శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Children

4.2  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Children

మాగాణి..మారాణి

మాగాణి..మారాణి

3 mins
374


ఎడారి పక్షితో పోలిక పెట్టుకో!!మెట్టభూమి విలువలతో పాటూ,దాని లక్షణాలు నీకు బ్రతుకులో ఎక్కడైనా అవసరం అవుతాయి...అంతేతప్ప ఎదో కష్టంలో ఉంది,బ్రతకరాని బ్రతుకు అంటూ,దానికి నీరు ఉండదు,పరిస్థితులు తట్టుకుంటుంది లాంటి ఊకదంపుడు ఉదాహరణలతో నీ రేంజ్ పెంచుకునే ప్రయత్నం చెయ్యకు..సృష్టి జరిగాక ,ఎవరికి ఏమి ఎలా ఇవ్వాలో జరిపించినవారికి తెలుసు..నువ్వేదో పరిశోధనలు చేసేస్తే,ప్రూఫ్స్ చూపిస్తే అసలు నిజాలు నీడలోనే ఉండిపోవు..కళ్ళునులుముకు చూస్తే కర్తవ్యం కనిపిస్తుంది..ఇక నువ్వు ఫోన్ పెట్టేయొచ్చు..ప్రశాంతంగా ఉందిపుడు హైమావతికి..

ఇంత సీన్ చూశాక తలతిరిగిపోయింది శ్రవణ్ కి...రైలు ప్రయాణంలో స్నేహితులు అవుతారు అంటారు.నాకేంటి!?కరడుకట్టిన టెర్రరిస్ట్ దొరికింది..అబ్బాయి అయితే విషయం కనుక్కుని వీలుంటుంది..ఈమె సాయం అడిగినా కరిచేలా ఉంది..తలకొట్టుకున్నా నవ్వు వచ్చింది..తనలోని ఈ రెండు వ్యక్తిత్వాలకి ఆశ్చర్యపోయాడు శ్రవణ్..

దానికి ఎడారిలో జీవితం ఇస్తే...నిన్ను కష్టాల సినిమా వేసుకొమ్మని దేవుడు చెప్పలేదు ఆమె ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి,నేనూ అంతేనా ...నాకూ అంతేనా....అని ఎదో ట్యూన్లో పాడుకుంటుంటే...

అందరికీ అంతేరా అర్భకా!అంతరాత్మ కూడా సెలవిచ్జింది..

రేయ్!కూర్చో సరిగ్గా..నోరెత్తితే పళ్ళురాలగొడతా

గంటకూడా కాలే ప్రయాణమ్ మొదలయ్యి,

దుంప తెంచుతున్నారు కదరా!హైమవతి రైలు ఎక్కిందిమొదలు పిల్లల్ని అదిలిస్తూనే ఉంది..

పూర్తి సైడ్ కేబిన్ వాళ్ళకి మాత్రమే తీసుకున్నట్టు ఉన్నారు..నాది అసలే ఒంటరి ప్రయాణం,పైగా ఎదురుగా సింగల్బెర్త్ నాది..తప్పించుకుని కళ్ళుమూసుకునే వీలు లేకుండా లోయర్ బర్త్..వీళ్ళు చూస్తుంటే లాస్ట్ స్టేజ్ దిగేలా ఉన్నారు..ఒకటే బాధ పడుతున్నాడు శ్రవణ్..

కంపెనీ పనిమీద చెన్నైకి వెళ్తున్నాడు శ్రవణ్..

భర్త ఎక్కినట్టు లేడు..ముగ్గురికి ఫుల్ కేబిన్ ,బలుపు ఆనుకుంటా!?నవ్వుకుంటూ...బెడ్ సద్దేపనిలో పడ్డాడు..

అన్నయ్యా!నువ్వు ఎం పేరు!?అబ్బాయి పలకరించేడు.

వాడి జుట్టుపట్టుకుని నాలుగు పీకింది..నువ్వు ఎం పేరు కాదు!?మీపేరు ఏమిటి!?అని అడగాలి..మాటకు ముందు లేదా వెనుక అండీ అనాలి..

ఓహో!వరుసలు కుదరవన్నమాట..చూడడానికి గిన్నెకోడిలా అన్నీ టర్కీ కోడి వేషాలు మళ్ళీ ముక్తాయింపు ఇచ్చుకుని,నడుం వాల్చేడు...

ఆమె కూర్చునే కునుకు లాగుతుంది..ఈలోపు అమ్మాయి అన్నయ్యా!ఏమైనా కధ చెప్పు అంటూ కాళ్ళదగ్గర కూర్చుంది..

అరె!బంగారం..ఇక్కడ కూర్చో అంటూ లేచి కూర్చుని,తన దగ్గర ప్లేస్ ఇచ్చాడు.

చేపల కధ చెప్పండి అబ్బాయి వచ్చి కూర్చున్నాడు..

ఒరేయ్!చిట్టిగుమ్మడికాయ్!మనకి అండీ హుండీ అవసరం లెవ్వు కానీ,నీపేరు ఏంటిరా...అడిగేడు శ్రవణ్

నేను మౌసమి,వీడు ముకుంద్..మా అమ్మే పెట్టింది పేర్లు పిల్ల గర్వన్గా చెప్పింది..

