శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Drama Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Drama Inspirational Others

కొత్త కొత్తగా...

కొత్త కొత్తగా...

8 mins
390


కుడికాలు లోపలికి పెట్టి రామ్మా!కోడలిని మురిసిపోతూ ఆహ్వానించుకుంది భానుమతి....ఎర్రనీళ్లు దిష్టితీసి ,బయట పారబోసి రమ్మని చిన్నకూతురు పద్మజకి అందించింది..

ఆమె పళ్లెం పట్టుకుని పారబోసి వస్తుంటే,పెరట్లో చెట్టు కింద వింతకి అలానే నిబడిపోయింది...

ఒసేయ్!పద్దు...తొందరగా వచ్చి మీ వదినకి రూమ్ చూపించు...అక్కడే నిలబడి ఎం చేస్తున్నావ్ ? పద్మజపై అరిచింది భానుమతి..

నువ్వుండమ్మా!చూస్తున్నది నిజమేనా?అంటూ పళ్లెం కిందపెట్టి ,కళ్ళు నులుముకుని ఒకసారి,గిల్లుకుని ఒకసారి మళ్ళీ మళ్లి చూసింది...

నిజమే సుమీ! ముందు ఎవరితో...ఎవరితో ఏంటి?అమ్మకే చెబుదాం! పళ్లెం తీసుకుని ,హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది...

కంగారులో మాలినివదిన కాలు కొంచెం గట్టిగానే తొక్కింది...విచిత్రంగా పద్మజ అరిచింది ,ఏమనుకుంటుందో అని భయం వేసి ..కానీ మాలిని నవ్వుతూ నుంచుంది....

వదినా!సారి...చూసుకోకుండా....

నాకాలు కూడా పెళ్ళిలో ఇలాగే తొక్కిందమ్మా...నీ అర్ధమొగుడు,నాకు పూర్తిమొగుడు నవ్వుతూ హాల్లోకి వస్తున్నాడు అపుడే మోహన్, పద్మజ భర్త(భానుమతి,సంజీవయ్య ల రెండో అల్లుడు)...

అల్లుడుగారూ మనవాళ్ళంతా వచ్చేసారా!పెళ్లి చాలా బాగా చక్కబెట్టేరు..నా కోపిష్టి కొడుకు ఎక్కడ కుప్పి గంతులు వేస్తాడో అనుకున్నాను.మావయ్యకూడా భయంతో బిగుసుకు కూర్చున్నారు...పెద్దల్లుడు ఎక్కడ? చిన్నల్లుడు మోహన్ ని అడిగింది....భానుమతి.

అన్నయ్య కారు వాళ్ళకి డబ్బులిస్తున్నారు....ఆ!,బస్ డ్రైవర్ ఇంకోవెయ్యి ఎక్కువ అడుగుతున్నాడు....సమయానికి లేదు...రాత్రి అంతా మందుకే....నాలుక్కరుచుకున్నాడు మోహన్

పద్మజ చింత నిప్పుల్ని బాణాల్లా వదులుతుంది అప్పటికే...

నేనెక్కడ తాగాను?కావాలంటే వాసన చూసుకో! అ...అత్తయ్యా !ఏమనుకోకుండా వెయ్యి ఇస్తే అన్నయ్యకి ఇచ్చేసి వస్తాను...పాపం పెళ్ళాంపిల్లలు కలవాడు...ఏమైనా కొనుక్కువెళ్తాడు కంగారులో ఏంటో !మాట్లాడుతున్నాడు మోహన్..పద్మజని చూస్తూ...

సంజీవయ్య వెనకే వచ్చి కూతురుకి నెత్తిమీద ఒకటి తగిలించేరు .....పెళ్లి అంటే అవన్నీ మామూలే కదా!అల్లుడిని వెయ్యికోసం అంతసేపు నిలబెట్టచ్చా...లాల్చీలోంచి వెయ్యి తీసిచ్చేరు...

బతుకు జీవుడా!అంటూ బయటపడ్డాడు..కంగారుగా వస్తున్న తోడల్లుడు మోహన్ ని చూసి....హారతి ఇచ్చేరేంటో?అంత హడావుడిగా నడుస్తున్నావ్?వెటకారం ఆడేడు సునీల్ (సంజీవయ్య పెద్దల్లుడు)

మోహన్::మామూలు పొగ రాలేదు అన్నయ్యా!ఇంకా భయం పోలేదనుకో!!

సునీల్:::నీకు మాటకే పొగ వస్తే,బస్లోవస్తూ కూడా ఇంకో రౌండ్ వేసెను...వాసనకి నా పరిస్థితి ఏంటంటావ్ తమ్ముడూ..

