శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Children Stories Inspirational Children

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Children Stories Inspirational Children

బాల్యపు ఊయల

బాల్యపు ఊయల

3 mins
353


ఇంత పొద్దెక్కుతున్నా నిద్ర ఏంటి....దున్నపోతుల్లా ఎలా దొర్లుతున్నారో ...రానురాను వీళ్ళ నిద్ర గంటలు శృతి మించుతున్నాయి... ఎంత సెలవులైతే మాత్రం ఇంత పొద్దెక్కేదాకా పడుకోవాలా....నువ్వుకూడా వాళ్ళని చెడగొడుతున్నవ్..... టైం కి రోజు నిద్రలేపే బాధ్యత నీదే కదా....విరుచుకు పడ్డాడు రమేష్....

బావుంది!అది రోజు వాళ్ళకి స్కూల్ ,మీకు ఆఫీస్ ఉంటే సంగతి...ఇపుడు నా పని తడిచి మోపెడవుతుంది....ఇంట్లో ఉన్నపుడైనా సాయం చెయ్యొచ్చుగా.... వాళ్ళని లేపే సంగతి మీరు చూసుకోండి....నిక్కచ్చిగా చెప్పి అక్కడినుంచి వంటగదికి వెళ్ళిపోయింది...

లేవండిరా...తొమ్మిది అయ్యేవరకూ పడుకుంటే ఇంక దినచర్య ఎపుడు? చదువు ఎపుడు అంటూ మంచం మీద నుంచి లాగి,కింద నుంచోబెట్టేడు ఇద్దరినీ....

స్ప్రింగ్ డాన్స్ చేసేడు కొడుకు నిఖిల్ ,అలా నిలబెట్టేసరికి...

అన్నయ్యా! భీమ్కి లడ్డు అంటే ఎందుకు అంత ఇష్టం... నాకయితే... ఆ...ఆవులిస్తూ ఒళ్లువిరుచుకుంది లాస్య....

ఎపుడూ టీవీ,తిండి ఇదే గోల....చదువు సంధ్య అస్సలు లేదు...ఇవ్వాళ సోమవారం రా...మీకు క్లాస్లు ఉన్నాయి తెలుసా....ఇంకోసారి వీపుమీద ఇచ్చేడు ఇద్దరికి

మత్తువదిలి,స్నానాది కార్యక్రమాలకు బయలుదేరేరు పిల్లలు...

మీపని చేసుకోక ,ఎందుకు ఎపుడూ పిల్లల వెనకాల పడతారు...ఇపుడు వాళ్ళకి స్కూలే సెలవులిచ్చింది....మళ్ళీ ఎపుడూ తీస్తారో,అసలు ఈ సంవత్సరం తీస్తారో ,తియ్యరో కూడా తెలీదు...దీనికి అంత రాద్ధాంతం ఎందుకు?

రాద్ధాంతమా నాది....ఆన్లైన్ క్లాస్ లు జరుగుతున్నాయి...మీవాడు సరిగా అట్టెండ్ అవ్వకపోతే tc లో నాట్ సాటిస్ఫ్యాక్టరీ అని రాస్తారంట.... పైగా ఫస్ట్ టర్మ్ కట్టండి అని నోటీస్ కూడా ఇచ్చేరు...పిల్లల్ని స్కూల్ డ్రెస్ వేసే ఫోన్ ముందు కూర్చోబెట్టాలంట....నోట్ బుక్స్ అన్ని అప్డేట్ ఉన్నాయో లేదో మనం రోజూ చెక్ చేసుకోవాలట.....మీలో ఎవరొకరు పిల్లలతో పాటు క్లాస్ లో ఉండాలట...

ఏంటి ?వీళ్ళు చెప్పే రెండు మూడు క్లాస్ లకి అపుడే టర్మ్ కట్టాలా....

మరందుకేగా ? ఈ బాధ...చూడు ...ఇపుడు ఆఫీస్ కి ఇంత కష్టపడి వెళ్తుంటే సగం జీతమే ఇస్తానని డిక్లేర్ చేసేరు....అందులో వీళ్ళకి టర్మ్ పోను,ఇంటి ఖర్చు ,నా బయట ఖర్చులు వెళ్ళాలి....ఈ టైం లో వీళ్ళు బాధ్యతగా చదవకపోతే ఎలా...కొంచెం బాధగా అన్నాడు భార్యతో...

నిజమేనండి.... నేను ఆలోచించలేదు...ఎదో పిల్లలులే అనుకుంటున్నాను....రేపటినుంచి జాగ్రత్తగా నేను దగ్గరుండి మరీ క్లాస్ అట్టెండ్ అయ్యేలా చూస్తా ఇద్దరినీ,అనడంతో....థాంక్యూ శ్రీమతీ అంటూ....కాఫీ పురమాయించి టీవీ దగ్గర కూర్చుండిపోయాడు....

