శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

ఓ(వా)డిపోయిన బ్రతుకు

ఓ(వా)డిపోయిన బ్రతుకు

4 mins
385


అంతా సమానం.మనమంతా మనుషులం ముందు,ఆ తరువాతే ఉన్నోడు లేనోడు...ఆ కులం ఈ కులం..నలుపు తెలుపు కొంతమంది దేశోద్ధారకుల,కుటుంబవిలువలు ఈ రకంగా మేకతోలు కప్పిన పులిలా గాండ్రిస్తాయి..తనదాక వచ్చాక తలపోటుకి మందు రాసుకోవాలి కానీ,మంచి మాటలకి విశ్రాంతికి తగ్గుతుంది ఏమిటి అంటారు...


సుమిత్ర,కనకారావు దంపతుల్ని ఏరికోరి దేవుడే కుర్చేసేడు.పెద్దోళ్లకి పెద్ద శ్రమ లేకుండా కాలేజీలో చదువుతున్న ,ఎక్కడా కింగకుండా ఎంక్వయరీ చేసిమరీ ఒకే కులం,పెక్కు ఆస్తులు గలవాడిని ప్రేమించిమరీ, పెద్దవారి సమక్షంలో భారీ ఖర్చుతో ఒకటయ్యారు..


పెళ్లికి పంచిన బహుమానాలకి బాహుబలి సినిమా ఖర్చు దాటేసింది..ముక్కు మీద వేలేసుకున్న అబ్బాయి, అమ్మాయివైపు ఊరి జనం,సెంటర్ లో విగ్రహాలు,పుస్తకాల్లో పాఠ్యాంశాలు చేయలేదు కానీ,వారి కథని ఎదుగుతున్న పిల్లలకి గీతలా బోధించేవారు..తలలు ఆడించేవారూ ఉన్నారు.తోక ఝాడించినవారూ ఉన్నారు.


ఇహ సుమిత్రకి కుందనపు బొమ్మ పుట్టింది..లేదు...రెండిళ్లలో డబ్బు ఏరుల్లా ఎండు,పండు పళ్ళ దుకాణానికి,కుంకుమ పువ్వు కోసం కాశ్మీరుకి కన్యకుమారికి పారింది.ఐదోనెలని పుట్టింటి సీమంతం,ఏడుని మెట్టింటిసీమంతం అంటూ, ఇండియా తమ కబుర్లతో ఇగిరిపోయేలా ఖర్చుపెట్టి చేసేరు...ఫలితంగా కుందనపుబొమ్మ అపూర్వగా పెరిగి పెద్దదయింది..


అందరూ పనోళ్లు అయితే పందిరి కోసం పిచ్చికలు చూసినట్టు,కాలేజీలో బోల్డుమంది ఎనకపడ్డా...ఓ లేనింటి అబ్బాయిని ఇష్టపడింది అపూర్వ.


వినయ్ మంచి అబ్బాయి.మధ్యతరగతి కుటుంబం. అతని అమ్మానాన్నలు హారతులు పెట్టేవారు అపూర్వ అడుగుపెట్టినపుడల్లా..ఎంత ఇష్టపడ్డాడో అమ్మాయికి చెబుతూనే ఉండేవాడు.నీకూ నాకూ ఆకాశం భూమి అంటూ..


ప్రేమించినపుడు ఆకాశంలో ఉన్నానని తెలీదా అడిగింది వినయ్ని.


మీవాళ్ళు రాత్రి మా ఇంటికి వచ్చేరు.హైద్రాబాద్ లో ఉద్యోగం,ఫ్లాట్ ఇప్పిస్తారట.నెలకి ఖర్చులకు పదివేలు పంపిస్తారట..వినయ్ చెప్పుకుంటూ పోతున్నాడు


అలా ఎందుకు?నా వాటా ఆస్తి తీసుకొచ్చేస్తాను అంది ధీమాగా


వద్దొద్దు.ఇవన్నీ మాకు మాత్రమే దక్కుతాయి.నువ్వు వాళ్ళకి తలొంచుకున్నాడు..