పద్మజ:::అందుకే!లోపలికి రండి...అక్కడ మీకోసం సిద్ధంగా ఉంది

సునీల్::::పద్దమ్మా!మీ అక్కకి గాని తెలిసిందో?ఇక్కడే నన్ను వదిలి ,తాను అత్తగారింటికి వెళ్ళిపోతుంది...అప్పుడు ఊళ్ళో నా పరువేంగానూ?రమణారెడ్డి లెవెల్లో బాధపడడానికి ప్రయత్నం చేసేడు

అల్లుడూ! ఆ వెనుకే వినిపించిన పిలుపులోది సంతోషమా? లేక అప్పుడే తెలిసిపోయిందా?అని కంగారుపడ్డాడు...

ఆ వెంటనే భానుమతిని కూడా చూసి..ఏవిటి?ఒక్క రౌండ్ గాలి అంతవరకూ వీచిందా? అనుకున్నాడు..

ఎక్కువ కంగారుపెట్టకుండానే. ..తను ఆతృతని ఆపుకోలేక ముందు తానే ఆ వార్తని చెప్పాలని వచ్చింది.....నువ్వు నాన్నవి కాబోతున్నవయ్యా సునీలు....చేతులు జోడించి దేవుడికి దారిలోనే దణ్ణాలు పెట్టేసుకుంటుంది సంతోషంతో....

అన్నయ్యా!మొదటి అకౌంట్ ఓపెనింగ్ కి నాలుగేళ్లు పట్టిందా!పూర్ అన్నయ్యా?? సునీల్ భుజం చరిచేడు

కాము..నాకౌముదీ..ఎంత మంచి వార్త చెప్పేవు ..నేను నాన్నని ...(కొత్తగా ఉంది ఆ ఫీలింగ్ సునీల్ కి..)అంటూ పరిగెత్తబోతుంటే,,సార్!నా వెయ్యి ఇవ్వకుండానే వెళ్తున్నారు సార్....గట్టిగా అరిచేడు డ్రైవర్

అప్పటికే రోడ్ వదిలి ఇంట్లోకి వచ్చేసాడు సునీల్,గుర్తొచ్చి వెనక్కి తిరగబోతుంటే...మీరెళ్లండి అల్లుడూ!నేనిస్తానులే...సంజీవయ్య చెయ్యి ఊపాడు,వెనక్కి రావద్దంటూ..

అన్నయ్యా! కంగ్రాట్స్ చెప్పింది మాలిని

థాంక్స్ అమ్మా . ఆంటూ లోపలికి పరిగెత్తాడు సునీల్..

అంతా కలిసి వస్తుంటే,గేట్ దగ్గర పనమ్మాయి వాళ్ళతోపాటు నడుస్తూ అంది...కోడలుగారిని అట్టా నిలబెట్టేసేరు ఏంటమ్మా?

నేను కూర్చొమ్మా!అన్నాను...పర్వాలేదు అని నిలబడే ఉంది ఆమె...మీరంతా ఇక్కడ గుడ్డు న్యూసులు సెప్పుకుంటున్నారు..గుడ్డు న్యూసులు అంది దెప్పుతూ...

నిజమేనా ధనం!నేను ఈ పద్మని గది చూపించమన్నాను....గెంతుకుంటా బయటకు వచ్చేసింది బుద్దిలేదు దీనికి...మనమీద నమ్మకంతో కూడా ఎవర్నీ పంపలేదు కూడా!మన ఉద్దారకుడు ఎం చేస్తునాడే ధనం...వాడన్నా పెళ్ళానికి ఇక్కడ కూర్చో !అన్నన్నా చెప్పాలికదా....ఏమనుకుంటుందో ఏమో?అసలే కొత్త....మనమే కలుపుకోవాలి కదా పద్దు!తప్పు జరిగిందన్నట్టు బాధపడింది భానుమతి.

లోపలికి వస్తూ నువ్వు ఒక్కదానివే ఉండిపోయావ?

రా!నేను గది చూపిస్తాను అంటూ తీసుకెళ్ళబోతుంటే..

భానమ్మగారో!మాలినమ్మ వచ్చిన యేలాయిసేసం మన కాముడమ్మ గారు నీళ్లొసుకున్నారు అంది మాలిని ఇప్పటిదాకా ఒంటరిగా వున్నదన్న విషయం మరలించడం కోసం...

కాముడమ్మ కాదు...కౌముది...అంది పద్మజ

పుట్టినప్పుడే సెప్పెనమ్మా!నోరు తిరిగీ పేరు పెట్టమని ...అయినా మీ నాయనమ్మగోరు కామాక్షి కదా!మీ తాతగారు ఆవిడని కాముడూ అనే పిలిసీవోరు అంది నేను మీరు చెప్పినట్టు పిలవను అన్నట్టుగా....

సర్లే!నీ ఇష్టం...వదినకి మంచి కాఫీ కలిపితే,నేను పట్టుకెళ్తాను అంది పద్మజ

మాలిని ఎందుకో బాగా నచ్చింది ధనానికి...మీ అన్నగారికి సరైన మొగుడమ్మా ఆవిడ అంది చూపులకి వెళ్లినపుడే....పద్మజ నవ్వుకుంది ధనం మాటలు గుర్తొచ్చి..

