శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Inspirational

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Inspirational

చూపులు కలిసిన శుభవేళా

చూపులు కలిసిన శుభవేళా

3 mins
426


ఏమైందమ్మా!ఎక్కడినుంచి ఫోన్.?అంతా ఒక్కచోట చేరేరు,అల్లుడు కొత్తకోరిక ఏమైనా....


అరుగుమీద కళ్లనీరు నింపుకున్న సుధ,అక్క మాటలు వింటూనే లోపలికి పరుగున వెళ్ళిపోయింది.


మొదటినుంచీ ఏదో పేచీనే!అత్త ఒకలా,ఆడపడుచు ఇంకోలా,ఎవరు ఎలా ఉన్నా సర్దుకోవచ్చు పెద్దా!ఇపుడు కాబోయే మొగుడు కూడా ఇలా ఏదోటి తప్పులు చెప్తూ...పరిహారంగా లిస్ట్ పెంచుతున్నారు... రికార్డ్ చేసింది వినిపించింది.


ఇదేమైనా భారతమా అమ్మా వినడానికి..అందుకే నేను ఈ లంపటం వద్దన్నది...ఈవిడ మాత్రం నూరేళ్ళ పంట అంటూ ఏవో సూక్తులు చెబు..


అందరూ ఒకేలా ఉండరక్కా!ఆయన చాలా మంచివారు గదిలోంచి బయటకు వచ్చింది.


పౌరుషరథాన్ని అటు తిప్పు సుధా!నువ్వే మాట్లాడుకో ,ఎం లోటు పాట్లు వచ్చాయో,వస్తాయో కూడా తెలుసుకో!చూడబోతే అత్తగారిల్లు పండితుల నిలయంలా ఉంది నవ్వింది మైధిలి.


అక్కా!అనవసరంగా ఎందుకు మాట అనుకోవడం?ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుకుంటే సరి..


అది నువ్వు,నీ ఇంటివారూ చూసుకోండి!మేము అంతా బాగానే చేశాం,తాహతుకుమించి కూడా చేశాం..ఇరవై అని పెళ్లికి వచ్చినట్టు బస్ నిండా వచ్చేరు నిశ్చితార్థానికే!అప్పటికప్పుడు భోజనాలు,గిఫ్టులు,మీ వదినకు ఈ కంగారులోనే ఉంగరం కావాల్సి వచ్చిందట..ఎంత అనుకున్నా నాన్న ఒక్కరు అయిపోయారు,అన్నయ్య తమ్ముడు ఉండి ఉంటే సరైన సమాధానం చెప్పేవాళ్లు..మన ఆడజన్మకి ఏ నిర్ణయాలకీ పూర్తి హక్కులు ఉండవుగా!?


తలొంచుకు నుంచున్న సుధకు మళ్ళీ చెప్పింది..వాళ్ళు ఇంకా కాబోయే దగ్గరే ఉన్నారు. ఇక్కడ మన అమ్మానాన్న,ఇన్నాళ్లు అడిగింది ,అడగంది అన్నీ కూర్చిపెట్టేరు.


ఆ ధైర్యం,అణకువ అన్నీ కలువుకుని,మీ అత్తగారి సమస్య ఏమిటో కనుక్కుని,మాక్కొంచెం చెప్పు..స్నానానికి వెళ్తూ అంది మైధిలి.


అక్క ఏంటమ్మా !అలా అంటుంది?ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానని టెక్కు చేస్తుంది..పెళ్లి అన్నాక ఒకమాట అనకుండా అయిపోతుందా!?


లోకం చదివినదానిలా మాట్లాడుతున్నావు బానే ఉంది కానీ తల్లి!?అక్క చెప్పినట్టు విషయం కనుక్కుని,ఓ దారి చూపించు నవ్వేడు తండ్రి


మీరూ పెద్ద దానిలా భలే చెబుతున్నారు..చిన్నపిల్ల విషయం ఎలా కనుక్కుంటుంది!?పైగా అంతా కొత్త,ఎవర్నీ ఏమంటే విషయం ఎటు పోతుందో....


ఆ విషయం మనకి వర్తించదా కల్యాణి!భార్యని సూటిగా ఆడిగేరు.


మనం కొంచెం తగ్గి ఉండాలి..తలొంచుకుంది కళ్యాణి


పెద్దది ,తల వంచుకునే ఉంది.ఏమైనా ఉపయోగం ఉందా!?పాముకి బుస కొట్టే లక్షణం దేవుడే ఇచ్చాడు కళ్యాణీ!?మనకి తూగని,సరిపోని ఏ విషయం అయినా పాము కరిచిన వేలులా వదులుకోవడానికి సిద్ధంగా ఉండకపోతే,దేనికో దేవులాడుతున్నారు అన్న కుశ్చిత ఆలోచనకు వచ్చేస్తారు ఎవరైనా...అందుకే ఏది ఏమైనా ఈ సంబంధం మాకు నచ్చలేదని చెప్పేస్తాను,ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు మైధిలి తండ్రి.