ఓహో! యుద్ధంలో దిగకుండా శరణు కోరావా???


నేను కాదు..మా వాళ్ళు కూడా అడగలేదు.మీరే ఇస్తామంటున్నారు..కొంచెం రుబాబుగానే అన్నాడు


నేను నీకు చుట్టాన్ని కాదు.నా వల్ల తప్ప నీతో మావాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు.ఇంకో ముఖ్య విషయం నువ్వు తీసుకోబోయే ఏ ఆస్తి,నువ్వు కష్టపడడంవల్ల వచ్చింది కాదు...ఎలా తీసుకుంటావ్?సరే!తీసుకోవద్దు అంటే మానేస్తావా??సూటిగా అడిగింది..


ఉత్తినే వస్తుంటే..ఎందుకు వద్దనాలి?


ఉత్తినేకాదు!నిన్ను నమ్మినందుకు,నన్ను నా వాళ్ళకి అమ్మేశావ్..ఛీ!..


ప్రపంచంలో ప్రేమికులు అందరూ ఒకటి అయితే..ప్రేమకి గుడి కట్టేవారు..అంత పెద్ద మనసు మనవాళ్ళకి లేదు...విసవిశా వెళ్లిపోతున్న అపూర్వ దగ్గర చివరిగా,తన గౌరవం నిలుపుకునే ప్రయత్నం చేసేడు..


నాకు మనసు,ఆస్తి రెండూ ఉన్నాయి.మనం పెళ్లి చేసుకుందామా?


ఎవరి అంగీకారం లేని పెళ్లి,ఓ పెళ్ళేనా??వెటకరించబోయాడు.


ఇంకనువ్వు నా ముందు ఎం మాట్లాడడానికి పనికిరావు..గుడ్బై..వచ్చేసింది అక్కడనుంచి.


ఇంటికి రాగానే..సుమిత్ర ఎదురొచ్చింది.ఎక్కడికి వెళ్ళేవే!?పొద్దునుంచీ ఎన్ని సార్లు పెళ్ళివారు నీకోసం ఆడిగేరో తెలుసా??


పెళ్లా!?ఎవరికి?ఎందుకు?పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ అడిగింది.


హై..లేచి నుంచున్నాడు ఓ పద్దెనిమిదేళ్ల అబ్బాయి..అబ్బాయి..ఓ ముసలాయన కూర్చుని ఉన్నారు..


హై వాళ్ళని పలకరించి,నమస్తే తాతగారూ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.


పెళ్ళివారు కూర్చుని ఉంటే ..ఎక్కడికి తల్లి..ఇలా వచ్చి కూర్చో అంది సుమిత్ర ..


మాకు చాలా బాగా నచ్చింది..వాళ్లిద్దరూ మురిసిపోయారు.పెద్దాయన అమ్మాయికి ఇష్టమో లేదో కనుక్కున్నార?ఆడిగేరు


చిన్నపిల్ల దానికేం తెలుస్తుందండీ ...మనం చూసినది మంచి సంబంధం అని భరోసా ఇస్తే చాలు అంది..సుమిత్ర అత్తగారు,


మాకూ ఒక్కగానొక్క కూతురు..అంతా దానికే..మీకు కూడా ఇక ఒక్కడే ,ఆడపిల్లకు అన్నీ ఇచ్చేసేమ్ అంటున్నారు..అయినా పెళ్లికి ముందే అమ్మాయికి ఇచ్చేది రాసేసుకుంటే..ఇద్దరికీ మంచిదన్నాడు కనకారావు ..


మేము అన్ని పత్రాలు ఎప్పుడో రిజిస్ట్రీ చేయించేసేమ్.పిల్ల ఇంట్లోకి అడుగుపెట్టడమే తరువాయి.నేను హిమాలయాలకి వెళ్లిపోతాను.పిల్లలు అమెరికా వెళ్ళిపోతారు.అబ్బాయి,అమ్మాయి కొన్నాళ్ళు ఎక్కడైనా తిరిగి వస్తారు.తరువాత ఇంక ఇక్కడే ...తాత వివరంగా చెప్పేడు.