కంగారు పడకండి పద్దమ్మా!నువ్వు కూడా గుడ్డు న్యూసు సెప్పుతావులే!అంది ఆమె నవ్వుకోవడం చూసి..

నీ మాట నిజం అవ్వాలి ధనమ్మా! లేకపోతే మా అన్నయ్యకి నాలుగేళ్లు పట్టింది అన్నానని,శపించే ఉంటాడు ఈపాటికి...నీ మాట జరిగితే నీకు గుడి కట్టిస్తాను అన్నాడు మోహన్...

నవ్వుకుంటూ కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళింది...

ఇటు భానుమతి అపరాధం అన్నట్టు కోడలు కూడానే కూర్చుంది ఒక గంట....ఇందాక సంతోషంలో చూసుకోలేదు మాలిని ...సారీ అమ్మా సునీల్ కొంచెం బాధగా అన్నాడు...ఒకరి తరువాత ఒకళ్ళు సారిల పర్వంలో మునిగితేలేరు మావయ్యతో సహా...

ఈ లోపు ధనం కాఫీ తెచ్చింది...ఇది సుబ్రన్గా

తాగేసి,స్నానం చేసేయండి మాలినమ్మ...కుంకుడుకాయ పులుసు తీసి ఉంచేను ..నీళ్లు పొయ్యిమీద పెట్టిన...ఘడియలో స్నానానికి ఎల్లిపోదురుగానీ అంది ఖాళీ కప్ కోసం నిలబడి....

పద్దు!నువ్వు వదినతో ఉండు...అక్క ఒక గంటలో వస్తుంది...మీరంతా పదండి, టిఫిన్లు కానిచ్చి,తరువాతి సంగతి చూద్దాం అంది భానుమతి..

వదినా! నీ బాగ్ ఏది?...కార్ లో...అంటే కార్ వెళ్లిపోయిందా? నాకు అస్సలు బుద్దిలేదు....నేనెలా మర్చిపోయెను?...విచిత్రంగా చూస్తుంది పద్దు వదిన

వంక

వదినా!వదినా! భుజం పట్టుకు కుదిపింది గట్టిగా

మాలిని::ఆఁ...

పద్మజ::ఏమంటున్నావు వదినా?ఏమైంది?

మాలిని:::ఏ పని సరిగ్గా చేయలేను...useless iam..బాగ్ కారులోనే ఉండిపోయింది పద్మజ సారి వదినా...

ఎం అర్థం కాలేదు పద్దుకి...దీనికి సారి ఎందుకు వదినా? కార్ అబ్బాయి ఫోన్ నెంబర్ అన్నయ్య దగ్గర ఉంటుంది లేదా ఈయన దగ్గర ఉంటుంది...నువ్వుండు...నేను అడిగి వస్తాను అంటూ బయటకివెళ్లింది...

ఎపుడు ఒక్కనిమిషం ఖాళీ దొరుకుతుందా అని చూస్తుంది వచ్చినప్పటినుంచీ....వెంటనే తలుపులు మూసి,మంచంపై పడుకుని తనివితీరా ఏడ్చేసింది...ఒక్కనిమిషం గోదారికి గండి పడ్డట్టు అయింది...తరువాత కళ్ళు తుడుచుకుని కూర్చుంది...ఇపుడు హాయిగా ఉంది...రాత్రి అయ్యగారు చెప్పిన విషయానికి,పందిట్లో కళ్ళు తిరిగి పడితే...నింద మొయ్యాలని ఉగ్గబట్టుకు కూర్చుంది...

తలుపు కొడుతున్నారు...పద్దు వచ్చినట్టు ఉంది...తలుపు తీసింది...తలుపేసుకుని శుభ్రంగా ఏడ్చేశావా?అచ్చు నేను కూడా ఇలాగే చేసెను వదినా?అపుడు మా అత్త తిట్టింది...లచ్చిందేవి నట్టింట్లో ఏడవకూడదు...ఏ విషయం సరిగ్గా చెప్పరు,ఒప్పుకోరు మెట్టింటివాళ్ళు...కోడలు అంటే ఇక్కడ కూతురు కిందే లెక్క...కూతురు కన్నీరు పెట్టకూడదు ...నేను కూడా అమ్మలాంటిదాన్నే అన్న మాట రాదు వీళ్ళ నోటినుంచి...అపుడే మా ఆయన వచ్చి ఒక గంటసేపు మాట్లాడాకా,అమ్మయ్యా అనుకున్నాను...మీ తమ్ముడు గ్రేట్ వదినా....మొగుడ్ని మెచ్చుకుంది...