అమ్మా!చూసింది,ఇష్టపడింది, వదిలేసుకోవాలంటే ఇష్టం లేదు అన్న భావన కనిపిస్తోంది కూతురు మాటలో..


ఒక్కసారే కదా చూశావు!?అలా ఎలా నచ్చేసాడు అతను నీకు ?నువ్వు చూపించిన ఇష్టం అర్థం చేసుకున్నవాడు అయితే ఫోన్లో కంప్లైంట్ల పర్వాన్ని నడిపేవాడు కాదు..


అక్కా!అందరికీ నీకులాగే జరుగుతుంది ,జరగాలి అనుకోకు.నీ ఈ పొగరుబోతుతనానికే వెంటనే వద్దని చెప్పేసేరు వాళ్ళు..ఇదే పంధా నా విషయ....


కళ్ళు ఎరుపెక్కాయి,చిన్నదానితో చెప్పించుకుంటున్నానని ఉక్రోషమా!?ఆడదాన్నయి ఓడిపోయాను అన్న ఆలోచనా!? మానిన గాయం రేగిందనా!? అక్కడ కూర్చోలేకపోయింది మైధిలి.


ఎన్ని జరిగినా నాన్న నిర్ణయమే ఫైనల్...నువ్వు ఏమో పంచేసుకున్నాను నీ కాబోయే మొగుడుతో అని నువ్వు ఊహించుకుంటూ ఉంటే...అందులోంచి బయటకు రా!కాళ్ళు పట్టుకుని వియ్యం సాధించుకోవడానికి సిద్ధంగా లేరు ఎవరూ...లోపలికి వెళ్ళిపోయింది.


చిన్న తప్పు...ఉంగరం తరువాత పెడతాము అంటే ఒప్పుకోలేదు.రేపొద్దున్న జీవితం మొత్తం ఇలాంటివి ఎన్నో ఉంటాయి..మన గౌరవం నిలబెట్టుకునేలా సమాధానం చెప్పుకోలేకపోతే...నీనుంచి రోజూ పంచాయితీ వినే ఓపిక మాకు లేదు.అమ్మ కూడా లోపలికి వెళ్లింది.


ఆడపిల్లని కని,అల్లుడింటికి పంపాల్సిన పనిలేదూ...కంటినీరు రానివ్వము,తలొంచుకోము అంటే కుదరదు అమ్మా!అన్నీ అనుభవించాలి..అది ఖర్మ అయినా..ధర్మం అయినా..సుధ గట్టిగా అంది.


లోపల అమ్మ సమాధానం కోసం ఎదురుచూస్తుంది మైధిలి.ధర్మంగా ఎంతయినా చెయ్యొచ్చు సంతోషంతో..

ఎదుటివారిని ప్రతిసారీ తలొంచుకుని పరిస్థితి తెస్తే కష్టం సుధా!ఈ పెళ్లి నాకూ ఇష్టం లేదు లోపలికి వెళ్ళిపోయింది.


నాకు కావాలి ...ఈ ఇంట్లో ,అక్కలా ఎవరూ లేకుండా...తెలీకుండా..మీకే సేవలు చేస్తూ ఎన్నాళ్లు!?

ఈ పెళ్ళీ జరగాల్సిందే అరిచి చెప్పాలని ఉంది సుధకి..

అందరి నిర్ణయం ఒకటే,తంపులమారి సంబంధం వద్దు అని.దేవుడు దగ్గర కూర్చుంది..ఎంతసేపటికీ సమాధానం దొరుకుతుంది అనిపించలేదు..అక్కతో మాట్లాడితేనె దీనికి శుభమ్ కార్డు పడుతుంది అనుకుని,అక్క గదిలోకి వెళ్ళింది..


నేను ఎం చేస్తే పెళ్లి జరుగుతుంది అక్కా!ఇలా అడగాలి అంటేనే చిరాగ్గా ఉంది.తలొంచుకుంది.


చూపులుకలిపి మాట్లాడ్డం నేర్చుకో ఎవరితో అయినా సరే!నిజాలు,మనసు రెండూ అర్థం కావు తలొంచుకు ప్రశ్నిస్తే సుధా!ఎదో పేజీలో రాసింది చదివినట్టు ఉంటుంది..


