోవడానికి వీళ్ళు వేసే మంత్రం అంటుంటారు..కానీ సనత్ ఈ కూత వేస్తూ బరిలోకి దిగితే,అవతల డ్రిల్ మాస్టర్ ఉన్నా ఔట్ అవ్వాల్సిందే!.

ఇక కొయ్యలగూడెం నుంచి ద్వారకకి బస్ జర్నీ మొదలైంది..

ఇక్కడ .....సమయం 6:45

గ్రాండ్హౌస్ లోకి స్కూల్ బస్ ఎంట్రీ ఎప్పుడూ బానే ఉంటుంది..ఒక్క ఫాల్గుణ మాసంలో తప్ప.అందరిగుండెలు మాచెట్టు.. మాచెట్టు..అని కొట్టుకుంటాయి ఆ టైం లో...ఇంటి యజమానులు ఇవ్వాళ సనత్గాడు దొరకాలి!తస్సారవ్వాలా...మా గేట్ కి కట్టేద్దాం ప్రెసిడెంట్ గారూ(కాలనీ కి మాత్రమే)..

వద్దురా!అభి..చదువుకునే పిల్లలు అల్లరి చేయకుంటే,నువ్వు నేనూ చేయగలమా చెప్పు!?పార్వతినాని కొడుకుని సముదాయిస్తుంది.

అమ్మా!నీకు వయసయిపోయింది..ఈ ఇంట్లో నీకు మాట్లాడే హక్కు కూడా తగ్గిపోయింది..వెళ్లి పూజ చేసుకో!ఆదేవుడిని గట్టిగా కోరుకో!ఇవ్వాళ సనత్ గాడు నాచేతికి దొరకాలి అని..

అవునా!సరే అయితే..సనత్ గురించి నాకు బాగా తెలుసు..వాడిని మీరు జన్మలో పట్టలేరు..రాసిస్తా..అంటూ పూజకి వెళ్ళిపోయింది ఆమె

అత్యయ్య!వాడు పూత మొదలు నుంచి పరువుకు వచ్చే కాయలవరకూ చెట్టును దుళ్లగొట్టేస్తున్నాడు..

వాడు.!.అసలు వాడిని తల్చుకుంటే కాలనీ ఆడాళ్ళకి బీపీ పెరిగిపోతుంది..రాత్రి చిమ్మిన ఇల్లు,పొద్దునే మళ్ళీ ఊడవాల్సివస్తుంది..పైగా స్కూల్,ఆఫీసు వెళ్ళేవాళ్ళకి వంట సమయానికి ,ఈ పని ఓ అడ్డయి కూర్చుంది...

ధూమ్ మాచాలే ధూమ్ మాచాలే ధూమ్...హైద్రాబాద్ నుంచి కాకినాడ పోయే మార్నింగ్ స్టార్ బస్ హార్న్ అది.ఏడింటివరకూ ఇక్కడే ఆగుతుంది..టిఫిన్లు టీ కోసం..

ఆపాటకి అలెర్ట్ అయ్యారు గ్రాండ్ హౌస్ సైన్యం..హృతిక్ వచ్చేడు అంటే...యతి ఇంకో ఆయుదారు నిమిషాల్లో బస్ ఆర్చ్ మలుపు తిప్పుతాడు ఇక..

గ్రాండ్హౌస్ మెంబెర్స్ ఎన్నిసార్లు లంచం ఇచ్చి,సందులోకి వచ్చేపుడు హార్న్ వేయమన్నా,లంచాన్ని-హార్న్ వేయడాన్ని సంతోషంగా తిరస్కరిస్తాడు యతి..ఈ అల్లరి ఓ రెండుమూడు గంటలు నా సొంతం సర్ అనేపుడు కళ్లనీళ్లు తిరుగుతాయి యతికి..

యతి ఓ అనాధ..చిన్నప్పటునుంచి స్కూల్ చైర్మన్ ఇంట్లోనే పెరిగి,ఆయన కార్ డ్రైవర్ నుంచి,బస్ కి మారేడు...అమ్మానాన్న అదుపు ఆజ్ఞలో నుంచి కొన్ని చిలుకలు ఇక్కడ హాయిగా ఊపిరి తీసుకుంటాయి..

ఆఊపిరికి నేను కారణం అంటే గర్వన్గా ఉంటుంది అంటాడు..పిల్లల్ని తాను ఏమనడు,ఎవర్నీ అననివ్వడు..ఇంత బాగా చూసినా పిల్లలు అల్లరి హద్దు దాటుతుంది..దాన్ని కంట్రోల్ చేసే దమ్ము ఒక్క సనత్ సొంతమ్..ఇంత సంగతి వల్ల గ్రాండ్ హౌస్ మెంబెర్లు కి సాయానికి నో అన్నాడు యతి..

కర్మరా బాబూ!అనుకుని ఈరోజు సెలవు కావడంతో రోడ్ నమ్బర్ ఒకటి నుంచి తొమ్మిది వరకూ ..లైన్ కి నలుగురు అతిరధులు నుంచున్నారు..సరిగా అంతా చెట్లు దగ్గర ఉండేలా చూసుకున్నారు..ఇక్కడే..ఇప్పుడే..హొలీ చేద్దాం అంటూ బుక్కాలతో నుంచున్నారు..