మాలిని నవ్వి ఊరుకుంది...అలా అయితే ఇది నా చీర....కొత్తది...పెళ్లికి అమ్మ కొంది....నువ్వు కట్టుకో వదినా...సాయంత్రం మేము బయటకు వెళతాం....అపుడు డ్రెస్ తీసుకుంటాం మీకు అంది...

సరే! అని పద్దు చేతిలో బట్టలు అందుకుంది...ఇంతలో రాహుల్ వచ్చేడు...వెల్కమ్ అన్నయ్యా! చాలా గంటల తరువాత భార్యని చూసుకోవడానికి,ఇప్పుడా రావడం?అంది బయటకు వెళ్తూ

ఆగు పద్దు!ఇద్దరూ ఒకేసారి అన్నారు

ఒక్కళ్ళే అంటే ఆగేదాన్నేమో ?ఇద్దరూ ఒకేసారి అంటే లక్ మైన్....నేనే వెళ్లిపోతాను...బై అంటూ వెళ్ళిపోయింది...

అమ్మ!కూర్చోమంది...అందరూ వంట పనుల్లో ఉన్నారు...నీకు బోర్ కొట్టకుండా...

పర్వాలేదు!నేను స్నానం చేయాలి... టైం వేస్ట్ చేసుకోకండి....మీరు వెళ్లొచ్చు...మాట్లాడేవాళ్ళతో మాట్లాడుకోవచ్చు...అంది మాలిని

నిజమేనా!థాంక్స్ మాలిని....వెంటనే బయటకు వెళ్లిపోయాడు..

ఏమిటి?స్వీట్ నథింగ్స్...అప్పుడే లోపలికి వస్తూ అడిగింది పెద్ద వదిన కౌముది

మీ పెళ్ళైన కొత్తల్లో ఉన్నవే! అంది నవ్వుతూ

కౌముది:::ఇక్కడ అంత సినిమా ఉండదని నాకు తెలుసు వదిన్స్...మా అన్నయ్య సంగతి నీకు కూడా తెలిసే ఉంటుంది...కొత్త కదా!బానే కవర్ చేస్తున్నావ్...

మాలిని:::కవరింగ్ అవసరం లేదు వదినా....అంతా రాసి ఉన్నదే...తెలివి ఉంటే ఎవరైనా చదువుకోవచ్చు...

కౌముది:::నువ్వు మా అన్నయ్యకి సెకండు తెలుసుగా అంది....

మాలిని::::భేషూగ్గా!అంది ధీమాగా

కౌముది::::ఎప్పుడంటే అప్పుడు వెళ్లిపోవాలి...తెలిసే ఉంటుంది..

మాలిని:::అప్పుడు ఆలోచిద్దాం....ప్రస్తుతానికి ఇక్కడే...పైగా నేను ఆఫీషల్ పెళ్ళాన్ని...ఆవిడ సంగతి నాకు తెలీదు..

కౌముది:::నువ్వు ఇంత తిక్కగా ఉన్నావ్?ఎలా నచ్చావ్ అమ్మానాన్నకి...

మాలిని:::నేను తిక్కగా ఉండేవాళ్లకే తిక్కలదాన్ని...మంచికి మంచే ఎప్పుడూ...

కౌముది:::బోరింగ్ అంటూ వెళ్ళిపోయింది

రాహుల్...మంచి శంఖిణీ ని పట్టుకోచ్చావ్...నీ మాట వింటుందా ఆవిడ...తమ్ముడు విషయం తెలిసినమీదట అలా అడిగింది...

రాహుల్::కోడలు కావాలి అన్నారు...తెచ్చి ఇచ్చాను...నా పని అయిపోయింది...ఇక నేను ప్రియ తో అమెరికా చెక్కేస్తాను....ఒక్క నెల రోజులు ఓపిక పడితే....ఎవరి దారి వారిది...ఈలోపు పెద్దవాళ్ళు జరిపించే తంతులు ఆపే బాధ్యత నీదే! నువ్వు ఒక్కదానివే నా బాధ అర్థం చేసుకోగలవు అక్కా...తమ్ముడు బ్రతిమాలేడు

సర్లేరా!సాయంత్రం బయటకు అంటున్నారు...నువ్వు ఏదోటి చెప్పి తప్పుకో....ఆవిడ వెళ్తుంది అంది...

భోజనాలు అయ్యాక వరండాలో కూర్చున్నారు అందరూ...పెళ్ళిగోల గుర్తు చేసుకున్నారు....మీరు ఇష్టపడి చెప్పిన స్వీట్ బంతిలో వేయించలేకపోయము అని బాధ పడింది అత్తయ్యా!మా అమ్మ...నాన్నని ఎన్ని తిట్టిందో...నెలరోజులు ముందు నుంచి చెప్పినా చెయ్యలేకపోయారని..చెబుతూ నవ్వుతుంది...