అందరికీ అమ్మే పెడుతుంది..లేకపోతే నాన్న..అదీకాకపోతే అమ్మమ్మా,తాతయ్యా,నాన్నమ్మ..

ఆగు ఆగు ఇంతమంది,ఒక్కరికి ఉంటారా!?ఉండొచ్చా!?

ముకుంద్ ప్రశ్నకి ఆశ్చర్యపోయాడు శ్రవణ్..

ఎం..మీ రాక్షసి,నాలుక్కరుచుకుని...మీ అమ్మ మీకు వీళ్ళందర్నీ పరిచయం చేయలేదా!?

ఆవిడకి ఉంటేనేకదా!?పరిచయం చేయడానికి...మౌసమి మూలిగింది..

అంటే!?

అంటే..ఉంటే ఎం లేవు అబ్బాయి..మాకు ఎవ్వరూ లేరు,రారు,ఇకపై ఉండరు..మేము ముగ్గురమే కొత్తలోకం అంటుంది అమ్మ..

మీ అమ్మకు మనుషులు నచ్చరా!ఏకాకినా మీ అమ్మ!? పెద్దబడాయిగా మొత్తం కేబిన్ బుక్ చేసుకుంది..నాన్నని డబ్బులు దాయనిస్తుందా మీకోసం...

ముగ్గురమే అంటే...నాన్న అంటావూ..మీది చెన్నై నా!?తెలుగు అర్థం కాదా..మౌసమి మాటలకి నవ్వేడు శ్రవణ్.

పన్నెండు అయినా పిల్లలు మాట్లాడుతూనే ఉన్నారు..శ్రవణ్ వింటూనే ఉన్నాడు..హైమమాత్రం మంచి నిద్రలో ఉంది..

వాగి వాగి ఆకలేస్తోంది..ముకుంద్ అమాయకత్వానికి నవ్వి,చపాతీ అందివ్వబోతుంటే...

బాక్స్ మూతతీసి,పెరుగన్నం తీసుకొచ్చింది..

ఏసీ భోగి,పైగా శీతాకాలం పెరుగన్నం మంచిది కాదండీ!ఇవి తిననివ్వండి నెమ్మదిగానే అన్నాడు..

పిల్లలవంక చూసింది..చపాతీకేసి చూస్తున్నారు వాళ్ళు..ఒక్కటి చాలు,తరువాత పెరుగన్నం తింటే బాలన్స్ అయిపోతుంది..నవ్వింది

మంచి అమ్మ!అన్నారు కానీ చపాతీపైనే పూర్తి దృష్టి ఉంది..

పడుకోవడానికి వెళ్ళిపోయింది...పిల్లలు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు..కూర్చుని కునుకు తీస్తున్నాడు శ్రవణ్..

ఎవరో తట్టినట్టు అయితే ఉలిక్కిపడ్డాడు..ఇలా నిద్రపోండి అంది లోపలి సీట్ చూపిస్తూ..పిల్లలు ఇక్కడే బావుంది అంటున్నారు..మీరు పూర్తి కేబిన్ వాడుకోండి..

మొదటిసారి నవ్వింది

బావుంది..ఇచ్చిన ఆఫర్ మరియు నవ్వు..హైమ పిల్లల దగ్గర కూర్చుంది..

విశేషంగా ఇప్పుడు నిద్ర రావడం లేదు..విశాలం ఒంటరితనాన్ని పెంచుతుందని మొదటిసారి చూస్తున్నాడు...

మళ్ళీ తన ప్లేస్ కి వచ్చేసాడు..పిల్లలు నిద్రపోతున్నారా అయ్యో!లోపల నిద్రపుచ్ఛాల్సింది కదా!!

పర్లేదులేండి..కిటికీలోంచి బయటకు చూస్తోంది..

చీకటి అంతా హైమగారు..ఎం కనిపిస్తుందని చూస్తున్నారు..చివరగా కూర్చుంటూ అడిగాడు

చిరుదీపం కనిపించినా పండుగే మాకు..నవ్వింది కానీ,ఎదో బాధ కనిపిస్తోంది..

మీకు ఎవరూ లేరా...

ఎందుకులేరు!?వీళ్ళకినేను,నాకు...నాకు

ఎవర్నయినా ఇష్టపడ్డారా...!?

ప్రాణంగా!!కానీ తమవారినే సొంతవాళ్ళు అనుకోలేని మూర్ఖుడిని ఎందుకు ఇష్టపడ్డానా అని ఇప్పుడు ఆలోచిస్తున్న..

ఈపిల్లలూ...

నాకు సొంత బోటిక్ ఉంది..మూడేళ్ళ ప్రేమ మాది..వీళ్ళ అమ్మని, కట్నం బాకీ కారణాన వధించబడింది..

వీళ్ళనాన్న....

ఏమైంది!?ఎందుకు ఏడుస్తున్నారు...ఆయన బానే ఉన్నారా..