పెళ్లి జరుగుతుందా?శాంతిభద్రతల ఒప్పందాల?ఎం అర్థం కాలేదు అపూర్వకి.ఇక్కడ తోబుట్టువుల లేరు.అత్తింటికి వెళ్తే అంతా ఖాలీయేనా..దీనికన్నా ఎవరింట్లో అన్నా పనికి కుదరడం నయం..పరివిధాల ఆలోచనలు పరుగెడుతున్నాయి ఆమెలో.


అంతా మాట్లాడుకుని తాంబూలాలు తీసుకుని వెళ్లిపోయారు.సాయంత్రం అమ్మతో అంది ..అందులో పెళ్ళికొడుకు ఉన్నట్టు లేదే?


ఆ అబ్బాయికి అర్జంట్ పని ఉండి ఊరు వెళ్ళేడట..నెక్స్ట్ వీక్ నీ పెళ్లి..నీకు ఇష్టమైన రోజునే పెట్టాం ముహూర్తం శుక్రవారం...నా బంగారం అంటూ మేటికలు తీసింది.


అబ్బాయి ఫోటో చూడొచ్చ..ఇక అడగకపోతే పెళ్లిలోనే చూపించేలా ఉన్నారని,అడిగింది.


టీవీ దగ్గర పెట్టాననుకుంటా,ఎం అత్తయ్యా?అబ్బాయి ఫోటో ఎక్కడ చూసేరు మీరు,గుర్తుందా!?


సుమిత్ర!నాకసలే మతిమరుపు.ఎక్కడ ఉందొ!?అయినా అపూర్వ నువ్వు అదృష్టవంతురాలివే!నేను నాకన్నా,మీ నాన్న తనకన్నా,నువ్వు అంతకన్నా ఉన్నింట్లో పడుతున్నావ్!బంగారపు బుట్టలో మోస్తాడట మేనమావ నిన్ను,పొద్దున్నే ఫోను చేసేడు..నీ పెళ్లికి వెండి కంచాలు పంచుతుంది మీ పిన్నీ..నీకు ఏమి లేవనీ!అయినా ఏడువారాల నగలు చేయిస్తుంది మీ అత్తయ్యా..సృష్టిలోని నీ అంత పెట్టిపుట్టింది లేదే!మురిసిపోయింది నాన్నమ్మ..


అటు వినయ్,ఇటు ఇంట్లో నన్ను అర్థం చేసుకోకుండా చంపుతున్నారు..ఏదోటి ఎడవండి అంటూ బెడ్రూంకి వెళ్ళిపోయింది.ఏడుపు రావడం లేదు.అసలు అబ్బాయిని చూడకుండా నిశ్చితార్థమా!?


ఇంతలో వాట్స్ అప్ మెసేజ్ వచ్చింది.హాయ్ అదే సారాంశం.కొత్త నెంబర్..పళ్ళురాలిపోతాయి రిప్లై ఇచ్చింది..


వెంటనే dp లో పువ్వులకి బదులు,ఫామిలీ ఫోటో వచ్చింది.పొద్దున్న వచ్చిన తాతగారూ,పిల్లలు,ఓ పెద్దాయన..


నిజంగా నచ్చానా!?ప్రెషర్ లేదు కదా..


ఆస్తులు బాగా కలిసాయిగా?ఇంకేం కావాలి?


ఓహ్!నువ్వు కూడా వాళ్ళ టైపేనా?నాకు నా మనసుకు దగ్గరి మనిషి కావాలి..


ఈ మెసేజ్ తన వయసువారికి ,ఆలోచనకు తగ్గట్టు అనిపించింది..ధైర్యంగా అడిగింది,మిమ్మల్ని చూడలేదు.పిక్ పెట్టండి..


అయ్యో!నా అంటే మన స్టేటస్ ఇప్పటికి ఓ యాభైమంది చూసుంటారు.నువ్వు అందులో లేవా?