దానిదేం భాగ్యం!ఇపుడు పంపిస్తే ,నేను ఒక్కదాన్నే తింటాను...ఇంకా ఇదే నయం నాకు...అక్కడైతే తినలేకపోదును మాలిని!అత్తరికం వెలగబెట్టాలి కదా...అంది భానుమతి

ఈవిడ కూతురు,నేను అల్లుడులా ఉంది వ్యవహారం లోపల తిట్టుకున్నాడు...

సాయంత్రం బయటకు వెళ్తాము అత్తయ్యా...మాలిని కూడా వస్తుంది మాతో....తన బాగ్ కార్ లో పెట్టనేలేదు అనుకుంటాను...మా చెల్లాయికి బట్టలు కొంటాను నేను అన్నాడు సునీల్...అవునక్కా!అన్నయ్య నాకు కూడా పార్టీ ఇస్తాను అన్నాడు...ఒక పది తగ్గకుండా శాంతి చెయ్యాలి అన్నాడు మోహన్,పొద్దున్ని గూడఁన్యూస్ ని గుర్తు చేస్తూ...

అయితే బాగ్ అక్కడే ఉండిపోయిందా...ఫస్ట్ సక్సెస్ నాదే అనుకున్నాడు రాహుల్...

కొత్తపెళ్లికూతురు ఇప్పుడే బయటకు ఎందుకు?వ్రతం అయ్యాక వస్తుందిలే....మీరు వెళ్ళండి అంది...భానుమతి..

అమ్మా!ప్లీస్...వదిన వస్తే వంద కొబ్బరికాయలు కొడతానని వేంకటేశ్వరుని మొక్కుకున్నాను....ఇవ్వాలే తీర్చేయాలి..ముందు గుడికి...తరువాత షాపింగ్ కి....గారాలుపోయింది పద్మజ .

సరే!తొందరగా వచ్చేయాలి....ముందే చెప్తే కారు ఆపేవాళ్ళం కదా! ఎలా వెళ్తారు?అంది..

క్యాబ్ చెప్పెను మావయ్యా!ఇంకోసారి బాంక్ తెరిస్తే,డబ్బులు తీసుకుంటాం అన్నాడు మోహన్...

తమ్ముడు కట్నం మీద వడ్డీ బాగానే వసూలు చేస్తున్నారు మావయ్యా! మేనల్లుడికి ఖాళీ చెయ్యి..బయటి అల్లుడికి పల్లకీమోతలు ఎక్కువ అయినియ్యి సునీల్ చెణికేడు

నీ తరఫునే పార్టీ ఇస్తున్నాననుకో పెద్దల్లుడూ...డబ్బుదేముంది...చక్కగా సరదా నిండాలి కానీ అన్నాడు సంజీవయ్య...

ఇద్దరు కూతుళ్ళునపుడు ఒక సంతోషం,ఎలాంటి అల్లుడు వస్తాడో అన్న బెరుకుతో మొత్తానికి భయంగానే ఉండేది...కానీ మాలిని వచ్చాక ధైర్యం నిండినట్టు ఉంది పెద్దవాళ్ళు ఇద్దరిలో...

కౌముదికి కూడా మాలిని మీద ఇష్టం మొదలైంది...నేనేందుకు పద్దు,మాలినిలా వాళ్ళతో కలిసి కూర్చోలేదు...ఎవరికోసం ఆలోచిస్తున్నాను?సరైన ఆలోచనే చేస్తున్నాన?అత్తగారిల్లు నరకం చాలా మందికి...సొంతమే అయిన మా అత్తయ్య కూడా నాన్నని ఏదోటి అంటుంది...మాలిని తల్లిదండ్రుల గోడవేలేదు వీళ్ళకి...పైగా మురిసిపోతున్నాడు నాన్న....కూతురుకి పెళ్లి అయితే బయటది అయిపోతోందా??నేనే అన్నీ ఊహించుకుంటున్నానా?

చూద్దాం !వీళ్ళు నన్ను ఎలా ఎస్టిమేట్ వేస్తున్నారో?అనుకుని....నేను రావద్దా₹సాయంత్రం బయటకి అడిగింది అందర్నీ....

వదినగారు!మీరు లేకుండానా??చెప్పాలంటే కొడలికన్నా ఎక్కువ సంతోషం కూతురు వాళ్ళ వంశాన్ని ఉద్దరిస్తుంది అంటేనే! అంటూ ఎత్తేశాడు మరిది మోహన్....

అవునోయ్!ఈ ట్రిప్ కేవలం నీకోసం....మా చెల్లెలు బట్టలు వంక అంతే!అన్నాడు సునీల్ అయిన మీ అక్క,తమ్ముళ్లు ఎం రాజకీయాలు చేస్తారు కౌముది...ఎపుడూ చూడు కౌంటింగ్ టైం లో కాంటెస్టెంట్ లా busy,కోపం,కంగారులో కనిపిస్తారు ఎపుడూ?అడిగేడు సునీల్...