ఆయనే వీళ్ళ నాన్న..!పిల్లలతో అంకుల్అనిపించికుంటూ

ఎదో సాకుతో వచ్చేవారు..చెల్లెలి పిల్లలంటూ పరిచయం చేసి,దీనికి బట్టలు కొంటూనే ఉండేవారు..నాకు అనుమానం రావాల్సింది,కానీ ఇష్టం పెరిగింది..నేను మహారాణి కాలేజ్లో పీజీ చేసాను..నావాళ్ళు ఎవరో నాకు తెలీదు..ఇలా ఈయన మాటలకి అంతా నావాళ్ళు అన్నట్టు అయింది..ఇప్పుడు వీళ్ళు మాత్రమే పూర్తిగా నావాళ్ళు..ఓ అనాధకి,ఇద్దరు అనాధల్ని పెంచడం ఎలా సాధ్యం!?అవుతుందంటారా..తెలిసున్నవాడిని అన్నట్టు చనువుగా అడుగుతుందా లేక ఒంటరితనం పెరిగిందని హిస్టీరిక్ గా మారి అంటోందా!?శ్రవణ్ కి బెరుకు మొదలయినందుకు సిగ్గుపడ్డాడు..

ఎందుకంటే ఇతని పరిస్థితి గమనించిన ఆమె,పిల్లల్ని తీసుకుని కేబిన్లోకి వెళ్ళిపోయింది..తెర వేసుకుంది..ఆమె తన్ని తాను పరాభవించుకున్నందుకు సిగ్గుపడి వెళ్లింది..

నా మొహం మీదే తెరేస్తుందా!?అవమానంతో నిద్రపట్టలేదు శ్రవణ్కు..

మొత్తానికి ఇద్దరికీ నిద్రలేదు..నాలుగు అవుతుండగా మెలకువ వచ్చింది ....

ప్లీస్,తెలీని ఊళ్ళో వీళ్ళతో ఎలా ఉండగలను!?ప్రస్తుతానికి నాకు నేనే భారం,ఇప్పుడు వీళ్ళకోసం ఎలా ...!?ఎందుకిలా మోసం చేసేవ్! .పదే పదే అంటూ ఏడుస్తోంది...

ఏడింటికి చెన్నైలో ఆగింది ట్రైన్..అంతా దిగేస్తున్నారు..వీళ్ళు మాత్రం అలా కూర్చునేవున్నారు..

బై శ్రవణ్...మౌసమి చెయ్యి ఊపుతుంటే గుమ్మందాకా వెళ్లిన ప్రాణం,ఇక ముందుకు వెళ్లలేకపోయింది..

లోపలికి వచ్చేడు..దిగండి హైమ!మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పండి..

నాన్న ఇక్కడికి వస్తానన్నారు..ఇప్పుడు ఏమైందో..ముకుంద్ చెబుతున్నాడు..హైమ అలా కూర్చునే చూస్తుంది..

చెంప చెళ్లుమనిపించాడు శ్రవణ్..

ఈలోకంలోకి వచ్చింది హైమ..నాన్నకి కుదరదట ..

మనమే వెళ్ళాలి ,త్వరగా పదండి..దిగండి దిగండి!కంగారుపెట్టింది..

వెంటనే మీకు ఎం సాయం చేయలేను..నా ఫ్రెండ్ వస్తాడు..వాడితో వెళ్ళండి..వాఅమ్మగారు చాలా మంచిది..అర్థం చేసుకుంటుంది..ఒకవారంలో నేను తప్పకుండా మీరున్నచోటికి వస్తాను..నన్ను నమ్మి వాడితో వెళ్ళండి..

చేతులు జోడిస్తున్న అతనిసంస్కారానికి ,తలొంచుకుండా

ఉండలేకపోయింది..

పైగా తనను ,తన పిల్లల్ని ఇంత తెలివిగా వదిలించుకున్న తాను ఇష్టపడ్డవాడు చేసిన మోసంతో,వేరే దారి వెంటనే కనపడడంలేదు హైమకి..సరే!అంది

కొత్త ప్రయాణం మళ్ళీ మొదలైంది..ఇక ఎగరడం నావల్లకాదు..గూడు చూపించమంటూ దీనంగా వేడుకుంటోంది మనసులో...

హిమా!తీయని పిలుపుకి ఆగింది..ఇది మన మొదటి కలయికకి నేనిస్తున్న చిన్నబహుమతి..తనమెడలోని గొలుసుని,ఆమె అంగీకారం అవసరంలేకుండానే వేసేసేడు..

అన్న...అనబోతున్న ముకుంద్ నోరు నొక్కాడు శ్రవణ్

ఇక నాన్నా అనాలి..ఈనాన్న ఇప్పుడు కొన్ని రోజులు పారిపోతాడు..కనిపించడు..ఏమనుకోవద్దని అమ్మకి చెప్పండి..తరువాత నాన్నమ్మ తాతయ్య దగ్గరికి వెళ్లిపోదాం. మీపేర్లు మళ్ళీ పెట్టిస్తా వాళ్ళతో..సరేనా!కళ్ళు ఆమెకళ్ళతో,చేతులు పిల్లల చేతుల్లో కలిసాయి..



Rate this content
Log in

Similar telugu story from Abstract