బావుందిరా....మీ సంగతి....అంటే ఇంట్లో ఇది,బయటకు వెళ్లి నువ్వు కష్టపడుతున్నారు కాబట్టి ,మీ ఉద్దేశ్యంలో పిల్లలు మీకు ఇప్పటినుంచే చేదోడు వాదోడు గా ఉండలనుకుంటున్నారన్నమాట....అవునా? ...తండ్రి గదిలోంచి బయటకు వస్తూ అడిగేడు రమేశుని...

అదికాదండి...నాన్నా...అనబోయాడు,కానీ ఆపేడు తండ్రి...

నేను చెప్పేది శాంతం విను...నువు కూడా వసంతా...చిన్నపుడు మీరు ఎలా పెరిగి ఉంటారో మీకు గుర్తుండే ఉంటుందిగా! ఇంట్లోంచి బయటకు వెళ్తే ,ఎపుడూ తిరిగి వస్తారో తెలీదు...ఎంత సేపని ఎదురు చూసేవాడిని నేను ...ఒక్కోసారి దీపమ్ పట్టుకుని ఎదురోచ్చేవాడిని.....నువ్వు మాత్రం కులసాగా నడుచుకుంటూ వచ్చేవాడివి...సెలవురోజుల్లో నీ కన్ను 10 అయితేగానీ తెరుచుకునేది కాదు...

మీ నాన్నమ్మ..ఎదిగే వయసురా వాడిది కొంచెం సేపు పడుకోనీ....అని మందలించేది నన్ను...మీరు చదివింది తక్కువ,ఆడుకుంది ఎక్కువ...స్కూల్ కి వెల్లమంటే గోళీలు ఆడుతూ ఎన్నిసార్లు నాకు దొరికుంటావు?....నేను ఎన్ని సార్లు కొట్టి ఉంటాను?.... ఊరు మొత్తాన్ని హాయిగా చుట్టొచ్చేవారు... ఈ మధ్యలో ఎన్నెన్ని పలకరింపులు, ఎన్ని స్నేహాలు,ఎన్ని తాయిలాలు,ఎన్ని దెబ్బలు...అన్నీ మర్చిపోయావురా నువ్వు!?

ఆలోచించి చూస్తే ఇపుడు నా మనవలికి అలాంటి జీవితం లో మాధుర్యం రుచి చూపించారా మీరు...పక్కింటికి పంపిస్తే...రాసుకు పూసుకు తిరగకండి అనో,వాళ్ళు మనింటికి వస్తే మీ బొమ్మలు దాచేసుకోండి అనో పిల్లల్ని తప్పుడు నడక నడిపిస్తున్నారు...

బయటకు తీసుకువెళ్తే మీ చెప్పుచేతల్లో ఉండాలి....

ఇంట్లో ఆజ్ఞలు...అంటే మీరు పిల్లల్ని బానిసలు చేసుకోవడం కోసం కన్నారా?

పిల్లలు అంటే స్వచ్ఛమైన స్వాతంత్రానికి కమ్మని ప్రతీకలు...పదేళ్లు వచ్చేవరకు మీరేవాళ్ళని సరైన మార్గంలో నడపగలరని ,మీ కొంగు పట్టుకు తిరుగుతారు...నాన్న భుజం,అమ్మ వడి ఇవి డబ్బులు గుంజుకునే ప్రభుత్వ పథకాలు కావురా....అవి చిన్నప్పటి సంతోషానికి ప్రతీకలుగా నిలిచే బాల్యపు ఊయలలు...వాటిమీద ఊగుతూ పిల్లలు ఏనుగు ఎక్కిన సంబరం చేసుకుంటారు...నువు సర్కస్ లో జైన్ట్వీల్ ఎక్కించిన ఆ సంబరం వాళ్ళ మొహాల్లో చూడలేవు...

ఇక చదువంటావా? అది మనం బ్రతకడానికి ఒక దారి చూపిస్తుంది.... చదువంటే పుస్తకం ముక్కునపట్టి,మూడు గంటల్లో పేపరు నింపడం అసలుకాదు...జీవితం చివరివరకు మనం నిరంతర విద్యార్థులమే...కాకపోతే మనం శ్రద్ధ పెట్టము ఏమి నేర్చుకున్నాం అనే దానిమీద...అందుకే వేలకువేలు పోసి చదివిస్తున్నావని అంటున్నావ్ తప్ప,ఈ టైం వాడిని హాయిగా వదిలేస్తే,ఈ సెలవుల తరువాత ఈ తియ్యదనాన్ని గుర్తుచేసుకుంటూ, రేపు నువ్వనుకున్నదాన్ని మించిపోయి ఎదుగుతారు అని తెలుసుకోలేకపోతున్నావు....పిల్లలకి బాల్యపు ఆనందాన్ని దూరం చేయకండి....మీరు ఆ వయసులో ఎలా ఉన్మారో ఊహించుకోండి,వాళ్ళని అలానే తియ్యని బాల్యపు ఊయలలో హాయిగా ఊగనివ్వండి....


Rate this content
Log in