పిల్లల్ని అంచనా వేయడం ఎవరి తరం!?పిచ్చోడి మాటలో నిజంలా ,పిల్లల పనుల్లో పెద్దపెద్ద అర్దాలు గోచరిస్తూ ఉంటాయి..

పిల్లలు రంగులతో సిద్ధంగా ఉన్నారన్న సంగతి ఆలస్యం అయ్యేలోపునే...మొహాలన్నీ రంగులమయం అయ్యాయి..

అరె అని!కొట్టరా..బాంక్ అంకుల్ మొహానికి పచ్చరంగు..

హెడ్ మేష్టారుకి తెల్లరంగురోయి!శాంతిదూత.....

కిరాణా కొట్టుకి నల్లరంగు,మొన్న అళ్ళిపోయిన గుడ్లు అంటగట్టెడురా నాకు.

స్వాతి!అర్చన వాళ్ళ మమ్మీ కి ఎం రంగు!?

నలుపే కొట్టు,అంటీ భలే తెల్లగా ఉండి,బాగా కనిపిస్తుంది..

ఆ బస్ ప్రేమికుడులో శంకర్ బస్ ని గుర్తుచేసింది అందరికి..బస్ లో అంతా ప్రభుదేవాలు అయితే..బస్ బయట అంకులాంటీలు వడివేలులా ఆవ్!అంటూ చెట్టుకో చాటు చేరిపోయారు..

అప్పుడు లాస్ట్ సీట్ నుంచి ,గర్వన్గా వైఫర్ బయటకు వచ్చింది..ఇనుప రేకు ఏర్పాటు చేయబడ్డ ఆ వైఫర్ చెట్టు కొసన ఉన్న పరువుతెగిన మామిడికాయల్ని వరసాగ్గా పలకరించుకుంటూ పోయింది..ఆవెనుక గ్రాండ్హౌస్ ఆస్థాన మాయి రజని కాయల్ని సంచిలో వేస్తూ కనిపించేసరికి...

హమ్మయ్యా!సెలవే కదా మళ్ళీ తుడుచుకోవచ్చు!కాయలు మాత్రం క్షేమం...ఊపిరి పీల్చుకున్నారు గ్రాండ్ హౌస్..

ఆలెగ్జాండర్లా గ్రాండ్హౌస్ చెట్లని జయించిన సనత్ వేసిన మరో ప్లాన్ ఉంది..ఎమ్మెల్యే గారి ఆఫీస్ వైపుగా ఈరోజు బస్ ప్రయాణించాలి..

ఈ మూవ్ రోజూ ఉండదు కదా!ఇది తొండి అనుకున్నారు మెంబెర్స్..

ఇక్కడ మెంబెర్స్ గుండె బేజారయ్యే మరో మూవ్ కూడా ఉంది..హైక్రోస్ మలుపులో రజని చేతిలోని సంచి చేయి మారుతుంది కూడా....

సమయం తొమ్మిది గంటలు..వందేమాతరానికి ముందు...హ్యాపీ హోలీయ్.....అంటూ స్కూల్ ప్రాంగన్ మారుమోగింది..

మన సనత్ గాడు ఎదో ఘనకార్యం చేసుంటారు స్టాఫ్ తో అంటున్నారు డీన్ అసదుద్దీన్ సర్..

ఇక్కడ గ్రాండ్ హౌస్...పుట్టిల్లు తనదయిన,కప్ దక్కించుకోలేని ఇంగ్లాండ్ జట్టులా,సనత్ అనుకున్నట్టే బేజారయి మెట్లు మీద కూలబడ్డారు..

సాయంత్రం మీటింగ్ పెడదాం!?ఓ పెద్దాయన మాటలకి

ఆ!మళ్ళీ మీటింగా...ఇప్పటికి చాలు..ఇక ఎప్పటికి ఈ ఫీట్లు వద్దు..అని నిర్ణయించుకున్నారు..

నాన్నమ్మల బాచ్ ఊపిరి తీసుకుంది హాయిగా...డ్రైవర్ కి వారిపిల్లల ఆనుపానులు చెప్పింది ఎవరూ!?అన్నది తెరపైకి రానందుకు..

ఎన్ని రంగులో...మనిషి మనసులో...

అయినా..

చిన్ని నవ్వుతో చాలు తెలుపు రంగురో...రేడియో లో పాట వినిపిస్తోంది ఇస్త్రీ బండినుంచి..

దేనికీ ఆరాటం!?ఒక్క చెట్టు అయినా జీవితాల్ని చూసేస్తుంది..రాబోయే తరానికి నీ మధురస్మృతుల్ని నీవారికి అందించాలంటే..ఈ ఆరాటం ఎందుకు!?స్వతంత్రం ఇచ్చి చూడు,బానిసత్వం నీదారి తొక్కదు అని మనసు ,మనకి చెబుతున్నట్టు లేదూ...

హ్యాపీ హొలీ...

గ్రాండ్ హౌస్ నుంచి

స్కూల్ పిల్లలనుంచి..

ముఖ్యన్గా హీరో సనత్ నుంచి...



Rate this content
Log in

Similar telugu story from Abstract