వదిన!తమ్ముడుకి ఏదో అన్యాయం జరిగిపోయింది అని భయపడుతూ ఉంటారు అన్నయ్యా...అందుకే అలా...అంది మాలిని

వాడికేం అన్యాయం జరిగింది?మేమే గడ్డపారకి పట్టుచీరని చుట్టేమని భయపడుతున్నాం సంజీవయ్య నవ్వుతూ అన్నాడు..

నేను గడ్డపారనా?మొహం అద్దంలో చూసుకుంటూ అనుకున్నాడు రాహుల్..

సరే!టీలు కానిస్తే...బయలుదేరుదామా..

అన్నాడు సునీల్ కార్ కి ఫోన్ చెయ్యడం కోసం బయటకి వెళ్తూ...

అన్నయ్యా!ఒక్క నిమిషం...సునీల్ ని పిలిచింది...లోపలికి వెళ్ళి హ్యాండ్బ్యాగ్ తెచ్చింది....నాన్న అక్కడే ఇద్దామనుకున్నారు ,కానీ కూడా అమ్మ వస్తుంది కదా!తాను చక్కబెడుతుందిలే అనుకున్నారు...అప్పటికప్పుడు అన్నయ్యవదినా తొందరగా పాక్ చేసి,పెరు రాసి ఇచ్చేసేరు...ముందుగానే ఇచ్చేస్తే తరువాత...ఛ!అంటే...

ఏంటి మాలిని? కంగారు పడుతున్నావు? భానుమతి అడిగింది

అత్తయ్యా!నేను ఓ మాట చెప్పాలి...అంతకు ముందు ఇవి అప్పజెప్పాలి...తర్వాత బంధుత్వం ఉంటుందో?ఉండదో?..

అందరూ మొహాలు చూసుకుంటున్నారు అర్థం కాక...ఈ రోజే వచ్చింది కదా!దిష్టి తియ్యవే ధనం అని చెప్పి,బయటకి లేదు గుడికి లేదు...పదండి...శుభ్రంగా తినేసి, తొందరగా పడుకోండి....భానుమతిలో ఎదో తెలీని గాబరా మొదలైంది...

అందరూ ప్రయాణం క్యాన్సల్ అయినందుకు బాధగా లోపలికి వెళ్లిపోయారు...మాలిని ఉండిపోయింది...ధనం ఆగింది మాలిని కోసం...ఒక్క సుక్క కూడా రానివ్వకమ్మా!కారణం ఏదైనా సరే!నేను ఈ ఇంటి పనిదాన్నే కాదు...అందరిలో పెద్దదాన్ని కూడా...కొందరి తిక్క తీర్చడానికి కొందరు అవసరం....ఆ మాటకి ఉన్నచోట కూలబడిపోయింది మాలిని...ధనం దగ్గరికి వచ్చి కూర్చుంది...భానమ్మకి కూడా కారణం తెలుసమ్మా....అందుకే పొద్దున్న నిన్ను ఒక్కదాన్నే వదిలేశారు అన్నప్పుడు కంగారుపడింది...

ఇపుడు నిన్ను వదిలి లోపలికి పోయింది...ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటుంది...ఈయనగారు నిర్వాకానికి అంది రాహుల్ ని చూపిస్తూ....

ఏమైనా చెప్తేనే తెలుస్తుంది మాలిని....పుట్టిల్లు గుర్తొస్తే ఆ బాధ చెప్పుకోవదానికి రాహుల్ ఉన్నాడు...ఇంకా వేరే బాధ ఏముంటుంది?కొత్తలో ఇలా ఏడిస్తే బాగోదు మాలిని...సర్ది చెప్పడానికి వచ్చేడు సునీల్

వదినా!ప్రియ గురించి నీకు తెలుసా...అన్నయ్య చెప్పాడా?అక్క చెప్పిందా?పద్దు అనుమానాన్ని బయటపెట్టింది...

తనతో ఇపుడు రిలేషన్ లేదు ...తాను వెళ్ళిపోయింది విదేశాల్లో settle అయిపోయింది...

తను ఉంది మాలిని...పెళ్లికి కూడా వచ్చింది...ఆశ్చర్యన్గా మొహాలు చూసుకున్నారు పద్దు,సునీల్,మోహన్ లు

మేము అక్కడే ఉన్నాముగా??

నా రూంకి వచ్చింది...మాట్లాడింది..నేను సరే !అన్నాను

దేనికి?

ఇక్కడ నేను ఉంటాను...అక్కడ తాను ఉంటుంది...ఈయన కూడా అక్కడే ఉంటారు...అని చెప్పింది

బొమ్మలాట ఇదేమైనా?ఇంత జరిగితే నాకు చెప్పొద్దూ...అప్పుడే మొగుడు తప్పులు దాస్తున్నాను అనుకున్నావా?? మాలిని చెంప చెళ్లుమనిపించింది భానుమతి...