తరువాత ఎదో ఉన్నా,చదువుదాం లే అనుకుని,స్టేటస్ చూసింది..కాళ్ళకింద భూమి కంపించింది అపూర్వకి..దగ్గరగా నాన్న వయసు ఉంటుంది అతనికి.నిజమేనా!?గిల్లుకుంది. మెసేజ్ వచ్చింది.


చూసే ఉంటావు..ఎలా ఉంది మన జంట?


మీరు..ఇంక ఆపై మాట్లాడలేదు.కళ్ళు తెరిచాక..సుమిత్ర దిష్టి తీస్తూ...వారంలో పెళ్ళి..ఇంక తిరుగుళ్లు,బయటి తిండి పెట్టుకోకు..తూ!,అను అంది గుప్పిట నోటి దగ్గర పెడుతూ


అమ్మ !అబ్బాయి కాదు..అతను!,అతను...నా పెళ్లి అంత పెద్దోడితోనా??


అవును పెద్దోడు వయసు లోనే కాదు ఆస్తిలో కూడా.మనకన్నా పదిరెట్లు ఎక్కువ.వయసంటావా!?నలభైకి దగ్గర.భార్య భర్తతో సగం అంటారు.మేమంతా చేయని నిజం చేయని సత్యాన్ని,నువు రుజువు చేస్తున్నావు..


అమ్మ!పిచ్చా నీకు..నాకు అతనితో...ష్!తాతయ్య లోపలికి వచ్చేడు.సుమిత్రా!మనవడు వచ్చేడు.అమ్మాయితో మాట్లాడాలట..షాపింగ్ అంటున్నారు ఏదో!?


చక్కగా చీర కట్టించి,కార్ ఎక్కించింది..నా పేరు వినీత్.నాకో అన్నయ్యా,అక్క..అన్నయ్యా,వదినా కాలం చేసి పదేళ్లు అవుతుంది.అప్పటినుంచీ నేను,తాతయ్య పిల్లల్ని చూసుకుంటున్నాం.అక్క ఎప్పుడైనా వచ్చి,ఓ వారం ఉండి,వెళ్తుంది..ఇప్పటివరకూ నేను సిటీలోనే ఉన్నాం.ఇక ఈ ఊరు వచ్చేస్తే బావుంటుంది.పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ..వాళ్ళకి అమ్మ కావాలి.నాకు తానే కాళ్ళు కడగాలి అంటుంది.శ్రేయ....తాను అన్నయ్య కూతురు.అబ్బాయి తరుణ్..పీజీ చేసి,మా బిసినెస్ పనులు చూసుకుంటున్నారు.నేను నిన్నటివరకూ వాళ్ళకి గార్డియన్.పెళ్లి అయితే అమ్మానాన్న స్థానంలోకి మారుతాం..మీకు ఇష్టమేనా?


నాకు..


ఆ!ఇంకో విషయం ఇప్పటివరకూ నాతోనే PA తోపాటు స్నేహితుడూ ఉన్నాడు.ఇవ్వాళ తన కొలీగ్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు.మీరే సంతకం పెట్టాలి అన్నాడు.మనం ఎలానో ఒకటి అవ్వబోతున్నాం.వాడికి భరోసా ఉంటుంది బాస్ ఫామిలీ నాతోపాటు ఉందని.లవ్ మ్యారేజ్ లో గొడవలు కామన్ ఉంటాయిగా...వాళ్లింట్లో ఎవరూ ఒప్పుకోలేదు.బహుశా వాళ్ళు మనతోనే ఉండొచ్చు.అదే నీకు నచ్చితేనే!లేదంటే వేరే చోట ఇల్లు చూసుకోమంటాను...కార్ ఆపేడు..దిగు అప్పు..చాలా ప్రేమగా అనిపించింది పిలుపు.