ఆ అబ్బాయి ఒక్కరోజుకే నీలో ఎందుకు చెరిగిపోని ముద్రవేసేడో చెప్పు?నీ చుట్టూ నువ్వుంటే ఇష్టపడే ముగ్గురం సొంతవాళ్ళం ఉన్నాం..ఆయన ఇవ్వాళ వచ్చాడు.అతను కాదు అనుకుంటే చెప్పకుండా వెళ్ళిపోతాడు,అవును అనుకున్నా చెప్పకుండా వచ్చి సర్ప్రయస్ అంటాడు..దేని మీదా నీకు వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదని అర్ధమయింది కూడా!అంత ఇష్టం అయితే ఈ సమస్య ఎలా తీర్చాలా అని ఓ ఆలోచన ఫోన్లోనే చెప్పేసేవాడు.అవునా కాదా!?...


అవును అన్నట్టు తలూపింది.కొంచెం ఓపిక పట్టు సుధా!వాడితో తన్నులు తినాలని,ప్రేమ పంచుకోవలని ఎం రాసి ఉన్నా మనం తప్పించలేము.ఒకటి ప్రయత్నం చేయొచ్చు.కొన్ని అంటే కొన్నిరోజులు మౌనంగా ఉండు..తప్పకుండా రిజల్ట్ ఉంటుంది.నా మాట వింటావా గెడ్డం పుచ్చుకు బ్రతిమాలింది..


అందరికీ మొదటిసారి చూడగానే,అన్నీ కుదరవా అక్కా...పట్టుకుని ఏడ్చేసింది సుధ.


సరే!ఏడవొద్దు...నీకు ఈ సంబంధం ఎందుకు నచ్చింది?ఏ విషయంలో ఇరవైయేళ్ల పాటు పెంచిన మా ప్రేమలో లోపం ఎక్కడుందో ఓ పేవర్ మీద రాసి ఇవ్వు...వద్దు వద్దు,నువ్వే ఓరెండు మూడుసార్లు చదువుకో!నీకు తప్పకుండా ఓ సమాధానం దొరుకుతుంది.మేము నీ మంచి మాత్రమే కోరేవాళ్ళం.ఏదీ తప్పుగా జరగదు..


రెండు టావుల భారాన్ని అక్షరాలతో నింపింది సుధ..కళ్ళు నెమ్మదిగా బరువెక్కాయి..ఏడింటికే నిద్ర ముంచుకు వస్తోంది.అమ్మ భోజనానికి లెగ్గొట్టబోతుంటే..వారించింది.

రేపటికి లేడిపిల్ల అవుతుంది మీ చిన్నమ్మాయి నవ్వుతూ భోజనాలు ముగించేరు.


పొద్దున్న లేస్తూనే...అక్కా బ్రష్షు..పేస్టు...టవలు...ఆంటూ రోజూలాగే ఉదయాన్ని ప్రారంభించింది సుధ..అబ్బా!ఇడ్లీ అల్లం చట్నీ వేళ్ళు నాకుతు తింటున్న కూతురుకేసి,భయన్గా చూసింది కళ్యాణీ..

అక్కా!సాయంత్రం మర్చిపోకుండా తేవాలి ముద్దిచ్చి లోపలికి వెళ్ళిపోయింది..


గదిలో డైరీ కింద రేపరెపలాడుతూ పిలిచింది రాత్రి తాను రాసిన పేపర్..మొత్తం చదివింది.చీ!నేనా అమ్మానాన్న గురించి ఇలా రాసింది అనుకుంటూ చింపేసింది,తన బాధ సాధ్యమయినంత చిన్నది అయ్యేలా,తన తప్పు మాటలు కనిపించనంత ముక్కలు అయ్యేలా...


సుధా!అమ్మ పిలిచింది.


మా అక్క ఎం చేసినా సరైనది అవుతుంది అమ్మా!కూరలు కోసి ఇస్తా పద..మన భుజాలపై చేతులు వేసి,ముందుకు నడిపించింది.


పొద్దనగా బయటకు వెళ్ళేరు.టిఫిన్ కూడా చేయలేదు మాట వినకుండా దేవుడుగది వైపుగా వెళ్తున్న భర్తకేసి విచిత్రంగా చూసింది కళ్యాణి.


దేవుడు దగ్గర బెల్లం ముక్క తెచ్చి ,కళ్యాణి నోట్లో కుక్కేరు.అబ్బాయి ఎదో మాట్లాడాలని ఇవ్వాళ మన మైధిలిని కలుస్తున్నాడు సంతోషన్గా చెప్పేరు.


ఏమన్నా అటూ ఇటూ మాట్లాడితే నాలుగు తగిలించమని చెప్పండి నాన్నా..వంటింట్లోంచి స్థిరంగా ఉంది సుధ గొంతు.



Rate this content
Log in

Similar telugu story from Abstract