అమ్మా!తనని ఎందుకు కొడతావ్? తప్పు చేసింది నేను!గట్టిగా అరిచేడు రాహుల్...

నిన్ను కొట్టలేక దీన్ని కొడుతున్నానురా ! కోడల్ని కొట్టే హక్కు అత్తలకి ఎప్పటినుంచో ఉంది...ఇంకోసారి చెంప చెల్లుమనిపించింది భానుమతి .

ఇంకోసారి కొడితే ఊరుకునేది లేదు....నువ్ పద మాలిని అంటూ లోపలికి తీసుకుపోయేడు..

అంతా ఆరవ సినిమా చూసినట్టు చూస్తున్నారు...ధనమ్మకి ముందు కోపం వచ్చినా,చివరి సీనుకి భానుమతికి వందమార్కులు వేసేసింది...

ఏమైంది?అత్తయ్యా...కాళిక అవతారం ఎత్తేవ్ ఎపుడూ లేనిది?సునీల్ కంగారుపడ్డాడు

బంగారం అని మేము వెతికింది నచ్చదురా? మీకు...ఎపుడూ మీ ఛాయిస్ కరెక్ట్...పెద్దోళ్ళు మొద్దులు కదా!పెళ్లికి ముందు తిరిగితే తిరిగేడు...

బుద్దిగా ఉంటాడని నేను కూడా ప్రియ గురించి మాలినికి చెప్పెను....వీడు తనకి కావాల్సినట్టు చెప్పేడు...ఈవిడ పెద్ద సుమతిలా మిగిలిపోతుందట...సినిమానా ?ఇది....చచ్చేవరకూ నిలుపుకోవాల్సిన బంధం....ఇది ...దీనికి నేను పద్దతిగా చెప్తే వాడి మాట వింటుందీ??అందుకే అత్తలు రాలక్షసులుగానే ఉండాలి...

ఒక్క రోజు కల్లోలం అయిపోయింది కొంప...అంతయితే గానే వీడు దారికి రాలేదు...అమ్మ కోడితేనే,ఆరుస్తున్నాడు చూడు నా మీదే....వీడి తప్పు గుర్తుకు రాలేదేమో?అపుడు...

పెళ్లి సమయంలో తుళ్ళి పడాల్సిన పిల్ల,వీడి మాటలకి మానయింది...పొద్దున్న మీ సంతోషంలో పడి ,మర్చిపోతే అలానే నుంచుంది....అందుకే కాబోలు....ఇంకో నాలుగు పీకాలి దాన్ని....అంది కోపంతో ఊగిపోతూ

ఇంక చాల్లేవోయ్!అంతా సర్దుకున్నారు...అల్లుడ్లు మీద ఎందుకు నీ ప్రతాపం...మార్పు కోతి సహజమో?మానవ సహజమో?అక్కడ చూసిరా అన్నాడు సంజీవయ్య కొడుకు గది చూపిస్తూ...

ఉరుకు పరుగుతో బయలుదేరింది కొడుకు గది వైపు...తలుపు వేసి ఉంది...అమ్మకి కోపం కొంచెం ఎక్కువే? నువ్వు అలవాటు చేసుకోవాలి...నువ్వు మంచిదానివి కాబట్టి,అమ్మకూడా తొందరగానే మారిపోతుంది....ఇంక ఏడవొద్దు మాలిని ప్లీస్ అంటున్నాడు...

మనసులో నవ్వుకున్నా,ఒసేయ్!మాలిని రావే బయటకి...గర్జించింది భానుమతి

తలుపు తెరుచుకుంది...కొడుకు బయటకు వచ్చేడు..పిలవరా దాన్ని బయటకి?నా పరువు తీసేసింది ఒక్క రోజుల్లోనే?బుద్దిలేనిది....దీన్న నేను ఇష్టపడి చేసుకున్నాను...చీ!గాడిద

అమ్మా!ఆపు ప్లీస్...కొత్తకదా!నేను చెప్తాను...నువ్వు అనుకున్నట్టే ఉంటుంది...భయపడిందమ్మా బాగా!నేను చెప్తాను....ఒక గంట టైం ఇవ్వు...

ఒకే ఒక గంట...ఆ తరువాత జుట్టు పట్టుకు బయటకి ఈడ్చేస్తాను దాన్ని....

సరే!అమ్మ...ఇపుడు వెళ్లిపో...దణ్ణం పెట్టేడు రాహుల్

వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది పాచిక పారినందుకు...

కొత్తకోడలు,లచ్చిందేవి....అన్నావు....లచ్చిందేవిని తిట్టే తిట్లా అవి?సంజీవయ్య వెక్కిరించేడు..