మేడమ్ వచ్చేరు..శ్రుతీ!నమస్కారం పెట్టు అంటున్నాడు పీఏ..కాళ్ళకి నమస్కరించారు ఇద్దరూ...నాకు లేదా మర్యాద?నవ్వుతూ అడిగేడు 


ఎంత పెద్దరికం ఇరవయ్యేళ్ళకే...పెద్ద ఆస్థితోపాటూ లభించిన బోనస్కి,నవ్వాల ?ఏడవాలో? అర్థం కాలేదు.


రా అప్పు!ఆఫీసులో మామూలు మర్యాద జరగలేదు..సర్,మేడమ్ అంటూ...వీళ్ళ పెళ్లి అన్నంత హంగామా చేసేరు..అపూర్వకి తెలియని మర్యాదలు కావు.కానీ ఇవి బావున్నాయి.వయసయినా ..నాకు జనంతో దగ్గరితనం పెరిగింది అనుకుంది.


సంతకాలు అయ్యాక,అమ్మ చేయించిన బరువైన గొలుసు ,శృతి మెడలో వేసింది.


మేడమ్!దీనికి తగము మేము అంటున్న పీఏ ను వారించింది.


అన్నయ్యా!మీరు ఇక నుంచి మాతోనే ఉంటున్నారు.మీ ట్రిప్ అయ్యాక ఇంటికి వచ్చేయండి..అజ్ఞాపిస్తున్న తనకి తానే కొత్తగా అనిపించింది...


వెల్దామండీ!కాబోయే భర్తవైపు తిరిగి అంది.


ఇక్కడే ఉండు అప్పు..కార్ తీసుకు వస్తాను.మీరు కూడా ఉండండి.నేనే ఇంటిదగ్గర దింపుతాను.కార్ తీసుకురావడానికి వెళ్ళేడు వినీత్.శృతి భర్తకు అపుడే ఎంతో బుద్దులు చెప్పేస్తుంది.


ఓయ్!అణా పిలుపుకి వెనక్కి తిరిగింది.వినయ్ ఫ్రెండ్ రాజు.


ఓహో!ఇలాటి రాచరికం ఎలగబెడదామనా?వినయ్ కి ఫ్లాటూ,పదివేలు అని వదిలించుకున్నావు..పెద్ద కుటుంబం,చిన్న బుద్ధులు..నిన్ను మర్చిపోలేక,పట్నం పోయాడు ఉద్యోగానికి..కూతుర్లా చూసుకున్నారు వాళ్లింట్లో నిన్ను,ఆస్తుల మోజులో ఎంతమంది బతుకులు నాశనం చేస్తారే మీరు..పాపం పిచ్చోడు..వాడి ఉసురు తగలక మానదు..వినయ్ ఫ్రెండ్ శాపాలకి,నవ్వింది..


ఆ ముసలోడేనా నీ మొగుడు..ఎం సుఖపడతావ్?


ముసలోడు అన్నా మాటలు ,గంటల్లా మోగుతున్నాయి..జరుగుతుంది తప్పా?ఒప్పా?


అపూర్వ ఆలోచనకు భంగం కలిగిస్తూ...ఆ!!ఇంకో విషయం రేపటినుంచి అక్కడకూ ఇక్కడకూ తిప్పను నిన్ను.మీ అంకులా,నాన్నా ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు.నీ వయసు గుర్తు చేస్తూ..నన్ను తక్కువ చేస్తుంటారు.ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు.శృతి తోడు ఉంటుంది..ఒక విషయం బాగా గుర్తు పెట్టుకో అప్పూ!నాక్కూడా నువ్వు కావాలి..అంతే!


సన్యాసి అవ్వాలనుకున్నవారికి నాలాంటి వయసున్న భార్య,భర్తతో,కుటుంబంతో ఆనందంగా గడపాలి అనుకున్న నాకు పెద్దవాళ్లుగానీ,నువ్వు కానీ ఏమీచ్చావు దేవుడా...కళ్ళల్లో నీళ్ళు ఇపుడు కూడా రావడంలేదు..



Rate this content
Log in

Similar telugu story from Abstract