సంసారంలో గొడవలు ఆడవాళ్లు సర్దేయాలి...మగాడిదాకా పోతే చిరాకు ఎక్కువయి,మొదటికే మోసం వస్తుంది....అయిన నేను నా లచ్చిందేవిని తిట్టుకున్నాను ,మీకెంటంటా?అంది ఉడుక్కుంటూ

ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా సంసారంలో ప్రతి విషయం,,ఎప్పటికపుడు కొత్తగా ఉంటుంది....తెలిసిందే అయినా కూడా...సంజీవయ్య తన భార్య ,మాలినిని తిట్టడం వెనుక ఆంతర్యాన్నీ తలుచుకుంటూ.....

అమ్మో!ఈ కథలో నేను చివరివరకూ ఉండి ఉంటే...నన్ను చంపేసేది తల్లినవుతున్నానని కూడా చూడకుండా అనుకుంది కౌముది.

అమ్మయ్యా)!వదిన ...మా వదినే అన్నమాట...వినడానికి హాయిగా ఉంది అనుకుంది పద్దూ...

మీ ఇంట్లోంచి ఏ విషయమూ బయటకు రాదుగా .....భార్యను తిట్టుకున్నాడు మోహన్

సునీల్ కి కధ అర్థం అయి,అవ్వకుండా ఉంది...మీమాంసలో ఉండకండి...ఆడపిల్ల పుడుతుంది అంది కౌముది...

ఒకేసారి అమ్మాయి,అబ్బాయి రావాలంటే ఎలా ఉండాలి కాముడు?ఎమ్ తెలీనట్టు అడిగేడు సునీల్..

నటించకూడదు బావా!అంది పద్దు

అమ్మగారూ కార్ వచ్చింది..ధనం కేకకి ఈ లోకానికి వచ్చేరు అందరూ

జంటలిద్దరూ లేవబోతుంటే...వాడిపెళ్ళానికి బట్టలు కావాలంటే వాడూ,అదీ కలసి వెళ్తారు...మీ హడావుడి ఏంటి మధ్యలో అంది భానుమతి...

ధనం తలుపుకొట్టింది...కార్ వచ్చింది...బట్టలుకోసం యెళ్లాలంట...అంది బుర్ర గోక్కుంటూ

ఫ్రెష్ అవ్వు మాలిని....నేనే కొంటాను నీకు...ఎవ్వరూ డబ్బులు కూడా నాకు అవసరం లేదు అన్నాడు హాల్లో కూర్చుని షూ వేసుకుంటూ...

అత్తయ్యా!వెళ్ళొస్తాను...అంది

నీకో నమస్కారం తల్లి...కోరి తెచ్చుకున్నందుకు కొరివి పెట్టావ్ మాకు అంది దణ్ణం పెడుతూ...

అత్త కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది మాలిని...రాహుల్ కూడా వచ్చేడు...నన్ను క్షమించు అమ్మా!నాకిపుడు తప్పు ఏంటో అర్థమౌతుంది...ఇంక నాకోసం తనని బాధ పెట్టె మాటలు ఆనొద్దు...రాహుల్ కళ్లల్లో నీళ్లు చూడలేకపోయింది....ఇద్దర్నీ దగ్గరకి తీసుకుని చెప్పింది...జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయిరా...నీకంటూ వచ్చిన అమ్మాయి ,భార్యగా...తల్లిగా...అవతారం మారుస్తూ..నిన్ను కూడా భాగస్తుడిని చేస్తుంటే....ఇపుడు నిన్ను మనిషిగా మార్చినట్టు...అంటూ నవ్వింది

ఇపుడు అందరూ వెళ్ళండి అంది సంతోషన్గా....అమ్మ!రెండుసార్లు చీర కట్టి,మార్చేను...చిరాకు వచ్చింది వాళ్లనే వెళ్ళమను అంది పద్మజ...

అవునమ్మా!ఈ గొడవలో పడి నా విషయం మర్చిపోయేవ్...నాకు నీరసంగా ఉందమ్మా...కింద పడబోయింది...వదినా!జాగ్రత్త....అంటూ పట్టుకోబోయింది మాలిని

మా తమ్ముడు మనసు మారకుండా నువ్వెళ్ళమ్మా తల్లి!నేను మా అమ్మలాగ చేద్దాం అనుకున్నాను అంది విసుగ్గా తన జోక్ ప్లోప్ అయినందుకు కౌముది

అమ్మ అయ్యాక అమ్మలా చెయ్యాలి కాముడూ....ఇంకా నువ్వు మొదటి దశలో ఉన్నావు...నిజంగా కళ్లు తిరిగి పడిపో!జ్యూస్ అన్నా దొరుకుతుంది అన్నాడు.సునీల్

నేను నిమసంలో తెత్తాను కాముడమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళింది ధనం...

అంతా కొత్తగా ఉంది రాహుల్ కి...మాలిని మరియు తన మొదలవ్వబోయే కొత్త జీవితం కూడా...కొత్తగా నచ్చడం మొదలుపెట్టింది..శుభమ్


Rate this content
Log in

Similar telugu story from Drama